తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న పెరిక కుల బంధువులతో సమావేశం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం కృషి చేస్తున్నది.
- తెలంగాణా రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ గారు.
విజయవాడలో ఉన్న పెరిక కుల భవనాన్ని సందర్శించిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఘటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య మరియు కుల నాయకులు.
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల నాయకులను సాదరంగా ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు కత్తిక రాఘవరావు గారు కార్యవర్గం.
విజయవాడ కనకదుర్గమ్మ ఆశీర్వాదాలు తీసుకున్న ఉమ్మడి రాష్ట్ర నాయకులు.
విజయవాడ-2026 జూన్ 8 :
దేశంలోని వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న పెరిక కుల బంధువులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో అఖిల భారత పెరిక సంఘం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్ గారు తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షుడు మద్దాలింగయ్య గారు, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట పెరిక కుల భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగారి మనోహర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్ గార్లు ఇతర ముఖ్య కుల నాయకులతో కూడిన 16 మంది ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక కుల సంఘం నిర్మిస్తున్న పెరిక భవనాన్ని 2026 జూన్ 8న సందర్శించింది.
ఈ సందర్భంగా తెలంగాణ బృందానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు కత్తిక రాఘవరావు గారు, ప్రధాన కార్యదర్శి నరిశెట్టి చంద్రశేఖర్ గారు,రాష్ట్ర కోశాధికారి రావి సూర్యనారాయణ గారు, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి బిట్టు రమేష్ గారు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పెరిక కుల సంఘాల కార్యవర్గ సభ్యులు కలిసి విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఘటిక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో ఉన్న పెరిక కుల ప్రముఖులను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు హైదరాబాద్లో త్వరలో ఒక జాతీయ స్థాయి సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక కుల సంఘ కార్యవర్గాన్ని కలుసుకుని వారు నిర్మిస్తున్న పెరిక భవనాన్ని సందర్శిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు కత్తిక రాఘవరావు గారి తండ్రి కత్తిక పూర్ణచంద్రరావు గారు గుంటూరు హైవేకు ఆనుకొని విలువైన స్థలాన్ని భవన నిర్మాణం కోసం అందించడం అభినందనీయమని అన్నారు. ఆ స్థలంలో రాష్ట్ర కార్యవర్గం కుల బంధువుల సహకారంతో విరాళాలు సేకరించి అద్భుతమైన పెరిక భవనాన్ని నిర్మిస్తున్న తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
అనంతరం తెలంగాణ బృందం కత్తిక పూర్ణచంద్రరావు గారి నివాసానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రతినిధి బృందానికి దుర్గగుడి దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సందెల లింగం గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర కుల సంఘం అధికార ప్రతినిధి దొంగరి శంకర్ గారు, పెరిక విద్యార్థి వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చా రఘు కుమార్ గారు, నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్ గారు, పెరిక విద్యార్థి వసతి గృహం కోశాధికారి బల్దూరి రవికుమార్ గారు, గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు గారు, న్యాయవాదుల విభాగం కోఆర్డినేటర్లు జూకూరి మహేష్ గారు, అక్కల తిరుపతి వర్మ గారు తదితరులు పాల్గొన్నారు.