తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల బంధువులకు గొప్ప శుభవార్త
పెరిక మహిళా వసతిగృహం కోసం ఖరీదు చేసిన 395.5 గజాల స్థలానికి ఈరోజు బుధవారం (08-10-25) రిజిస్ట్రేషన్ పూర్తి.
కుల పెద్దలు, కుల బంధువుల సమక్షంలో భూ యజమాని నుండి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వీకరించిన వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్.
డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు అధ్యక్షులుగా విద్యార్థి వసతి గృహ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించగానే కుల పెద్దల సహకారంతో మహిళా వసతి గృహం కోసం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో మార్కెట్ ధర కంటే అత్యంత తక్కువ ధరలో 395.5గజాల స్థలం ఖరీదు చేసి ఈరోజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ స్థల పరిశీలన మొదలుకొని రిజిస్ట్రేషన్ పూర్తయ్యేంతవరకు వసతి గృహ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్, కోశాధికారి బాల్దూరి రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయకుమార్లు స్థలం కొనుగోలు విషయంలో విశేష కృషి చేసారు, ఒక మంచి స్థలం నిర్ధారణ చేయడానికి కమిటీ వేసి రాష్ట్ర అధ్యక్షుడు మద్దాలింగయ్య, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ ఘటిక విజయ్ కుమార్ ఇంకా కుల పెద్దలు ఉన్న కమిటీ పలు స్థలాలు పరిశీలన చేసి ఎల్బీనగర్ మెట్రో కు అతి సమీపంలో ఉన్న ఈ స్థలం మహిళా వసతిగృహానికి అనుకూలంగా ఉంటుందని భావించి యజమానులతో సంప్రదించి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసి ఈరోజు బుధవారం (08-10-25)భూ యజమాని నుండి రిజిస్ట్రేషన్ పత్రాలు స్వీకరించారు. ఈరోజు చివరి వాయిదా చెల్లించడంతో భూ యజమాని రంగారెడ్డి జిల్లా, సరూర్ నగర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్స్ కుల పెద్దలకు అందజేశారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో 4 వ పెరిక భవన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.మొదటగా హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహం,
రెండవ పెరిక భవన్ ఉప్పల్ లో ఉండగా,
మూడవది అత్యంత ప్రతిష్టాత్మకంగా కోకాపేటలో పెరిక భవన్ నిర్మితమవుతున్న విషయం తెలిసిందే,ప్రస్తుతం ఖరీదు చేసిన స్థలంలో మహిళా వసతి గృహం కోసం నాలుగో పెరిక భవన్ నిర్మాణానికి హాస్టల్ కమిటీ ప్రయత్నాలు త్వరలో ప్రారంభిస్తుంది. ఈ స్థలం గుర్తించడం నుండి అత్యంత తక్కువ ధరకు స్థలం వచ్చేందుకు విశేషంగా కృషి చేసిన ప్రముఖ రియల్టర్, వసతి గృహం వైస్ ప్రెసిడెంట్ దొంగరి శంకర్ గారికి ఈ సందర్బంగా హాస్టల్ కార్యవర్గం, కుల పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమానికి ఇంకా రాష్ట్ర అధ్యక్షులు మద్దాలింగయ్య, పూర్వ వసతి గృహ అధ్యక్షులు, పెద్దలు దాసరి మల్లేశం, కోకాపేట భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మి శేఖర్, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్,రాష్ట్ర సంఘం ఆర్థిక కార్యదర్శి దొంగరి మనోహర్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరి వీరభాస్కర్, రాష్ట్ర నాయకులు దొంగరి శంకర్, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల బాలరాజ్ శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోలిశెట్టి సతీష్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రామినేని వెంకటేశ్వర్లు,ఎల్ బి నగర్ సభ్యులు దివి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.