తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
కో ఆర్డినేటర్
అబుదాబిలో జరిగిన ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ ను మట్టి కల్పించిన తెలుగు తేజం
పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత భారత బ్యాట్మెంటన్ కి ఆశాదీపంగా మారిన వలిశెట్టి శ్రియాన్షి.
అజర్ బైజాన్ పర్యటనలో ఉన్న శ్రియాన్షిని అభినందించి, అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.
ఫిబ్రవరి మొదటి వారంలో శ్రీయాన్సీకి పెరిక సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
భారత దేశ మహిళా బ్యాడ్మింటన్ రంగానికి మన పెరిక బిడ్డ భవిష్యత్తు ఆశాకిరణంగా మారింది. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో అనేక పోటీల్లో రాణించి భారతదేశం మూడవ ర్యాంకు సాధించిన మన పెరిక బిడ్డ, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ గారి కూతురు వలిశెట్టి శ్రియాన్సీ తాజాగా అంతర్జాతీయ వేదికల్లో సత్తా చాటుకున్నది.
తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరిగిన ఆల్ ఇన్ మాస్టర్స్- 2025 టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ సాధించింది. సెమీ ఫైనల్లో ఇండోనేషియా కు చెందిన చియారా మర్కెళ్ళా పై విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్ లో ప్రపంచ జూనియర్ నెంబర్ వన్ ర్యాంకర్ తస్నేమ్ మీర్ పై ఘన విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. దీంతో శ్రీయాన్సీ తన ర్యాంకును మెరుగుపరచుకొని వరల్డ్ 59వ ర్యాంకు సాధించారు. వచ్చే ఒలంపిక్స్ లో అర్హత సాధించడానికి మరింత చేరువయ్యారు. ప్రస్తుతం అజర్ బైజాన్ లో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. హైదరాబాదులోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రియాన్షి ఈ సంవత్సరం మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంటులో కూడా పాల్గొన పోతున్నది.
అజర్ బాయ్ జాన్ పర్యటనలో ఉన్న శ్రియాంషితో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ఫోన్లో మాట్లాడి అభినందించారు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ తర్వాత తెలుగు రాష్ట్రాలకు, భారతదేశానికి పేరు తెచ్చే గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతావని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఆమె రాణించడానికి, శిక్షణకు, అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర పెరిక సంఘం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అజర్ బైజాన్ పర్యటన ముగించుకొని మళ్లీ హైదరాబాద్ వచ్చిన తర్వాత రాష్ట్ర పెరిక సంఘం ఆధ్వర్యంలో రియాన్షిని ఘనంగా సన్మానించనున్నట్లు ఘటిక విజయ్ కుమార్ ప్రకటించారు. తండ్రి ఎస్సై రామకృష్ణ తో కూడా విజయ్ కుమార్ మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు.
శ్రియన్షిని రాష్ట్ర పెరిక సంఘం గౌరవ అధ్యక్షులు మద్ద లింగయ్య, పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, పెరికకుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, పెరిక సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్, పెరిక పరపతి సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్ తదితరులు అభినందించారు.
కోదాడ, 01-05-2026
గ్రామీణ పరిస్థితులు, అవకాశాల కొరత… ఇవన్నీ అడ్డంకులు కాదని నిరూపిస్తూ పట్టుదలతో ముందుకెళ్లిన మన పెరిక కుల యువ క్రీడాకారుడు కీత శ్రీనివాస్ రావు గారు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటి బంగారు పతకాలు గెలవడం మన కులానికి గర్వకారణం అని సూర్యాపేట జిల్లా పెరిక కుల అధ్యక్షుడు బంధు శ్రీధర్ బాబు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలానికి చెంది కఠిన సాధనతో ప్రపంచ స్థాయి పోటీల్లో తన ప్రతిభను రుజువు చేసి జిల్లాకు, మన కులానికి గర్వకారణంగా నిలిచిన సందర్భంగా ఈరోజు కోదాడ పట్టణంలోని వారి స్వగృహంలో కీత శ్రీనివాసరావు గారిని కలిసి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బందు శ్రీధర్ బాబు కుల బంధువులతో కలిసి ఘన సన్మానం చేశారు.
మలేషియాలో ఏప్రిల్ 17 నుండి 19 వరకు నిర్వహించిన వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్షిప్–2026లో పాల్గొన్న శ్రీనివాస్ రావు స్విమ్మింగ్, అథ్లెటిక్స్ విభాగాలలో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం, అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను ఎగరవేసిన ఈ విజయం మనందరికీ గర్వకారణంగా నిలిచిందని బందు శ్రీధర్ బాబు అన్నారు.
ఈ విజయాన్ని అందుకున్న సందర్బంగా జిల్లా అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబుతో పాటు, కోదాడ హాస్టల్ అధ్యక్షుడు హసానబాధ రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిలి వెంకటనారాయణ, గౌరవ అధ్యక్షులు రామినేని సత్యనారాయణ, కోదాడ హాస్టల్ గౌరవ అధ్యక్షుడు, జిల్లా ముఖ్య సలహాదారు పాయిలి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బాల్తు శ్రీనివాస్, బంధు వీరయ్య, తొగరు మల్లికార్జున్, బొలిశెట్టి మధు, నిర్మాణ కమిటీ సభ్యులు తిపిరిశెట్టి రాజు గార్లు తదితరులు జిల్లాకు పేరు తీసుకువచ్చిన కీత శ్రీనివాస్ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.