తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
కో ఆర్డినేటర్
పెరికకుల అస్తిత్వాన్ని నిలబెట్టింది, కులానికి గుర్తింపు తెచ్చింది ఖైరతాబాద్ పెరిక భవన్.
చదవకుండా విషయ, భాషా పరిజ్ఞానం లేకుండా జర్నలిజంలో రాణించలేరు.
బీసీ ఉద్యమంలో రాణించాలంటే నాయకత్వ స్థానంలో ఉండి పోరాడండి.
రాష్ట్ర జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ.
*******
రాష్ట్ర సంఘ అభివృద్ధి కార్యక్రమాలను మన సంఘీయులకు చేర్చడంలో మన జర్నలిస్టులు ముందుండాలి,
ఇతర కులాల కంటే భిన్నంగా, మనం చాలా ఐక్యంగా ఉండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం.
జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనంలో సీనియర్ జర్నలిస్ట్, కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్.
*****-
జర్నలిస్టులు తమ విద్యా స్థాయిని మెరుగుపరుచుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలి.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వడ్డానం శ్రీనివాసరావు.
******
అవకాశం ఉన్న మన కుల జర్నలిస్టులు పెరికకుల కో-ఆపరేటివ్ సొసైటీలో సభ్యులుగా చేరాలి, అవసరం ఉన్న జర్నలిస్టులకు సొసైటీ ద్వారా రుణాలను అందించాం.
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్.
*******
రాష్ట్ర పెరికకుల జర్నలిస్టులను ఒకే వేదికపై చూడడం ఆనందంగా ఉంది, రాష్ట్ర సంఘం అభివృద్ధి కార్యక్రమాలకు మీరు అండదండగా ఉండాలి.
రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎల్బీనగర్ జోన అధ్యక్షులు సుందరి వీర భాస్కర్.
హైదరాబాద్ :
పెరిక కుల జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం ఖైరతాబాద్ లోని పెరిక కుల విద్యార్థి వసతి గృహంలో ఈరోజు ఆదివారం (09-03-2025)ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెరికకుల బాంధవులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు ముఖ్యఅతిథిగా హాజరు కాగా, సీనియర్ జర్నలిస్ట్, కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు.
రాష్ట్ర పెరిక సంఘం సీనియర్ నాయకులు రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, భవనం నిర్మాణ కమిటీ కోకన్వీనర్ చుంచు ఉషన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ వడ్డాణం శ్రీనివాసరావు, రాష్ట్ర పెరిక సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, ఆర్థిక కార్యదర్శి దొంగారి మనోహర్ ,పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరి వీరభాస్కర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంధు శ్రీధర్ బాబు,రాష్ట్ర నాయకులు దొంగరి శంకర్, పెరిక విద్యార్థి వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చా రఘు కుమార్, ఆర్థిక కార్యదర్శి బాల్దూరి రవి, రాష్ట్ర నాయకులు దొంగరి శంకర్, యగ్గడి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు మైలారిశెట్టి చైతన్య, పెరిక ధాత్రి ఎడిటర్ కానుగంటి వీరన్న,బరపటి సంపత్ కుమార్, పెరికనాడు ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు ముద్దసాని రామచందర్, ధనియాకుల వెంకటేశ్వర్లు ఇంకా వివిధ జిల్లాల నుండి అనేక మంది జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కుల జర్నలిస్టుల అసోసియేషన్ ఏర్పాటు చేయాలని, పెరిక విద్యార్థి వసతి గృహం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టుల భాగస్వామ్యంతో ఒక సావనీరు తయారు చేయాలని తీర్మానాలు చేయడం జరిగింది.