హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ బి. మురళి మోహన్ గారు పెరిక కులస్తులకు ఉచిత వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాము.
పురాలశెట్టి శేషయ్య గారి శ్రీ మంజు హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పెరిక సంఘం రాష్ట్ర నాయకులు
డాక్టర్ పురాలశెట్టి ప్రవీణ్ గారిని అభినందించిన నాయకులు
పెరిక సంఘం సీనియర్ నాయకులు శ్రీ పురాలశెట్టి శేషయ్య గారు, వారి కుమారుడు పురాలశెట్టి ప్రదీప్ మరియు డాక్టర్ పురాలశెట్టి ప్రవీణ్ కుమార్ కి చెందిన శ్రీ మంజు హాస్పిటల్ హైదరాబాద్ లోని కొండాపూర్ లో 2026 మార్చి 8న ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, రాష్ట్ర సంఘం అసోసియేటర్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, సంక్షేమ సమితి కోశాధికారి బోడపుంటి ప్రకాష్ తదితరులు పాల్గొని శేషయ్య గారిని అభినందించారు
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్సీ బెడద సత్యనారాయణ, పురాణశెట్టి చెంచయ్య, పురాలశెట్టి భాస్కర్, పురాల శెట్టి శ్రీధర్, బోడపుంటి వినయ్ తదితరులు పాల్గొన్నారు