తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
గౌరవ అధ్యక్షుడు
అసోసియేట్ అధ్యక్షుడు
యువజన విభాగం అధ్యక్షుడు
ప్రభుత్వం వివిధ కులాలకు కేటాయించిన స్థలాల్లో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా విడుదలయ్యే నిధులను కులాల వారీగా విభజించి జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాలని కోరారు.
2026 ఫిబ్రవరి 22న నిర్మల్ జిల్లా పెరిక సంఘం సమావేశం జిల్లా అధ్యక్షుడు చుంచు భూమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, కోశాధికారి సందేల లింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకుడు శ్రీధర్ల జగదీష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తోట లచ్చన్న సమావేశ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పెరిక సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా చుంచు భూమయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా సంగం వెంకట రాజు, యువజన విభాగం అధ్యక్షుడిగా బోగ కోటేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన పెట్టం చంద్ర శేఖర్ (రంగ పెట్), సంగం వెంకట రాజు (కనకాపుర్), బొడకుంటి నరేష్ (పెరక పల్లి), పలువురు ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం జరిగింది.
1958 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు సాగునీరు అందిస్తున్న కడెం ప్రాజెక్టును రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఊశన్న, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోశాధికారి సందెల లింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, నిర్మల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చుంచు భూమన్న తదితరులు సందర్శించారు. నిర్మల్ జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులను జిల్లా నాయకులు కడెం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లారు. ప్రాజెక్టులోని మొత్తం 18 గేట్లను, ప్రాజెక్టు తూములను, కాల్వలను నాయకులు సందర్శించారు. ఎస్.ఆర్.ఎస్.పి. నుంచి అనుసంధానం అయ్యే సరస్వతి కాలువను తిలకించారు. కడెం ప్రాజెక్టు నుంచి గోదావరి నదికి నీరు వెల్లే మార్గాన్ని పరిశీలించారు.
నిజాం ప్రభుత్వంలోనే డిజైన్ చేసి, ఎత్తయిన కొండల మధ్య ఈ ప్రాజెక్టును నిర్మించారు. నిల్వ ఉన్న నీరు స్థానికంగా దాదాపు 600 ఎకరాలకు సాగునీరుగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు ద్వారా చాలా పెద్ద మొత్తంలో నీరు గోదావరిలోకి చేరుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటగా నిండే ప్రాజెక్టుగా, గోదావరికి మొదట స్వాగతం చెప్పే ఉపనదిగా కడెం నిలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన నిర్మల్ జిల్లాలో పెరిక కుల సంఘం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవనం కోసం 5 లక్షల విరాళం ప్రకటించింది. ఇందులో మొదటి విడతగా కడెం మండల పెరిక సంఘం తరుఫున లక్షన్నర రూపాయలు వసూలు చేసింది. లక్షన్నర రూపాయల చెక్కును ఆదివారం కడెంలో జరిగిన జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గారు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారికి అందించారు. మిగతా మండలాల పెరిక సంఘం కమిటీలు కూడా త్వరలోనే కోకాపేట భవన నిర్మాణానికి విరాళం అందించనున్నట్లు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఊశన్న, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోశాధికారి సందెల లింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకుడు శ్రీధర్ల జగదీష్, నిర్మల్ జిల్లా గౌరవ అధ్యక్షులు చుంచు భూమన్న, అసోసియేట్ అధ్యక్షుడు సంగం వెంకటరాజు, యువజన విభాగం అధ్యక్షుడు భోగ కోటేశ్, రంగంపేట సర్పంచ్ పెట్టెం చంద్రశేఖర్, కనకాపూర్ సర్పంచ్ వెంకటరాజు, పెరకపల్లి సర్పంచ్ బోడకుంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కోకాపేట భవనానికి ఉదారంగా విరాళం అందించిన నిర్మల్ జిల్లా పెరిక సంఘం నాయకులను రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ అభినందించారు. హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.