తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అనారోగ్య భాదితుడిని ఆదుకున్న పెరిక కుల సంక్షేమ సమితి, కుల బంధువులు.
బాధితుడిని ఆడుకోవాలని చొరవ చూపి ఆర్థిక సహాయం అందేలా చేసిన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబును అభినందించిన రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, కుల బంధువులు.
పెరిక విద్యార్ధి వసతి గృహం మాజీ అధ్యక్షులు అంగీరేకుల నాగార్జున,బందు శ్రీధర్ బాబు గార్ల చేతుల మీదుగా భాదితుడికి చెక్ అందచేత.
సూర్యాపేట జిల్లా, గుంజలూరు గ్రామ నివాసి సుంకరి నాగభూషణం షుగర్ వ్యాధి తీవ్రతతో తీవ్ర అనారోగ్యానికి గురి అయి, నన్ను ఆదుకోవాలని కుల బంధువులను కోరడంతో పెరిక కుల సంక్షేమ సమితి నుండి 31,000/-రూపాయలు, సూర్యాపేట కు చెందిన రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు వాట్సాప్ ద్వారా విషయం తెలిపి ఆదుకోవాలని కోరడంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న కుల బంధువులు స్పందించి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు పంపారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంక్షేమ సమితి మరియు వివిధ ప్రాంతాల నుండి కుల బంధువులు స్పందించి పంపిన మొత్తం 1,28,500/-రూపాయల సహాయం (ఒక లక్షా ఇరవై ఎనిమిది వేల అయిదు వందల రూపాయలు) సుంకరి నాగభూషణం గారికి గురువారం ( 6.11.25)న అందచేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంక్షేమ సమితి సభ్యులు, విద్యార్థి వసతి గృహం మాజీ అధ్యక్షులు, సూర్యాపేటకు చెందిన అంగిరేకుల నాగార్జున గారు, రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు కలిసి సూర్యాపేట జిల్లా, గుంజలూరు గ్రామ సర్పంచ్ సుంకరి హనుమంత రావు గారు, ఇతర కుల బంధువుల సమక్షంలో నాగభూషణం గారికి ఈ డబ్బులు అందించారు.
ఇచ్చిన డబ్బులను సక్రమంగా వైద్యానికి ఖర్చు చేయాలని, అనారోగ్యం నుండి కోలుకోవాలని వారికి ధైర్యం చెప్పారు.
పెరిక కుల సంక్షేమ సమితి సభ్యులకు, స్పందించి డబ్బులు పంపిన కుల బంధువులకు మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
ఈ కార్యక్రమంలో గుంజలూరు గ్రామ కుల బంధువులు గోదేశి సతీష్,మార్త సైదులు,కోనకంచి సైదయ్య,కోనకంచి అంజయ్య,కోనకంచి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
2024 సెప్టెంబర్ లో భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా నష్టం జరిగింది.
ఖమ్మం వరద బాధితులకు 50 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 50kg ల బియ్యం, ఉప్పు, నూనె, పప్పు, కారం....ఇతరత్ర వంట సామాగ్రిని అందజేసిన పెరిక సంక్షేమ సమితి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మద్దా లింగయ్య, ఆత్మగౌరవ భవన కమిటి చైర్మన్ గటిక విజయ్ కుమార్, సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మి శేఖర్, నాయకులు కుంచాల శ్రీనివాస్, సుందరి వీర భాస్కర్, అచ్చ రఘుకుమార్, దొంగరి శంకర్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు బందు సూర్యం తదితరులు.