తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
తెలంగాణ పెరిక కుల సంక్షేమ సేవా సమితి TPKSSS
ఈ సంస్థ ఆవిర్భావము 2022లో ప్రభుత్వం సొసైటీ గా రిజిస్టర్ అయ్యింది No.271/2022. చిరునామా. మద్దా లింగయ్య గారి చిరునామా ఇం.నెం. 8-2-503/C, Road No.7, Banjarahills, Hyderabad, Regd.Under Telangana Societies Registration AC 2001 – 19.08.2022.
గతంలో నిరుపేదలైన పెరిక కుల బంధువులు ఎవరైనా అనారోగ్య కురణాణలతో, ప్రమాదాలతో, ప్రకృతి వైపరిత్యాలతో బాధపడుతున్న వారికి హైదరాబాద్ లో ఉన్న పెరిక కుల బంధువుల నుండి విరాళాలు సేకరించి ఆపదలో ఉన్న కుల బంధువులకు సహాయం చేస్తూ వచ్చాము. విరాళాలు సేకరించే సందర్భాలు ఎక్కువ కావడంతో సహృదయులైన కులబంధులు సహీయం చేయుటకు ఇబ్బంది పడే పరిస్తితి ఏర్పడింది..
ఈ సందర్భంలో మనకులంలో వున్న నిరుపేదలకు (తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా) వారిని ఆదుకుని మానవతా దృక్పదంతో సాయం చేసే సంకల్పముతో తెలంగాణ పెరిక కుల సంక్షేమ సేవా సమితి ఏర్పాటుకు అంకురార్పన జరిగింది. గౌరవనీయులు శ్రీ గంపా గోవర్దన్ గారు సేవా కార్యక్రమాలకు వినియోగించమని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మద్దా లింగయ్య గారిని రూ.5,00,000/- (రూ.అయిదు లక్షలు) నగదు పంపించారు. వారు సేవా దృక్పథంతో పంపిన మొత్తం సంక్షేమ సమితి ఏర్పడడానికి నాంది అయ్యింది. సేవాభిలాషులు ఆర్ధికంగా ఇబ్బంది లేని వారందరిని సభ్యులుగా తీసుకునా కనీసం 21 మంది సభ్యులతో సంస్థను ఏర్పాటు చేసి ఒక్కరు రూ.5,00,000/- చెల్లించాలని నిర్ణయం జరిగింది. 21X5,00,000=1,05,000,00 (ఒక కోటి అయిదు లక్షలు) సేవా నిధి గా తీసుకుని బ్యాంక్ లో డిపాజిట్ చేసి.. దీనిపై వచ్చే వడ్డీని మాత్రమే సేవా కార్యానికి వాడుకోవాలనే నిబంధనలతో సంస్థ ప్రారంభం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మద్దా లింగయ్య గారి నేతృత్వంలో... వారి అధ్యక్షతన జరిగిన సమావేవేశాలతో సంక్షేమ సేవా సమితి గురించి వివరించి, దీనిలో సభ్యుల సంఖ్య అన్యూహంగా 213 కి పెరిగింది. ఇందులో రూ.5,00,000/- పూర్తిగా చెల్లించిన వారు 15 మంది కాగా మిగతా వారు కొంత నగదు చెల్లించారు. ఆగస్టు 2022 లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దిల్ సుక్ నగర్ బ్రాంచ్ లో ఖాతా ఓపెన్ (456201010036052 cd a/c) Trancatiion slat చేసాము. PAN No.AAKAT3929P
...............................................................................................................................
రూ.5,00,000/- (రూ.అయిదు లక్షలు) చెల్లించిన వారిని వ్యవస్థాపక సభ్యులుగా ఇతరులను దాతలుగా రూ..1116/- సభ్యత్వం చెల్లించిన వారిని సభ్యులుగా వ్యవహరిస్తున్నాము. 21 మంది వ్యవస్థాపక సభ్యులలో 15 మంది రూ.5,00,000/- పూర్తిగా చెల్లించారు. 6 గురు కొంత బకాయి ఉన్నారు. వీరు కాక 9 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం సంఖ్యం 30 (21+9=30)