తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షురాలు
ప్రధాన కార్యదర్శి
భావజాలంలోనే మార్పు రావాలి: గటిక విజయ్ కుమార్
తల్లి, అత్త అనే తేడాలు వద్దు : మద్దా లింగయ్య
మహిళలు తోడ్పాటుతోనే ప్రగతి : సుందరి వీరభాస్కర్
2026 మార్చి 8న ఆదివారం ఎల్.బి. నగర్ జోన్ పెరిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హయత్ నగర్ లోని సినర్జీ కార్యాలయంలో ఎల్. బి. నగర్ జోన్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎగ్గడి నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెరిక మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం నిర్వహించడంతో పాటు, పెరిక సంఘం తరుఫున మహిళల కోసం చేస్తున్న కార్యక్రమలు విడమరిచి చెప్పడానికి ఈ కార్యక్రమం జరిగింది.
ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఘటిక విజయకుమార్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, కథన రంగంలో కత్తి పట్టిన కాంతలుగా సమ్మక్క సారలమ్మలను గుర్తు చేసారు. ప్రస్తుతం స్త్రీల పరిస్థితి వివరిస్తూ నేటి సమాజం హిప్పోక్రాటిక్ విధానంలో మహిళా హక్కులని వంద కిలోమీటర్ల లోతులో పాతిపెట్టిందని చెప్పారు. దానికి గల కారణం వారసులుగా పుట్టే ఎవరైనా తండ్రి పేరును, తండ్రి గోత్రాన్ని మాత్రమే తర్వాతి తరానికి ఇస్తారని తల్లి గోత్రాన్ని తల్లి పేరు కానీ తర్వాతి తరానికి ఇవ్వరని, రాజకీయ రంగంలో మహిళా రిజర్వేషన్ వచ్చి గెలుపొందిన తర్వాత చేసే ప్రజా కార్యక్రమాలలో వేసే ప్రతి ఫౌండేషన్ స్టోన్ పేరమీద మహిళ పేరు తర్వాత భర్త పేరు పెడతారు అని వివరించారు. అదే సందర్బంలో పురుషుడు గెలిస్తే స్త్రీ పేరు పెట్టరని, ఇద్దరు ఆడ పిల్లలు పుట్టిన తర్వాత కూడా మూడో కాన్పులోనైనా పురుషుడు పుట్టాలి అని భావించే వారి ఆలోచన మారానంతవరకు మహిళా సాధికారత సాధ్యం కాదని పేర్కొన్నారు. వారి మాతృమూర్తి సుగుణమ్మZPTC గా పనిచేసి పేరు తెచ్చుకుంది కాబట్టే వారికి సుగుణమ్మ వారసులుగానే అందరికీ సుపరిచితులని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు మాట్లాడుతూ, తన తల్లి లేనిదే తాను లేను అని, చమ్మగిల్లిన తన మాటలతో సభలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేశారు.
కోకాపేట భవన చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు మాట్లాడుతూ, తనకు జన్మనిచ్చిన తల్లి తనకు అనునిత్యం తోడుగా ఉంటున్న భార్య వీరిద్దరి వల్లనే తాను ఉన్నత శిఖరాలని చేరుకోగలిగానని, వ్యాపారంలో లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిద్రలేని రాత్రులు గడిపిన ఎల్లవేళలా తనకు తోడుగా ఉంటూ ఉత్తమ బిజినెస్ అవార్డు 2026 గ్రహీతగా నిలబెట్టడంలో తన సతీమణి పాత్ర మర్చిపోలేనిది అని గుర్తు చేసుకున్నారు, ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత మేధావులమైన పురుషులు పిల్లలకు సమయం ఇచ్చే సందర్భాలు తక్కువగా ఉంటాయని ఆ అనితర బాధ్యతని స్త్రీ తన భుజాల మీద మోస్తుంది అని చెప్పారు. ఎల్బీనగర్ జోన్ మహిళా మణులు అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు అని భవిష్యత్తులో కూడా ఇలాంటి అవసరం ఉన్నా ప్రతి సందర్భంలో తన వంతు సహకారాన్ని అందిస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎల్బీనగర్ ప్రాంతంలో లేడీస్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని అందులో మహిళా మణులకు మీటింగ్ హాల్ ఉంటుంది అని, ఒకవేళ రాష్ట్రవ్యాప్తంగా కూడా మీటింగ్ పెట్టుకుంటే కోకాపేట భవనం కూడా భవిష్యత్తులో సిద్ధంగా ఉంటుంది అని ఉపోద్గాపించారు.
ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు బుద్దె వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న పెరిక కుల మహిళా మణులు తమ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ వారి పిల్లల భవిష్యత్తుకి, కుటుంబానికి తోడ్పాటును అందిస్తూ వారి ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ అనితర బాధ్యతను భుజాల మీద మోస్తూ అమ్మతననికి అందం తెచ్చారు అని చెప్పారు.
మహిళా దినోత్సవ వేడుకకు అద్భుతమైన హాల్ ని బహుమతిగా ఇచ్చి భవిష్యత్తులో కూడా తమకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని చెప్పిన సుందరి వీరభాస్కర్ గారికి ఎల్బీనగర్ జోన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది,
పెరిక కుల సంఘం ఎల్బీనగర్ జోన్ మహిళా అధ్యక్షురాలు యగ్గడి నాగమణి గారు మాట్లాడుతూ, ప్రతి పనిలో స్త్రీ ప్రాధాన్యత అనివార్యమని, స్త్రీ లేనిదే జననం లేదని సమస్త మానవాళికి స్త్రీనే మూల కారణమని, women లో men ఉన్నదని చెప్పడం జరిగింది. నేషనల్ బిజినెస్ అవార్డు 2026 సంవత్సరం గాను సుందరి వీరభాస్కర్ గారు విజేత నిలవడాన్ని కొనియాడుతూ, అందమైన హాల్ ని మహిళల కోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆధ్యాంతం సభను నడిపించి సక్సెస్ చేసిన మహిళా మణులు :
మహిళా విభాగo ఎల్బీనగర్ జోన్ జనరల్ సెక్రెటరీ ఎర్రంశెట్టి శ్రీలత గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న గారు గౌరవ అధ్యక్షురాలు అందే వరలక్ష్మి గారు, అసోసియేటివ్ అధ్యక్షులు బాల్దూరి వసంత గారు, డాక్టర్ సరిత గారు భాగ్యలక్ష్మి గారు చాలా అద్భుతంగా మాట్లాడుతూ మహిళల యొక్క ఔన్నత్యాన్ని ప్రగతి పథంలో వారి ప్రాధాన్యతని ప్రస్ఫుటంగా వివరించారు
ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఘటిక విజయకుమార్ గారు , మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద గారు , తెలంగాణ రాష్ట్ర పెరిక కుల గౌరవ అధ్యక్షులు మద్ద లింగయ్య గారు , కోకాపేట భవన నిర్మాణ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు , ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారు , అసోసియేటివ్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు , ప్రధాన కార్యదర్శి అచ్చా రఘు గారు , పెద్దలు అంకతి విజయ్ కుమార్ గారు, సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్ గారు, ప్రచార కార్యదర్శి దొంగరి శంకర్ గారు, కోశాధికారి బల్దూరి రవికుమార్ గారు , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు Dr సతీష్ గారు , గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు గారు,కేశవ్ గారు , ఎల్బీనగర్ జోన్ సభ్యులు ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు అసోసియేట్ అధ్యక్షులు యగ్గడి శ్రీనివాస్ గారు, యూత్ అధ్యక్షులు జూకూరు మహేష్ గారు, ముఖ్య సలహాదారుడు బొలిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఉపాధ్యక్షులు మద్దెల వినయ్ గారు, రామినేని శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది.