తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
గౌరవ అధ్యక్షుడు
ముఖ్య సలహాదారుడు
ప్రధాన కార్యదర్శి
అసోసియేట్ ప్రసిడెంట్
కోశాధికారి
రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా ఏకగ్రీవ ఎన్నిక
పెరిక కుల సంఘం రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు 2025 డిసెంబర్ 12న కొత్తపేటలోని సాయి గార్డెన్ లో జరిగాయి. రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, ముఖ్య సలహాదారుడు శ్రీరాం భద్రయ్య, మాజీ సంఘం అధ్యక్షులు దాసరి మల్లేశం, శ్రీరాం దయానంద్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, పరపతి సంఘం అధ్యక్షుడు అందె శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రామినేని వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడిగా బొలిశెట్టి జానకి రాములు, ముఖ్య సలహాదారుడిగా గజ్వేల్ రమేశ్, ప్రధాన కార్యదర్శిగా ఇండ్ల వాసుదేవరావు, అసోసియేట్ ప్రసిడెంట్ గా బాల్తు శ్రీనివాస్, కోశాధికారిగా బెక్కం వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బత్తిని పరమేశ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి సతీశ్ తదితరులు హాజరయ్యారు.
తేదీ: 25-12-2025, గురువారం రోజున రంగారెడ్డి జిల్లా పెరిక పురగిరి క్షత్రియ కుల సంఘం మహిళా విభాగం నూతన కమిటీ నియామాక ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దొంగరి మనోహర్, విశిష్ట అతిథులుగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డా. బొలిశెట్టి సతీష్ వర్మ, అసోసియేట్ అధ్యక్షులు రామినేని భూలోకారావు, గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలు నిగిడాల నాగవేణి, కీత శోభారాణి, డీస్పీ రామారావు, రాష్ట్ర మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి గోపతి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు(RV) అధ్యక్షతన మహిళా కమిటి దిల్షుక్నగర్ SMS హాస్పిటల్స్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి జానకి రాములు, అసోసియేట్ అధ్యక్షులు బాల్తు శ్రీనివాస్, కోశాధికారి బెక్కం వెంకట్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు దాసరి జయప్రకాష్, మహిళా విభాగం అధ్యక్షురాలు రామినేని లక్ష్మి, అసోసియేట్ అధ్యక్షరాలు గోపతి గీతా స్వరూపారాణి, ప్రధాన కార్యదర్శి నట్టే స్వప్న ప్రియ, మరియు రాష్ట్ర జిల్లా యువజన నాయకులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగ కమిటీనీ నిర్మాణం చేయటం జరిగినది. జిల్లా గౌరవ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, గౌరవ సలహాదారులు మరియు ప్రత్యేక ఆహ్వానితులను నియమించుకోవటం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీ నాయకులకు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నాయకులకు, రంగారెడ్డి జిల్లా నాయకులకు మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి మహిళా సభ్యురాలుకు జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతాబివందనములు తెలియజేయుచున్నాము.