తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షులు
ఏకగ్రీవమైన సంగారెడ్డి జిల్లా పెరిక కుల సంఘ ఎన్నికలు
రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీ గటిక విజయ్ కుమార్ గౌరవ అధ్యక్షులు శ్రీ మద్దా లింగయ్య గారి సూచన మేరకు 766/2014 కు ఎన్నికలు నిర్వహించగా నూతన అధ్యక్షులుగా శ్రీ గోళ్ల మాణిక్ ప్రభు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సంగారెడ్డి జిల్లా పెరిక కుల సంఘానికి మంచి రోజులు వచ్చాయి-
మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కుంచాల ప్రభాకర్ గారు
ఈ రోజు సంగారెడ్డి జిల్లా పెరిక కుల సంఘానికి సుదినం -
ఐక్యతకు ప్రతీక శ్రీ శ్రీరాం దయానంద్ పీవీవీజీ గౌరవ అధ్యక్షులు
ది 04.01.2026 ఆదివారం ఉదయం పటాన్ చెరువు లో సంగారెడ్డి జిల్లా పెరిక కుల సంఘం సర్వ సభ్య సమావేశం పట్టణ అధ్యక్షుడు శ్రీ బేలే నగేష్ గారి అధ్యక్షతన జరిగింది
ఈ కార్యక్రమలో జిల్లా లోని అన్ని గ్రామాల ప్రజలు చాల ఉచ్చాహంగా పాల్గొని జయ ప్రదం చేయడం జరిగింది
ఎన్నో సం.రాలుగా జిల్లా పెరిక కుల సంఘం నిర్వీర్యమైనదని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు
ఇప్పటికైనా మంచి రోజులు వచ్చాయని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు
తద్వారా జరిగిన జిల్లా సంఘం ఎన్నికలకు శ్రీరామ్ దయానంద్ కుంచాల ప్రభాకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ రాష్ట్ర ఇంజనీర్స్ కో ఆర్డినేటర్ ఇండ్ల చంద్ర శేఖర్ గార్లు ఎన్నికల అధికారులుగా వ్యవరించి ఎన్నికలు సాఫీగా నిర్వహించారు
నామినేషన్ల ప్రక్రియ లో భాగంగా శ్రీ గోళ్ల మాణిక్ ప్రభు గారి ఒకే ఒక నామినేషన్ రావడంతో వారిని అధ్యక్షులుగా ఏక గ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి అభినందనలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పీవీవీజీ కార్యనిర్వాక కార్యదర్శి శ్రీ అంకతి విజయ్ కుమార్ గారు pkmacs ఆర్ధిక కార్యదర్శి శ్రీ గోపతి కేశవులు గారు కుల పెద్దలు సందెల ఆంజనేయులు మేడిశెట్టి శ్రీనివాస్ బత్తుల మహేష్ గోపతి అంజయ్య బుద్దే ప్రభు లింగాల యాదయ్య బాదే రవితో పాటు సంగారెడ్డి పఠాన్ చెరువు లక్డారం చిదురుప్ప శివానగర్ ఇస్మాయిల్ ఖాన్ పేట రాళ్ళ కత్వ ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు