తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షులు
గౌరవ అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర పెరిక(పురగిరి క్షత్రియ) కుల సంఘం రి.766/2014 అనుబంద హనుమకొండ జిల్లా పెరిక కుల సంఘం సర్వ సభ్య సమావేశం 07-12-2025 ఆదివారం రోజున మడికొండలోని రామన్ స్కూల్ ఆడిటోరియంలొ ఘనంగాజరిగింది.ఈ సర్వసభ్య సమావేశనికి హనుమకొండ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి శ్రీనివాస్ సభాధ్యక్షత వహించగా రామినేని రాజేష్ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్,ముఖ్య సలహాదారులు శ్రీరాం దయానంద్, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్,ఆర్థిక కార్యదర్శి సందెల లింగం, కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్,పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు,ఆర్థిక కార్యదర్శి బాలదూరి రవి కుమార్, యువజన విభాగం గౌరవ అధ్యక్షులు మైలర్ శెట్టి చైతన్య,ఆత్మగౌరవ భవన నిర్మాణ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న,కుంచాల బాలరాజు శ్రీనివాస్,పెరిక పరస్పర సహాయ సహకార సంఘం అధ్యక్షులు అందె శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బరుపటి సంపత్ కుమార్,డైరెక్టర్ అంకతి విజయ్ కుమార్.ఖమ్మం జిల్లా అధ్యక్షులు గజవెల్లి సత్యనారాయణ,AMC మాజీ అధ్యక్షులు చింతం సదానందం,ప్రముఖ సైకాలాజిస్ట్ బరుపటి గోపి,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సూరం రవీందర్,యువజన విభాగం ప్రచార కార్యదర్శి అల్లం సతీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ పెరిక కులం లొ ప్రస్తుతం అభివృద్ధి యుగం నడుస్తుందని ఈ యుగంలో ధర్మత్ములు అందరు ఒకవైపు ఉన్నారని,పెరిక కులం లొ60నుండి70%సంఘీయులు ఆర్ధికంగా వున్నారని మిగతా 30% పేద మధ్య తరగతి వారికి విద్యా,వైద్యం ఉచితంగా అందించడానికి సర్వత కృషి చేస్తున్నామని,వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి ఫదం లొ కి తీసుకురావలసిన అవసరం ఉందని,అందుకు ప్రతి పెరిక బిడ్డ ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం ఎన్నికల్లో హనుమకొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులుగా రామినేని రాజేష్,గౌరవ అధ్యక్షులుగా సోమిశెట్టి శ్రీనివాస్ ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు.