తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహంలో సుదీర్ఘకాలం సేవలు అందించి, ఇటీవల అనారోగ్యానికి గురైన అచ్చంపేటకు చెందిన పోకల శంకరయ్యకు పెరిక విద్యార్థి వసతి గృహం, రాష్ట్ర పెరిక సంఘం అండగా నిలిచాయి.
పెరిక విద్యార్థి వసతి గృహం తరుఫున లక్ష రూపాయల సహాయాన్ని అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోశాధికారి బాల్దురి రవికుమార్ అందించారు.
రాష్ట్ర పెరిక సంఘం తరుఫున రాష్ట్ర సంఘం అద్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్ 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
2026 జనవరి 3న అచ్చంపేటలో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం సందర్భంగా ఈ సహాయాన్ని నాయకులు అందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనందర్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, పెరిక కుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మిశేఖర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెరిక సంఘం గౌరవ సలహాదారులు పోకల మనోహర్, ప్రముఖ విద్యావేత్త సాదె రాజు తదితరులు పాల్గొన్నారు.
పెరిక విద్యార్థి వసతి గృహం 1972లో ఇండియన్ ట్రస్టు యాక్టు-1882 కు అనుగుణంగా లాభాపేక్ష లేని సేవా సంస్థగా (ట్రస్టుగా) ఏర్పాటు అయ్యింది. 1972 మే17న 251/1972 డాక్యుమెంటు నెంబర్ తో రిజిష్టర్ అయ్యింది. 1972లో ట్రస్టు ఏర్పాటు జరిగినప్పుడు నాటి పెద్దలు పెరిక విద్యార్థి వసతి గృహం నిర్వహణ కోసం నియమాలు రూపొందించారు. వాటి ప్రకారమే పెరిక విద్యార్థి వసతి గృహం నిర్వహణ జరుగుతూ వస్తున్నది. కాలక్రమంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా నిర్వహణ నియమాలకు (BYE LAWS) పాలకమండలి పలుమార్లు సవరణలు చేస్తూ వచ్చింది. 26 జూన్ 2000, 25 అక్టోబర్ 2000, 12 మార్చి 2001, 18 మార్చి 2009, 14 ఏప్రిల్ 2013 తేదిలలో బై లాస్ కు సవరణ చేసి రిజిష్టర్ చేయడం జరిగింది. 2013 నుండి మళ్లీ సవరణ జరగలేదు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడడంతో పాటు, ట్రస్టు సభ్యులు పెరగడం, ట్రస్టు సభ్యులుగా చేరడానికి చెల్లించాల్సిన విరాళం పెరగడం లాంటి అనేక మార్పులు జరిగాయి. దీంతో బై లాస్ కు సవరణలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 2 ఫిబ్రవరి 2025న జరిగిన పెరిక విద్యార్థి వసతి గృహం ఎన్నికల్లో డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వారి కమిటీ అధ్వర్యంలో బై లాస్ సవరించడం కోసం డాక్టర్ గటిక విజయ్ కుమార్ గారు (పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్), అంగిరేకుల అనంత రాములు గారు (పెరిక విద్యార్థి వసతి గృహం మాజీ ప్రధాన కార్యదర్శి), సుంకరి ఆనంద్ గారు (పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు), వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు (పెరిక విద్యార్థి వసతి గృహం గౌరవ సలహాదారులు) , దొంగరి వెంకటేశ్వర్లు గారు (పెరిక విద్యార్థి వసతి గృహం ప్రత్యేక ఆహ్వానితులు), గుమ్ళళ్ల మల్లిఖార్జున్ గారు (పెరిక విద్యార్థి వసతి గృహం ట్రస్టీ మరియు ప్రముఖ న్యాయవాది) సభ్యులుగా 21 మార్చి 2025న బై లాస్ కమిటీ వేయడం జరిగింది. బై లాస్ కమిటీ 2025 ఏప్రిల్ 9న సమావేశమై గత బై లాస్ ను క్షుణ్ణంగా పరిశీలించి, సవరణలు సూచించడం జరిగింది. ఈ సిఫారసుల ఆధారంగా రూపొందించిన బై లాస్ ను తేది 02 నవంబర్ 2025న జరిగిన పెరిక విద్యార్థి వసతి గృహం సర్వసభ్య సమావేశం(జనరల్ బాడీ) ఆమోదించింది. ఈనాటి నుంచి ఈ బైలాస్ అమలులోకి వచ్చాయి.