తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
బిజెపిలో మొదటి నుంచి పెరిక కులానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన గటిక విజయ్ కుమార్ గారి నాయకత్వంలో పెరిక కుల నాయకుల బృందం బుధవారం హైదరాబాద్ లో రాంచందర్ రావు గారిని కలిశారు. చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పెరిక కులస్తులకు ఎక్కువ అవకాశాలు కల్పించాలని కోరారు. దీనికి రాంచందర్ రావు స్పందిస్తూ, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్, రామగుండం స్థానాలను పెరిక కులస్తులకు కేటాయించామని, రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రాష్ట్ర పెరిక సంఘం సిఫారసు చేసిన వారి పేర్లను బిజెపి అభ్యర్థిత్వానికి పరిశీలిస్తామని హమీ ఇచ్చారు.
పెరిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దాసరి మల్లేశం గారిని జాతీయ బిసి కమిషన్ సభ్యుడిగా నియమించాలని సంఘం నాయకులు కోరగా, తప్పక జాతీయ నాయకత్వంతో మాట్లాడి పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పెరిక సంఘం యువజన విభాగం అధ్యక్షుడు దాసరి ప్రకాశ్ కు కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తామని, ఎక్కడ పెరిక సంఘం సిఫారసు చేస్తే అక్కడ తప్పక టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన తనకు పెరిక కులంతో ఎంతో అనుబంధం ఉందని రాంచందర్ రావు చెప్పారు.
కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి చేవెళ్ల ఎంపితో పాటు, ఇతర ప్రజాప్రతినిధులు సి.డి.ఎఫ్. నుంచి నిధులు ఇప్పించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన గటిక విజయ్ కుమార్ తో పాటు, రాష్ట్ర నూతన గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్ లను రాంచందర్ రావు అభినందించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు దాసరి మల్లేశం, మహిళా విభాగం అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, పెరిక సంఘం రాష్ట్ర నాయకులు సుంకరి ఆనంద్, దొంగరి మనోహర్, సందెల లింగం, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, పెరిక హాస్టల్ ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్, కోశాధికారి బాల్దురి రవి కుమార్, యువజన విభాగం నాయకులు దాసరి ప్రకాశ్, గ్రేటర్ హైదరాబాద్ అసోసియేట్ అధ్యక్షుడు దొంగరి శంకర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి సతీష్, ప్రధాన కార్యదర్శి రామినేని భూలోక రావు, గౌరవ సలహాదారుడు బాల్దు శ్రీనివాస్, యువ నాయకులు మైలారుశెట్టి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని కులాలకు పెరిక కుల సంఘం ఆదర్శంగా నిలిచిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీశ్ రావు అభినందించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా పెరిక కులానికి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పెరిక సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ నాయకత్వంలో రాష్ట్ర నాయకులు బుధవారం హైదరాబాద్ లో హరీశ్ రావును కలిశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఖైరతాబాద్‌లో 50 ఏళ్ల నుంచి నిరాటంకంగా పెరిక హాస్టల్ నడుపుతున్నారని, ఎందరినో కులం తీర్చిదిద్దిందని అభినందించారు. త్వరలోనే హాస్టల్ సందర్శించి పెరిక సోదరులతో గడుపుతానని చెప్పారు. తమ ప్రభుత్వం అనేక కులాలకు భవన నిర్మాణం కోసం స్థలాలు కేటాయించినా, ఎవరూ భవన నిర్మాణం చేసుకోలేదని, పెరిక కులమొక్కటే ముందుకొచ్చి భవనం నిర్మించుకుంటున్నారని అభినందించారు. పెరిక సంక్షేమ సమతి, పెరిక పరపతి సంఘం ద్వారా పెరిక కులస్తులకు ఆర్థిక చేయూత అందిస్తున్నారని తెలిపారు. కుల సంఘం తమ కులంలోని మిగతా వారికి అవసరమైన తోడ్పాటు అందించడం అందరికీ మార్గదర్శకం అన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిక కులస్థులకు చట్టసభలకు వెళ్లేందుకు అనేక గొప్ప అవకాశాలు వచ్చాయని, రాబోయే కాలంలో తమ పార్టీ తరుఫున మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కడ అవకాశం ఉంటే, అక్కడ పెరిక కులస్తులకు ప్రాధాన్యం ఇస్తామని మాట ఇచ్చారు. సిద్దిపేటకు చెందిన రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భూసాని శ్రీనివాస్ కు రాజకీయ అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తానని హరీశ్ రావు చెప్పారు.
సిద్దిపేట పట్టణంలో అర ఎకరం స్థలం ఇవ్వడంతో పాటు సిద్దిపేట నియోజకవర్గంలో, హుజురాబాద్ నియోజకవర్గంలో పెరిక కులస్తులున్న ప్రతీ గ్రామంలో పెరిక కమ్యూనిటీ హాల్ నిర్మించిన హరీశ్ రావుకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవనానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని హరీశ్ రావు చెప్పారు.
పెరిక కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన గటిక విజయ్ కుమార్ ను హరీశ్ రావు సన్మానించి, అభినందనలు తెలిపారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ లను అభినందించారు.
తనను కలిసిన ప్రతీ ఒక్క పెరిక నాయకుడ్ని ప్రత్యేకంగా పరిచయం చేసుకుని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో పెరిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం, శ్రీరాం దయానంద్, పెరిక సంఘం రాష్ట్ర నాయకులు సుంకరి ఆనంద్, భూసాని శ్రీనివాస్, దొంగరి మనోహర్, సందెల లింగం, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, పెరిక హాస్టల్ అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్, కోశాధికారి బాల్దురి రవి కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంకతి విజయ్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి దిడ్డి సురేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బత్తిని పరమేశ్, అసోసియేట్ అధ్యక్షుడు దొంగరి శంకర్, యువ నాయకులు మైలారుశెట్టి చైతన్య, సాదె రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ పెరిక బిడ్డ గర్వంతో తలెత్తుకునే సందర్భం ఇది
బావి తరాలకు ఢోకా లేని విధంగా సుసంపన్నం అవుతున్నాం
మరే కులానికి సాధ్యం కాని ఘనతలు సాధిస్తున్న శుభ తరుణం
ఏకకాలంలో దిగ్విజయంగా పది కార్యక్రమాలు
సంఘంలోని ఆరు కమిటీలు ఐకమత్యంతో సాధిస్తున్న ఘన విజయాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ పెరిక బిడ్డ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని మన రాష్ట్ర నాయకత్వం ఎంతో దార్శనికతతో చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. రాష్ట్ర పెరిక సంఘంలోని ఆరు కమిటీల బాధ్యులు కలిసికట్టుగా మన కుల అభివృద్ధికి, సంక్షేమానికి పాటు పడుతున్నురు. తెలంగాణ రాష్ట్రంలోనే పెరిక కులాన్ని ఒక సుసంపన్న, స్వయం సమృద్ది కలిగిన కులంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఎవరి మీదా ఆధార పడకుండా మన పెరిక బిడ్డల భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునే అద్భుత ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం, పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ, పెరిక కుల విద్యార్థి వసతి గృహం, పెరిక కుల సంక్షేమ సమితి, పెరిక కుల పరస్పర సహకార పరపతి సంఘం, పెరిక కుల వివాహ వేదిక... ఈ ఆరు కమిటీల నాయకులు ఒకరిపై ఒకరు సంపూర్ణ విశ్వాసంతో, పరస్పర సహకారంతో కలిసి కట్టుగా కార్యక్రమాలు నిర్వహించడం మన పెరిక కుల చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోవాల్సిన అధ్యాయం. వీరి కృషి ఫలితంగా నేడు ఏకకాలంలో దాదాపు పది కార్యక్రమాలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. వీటి ద్వారా పెరిక కులానికి కోట్లాది రూపాయల సంపద సమకూరింది. పెరిక బిడ్డలు మంచి వసతితో విద్యను అభ్యసించగలుతున్నారు. ఆపదలో ఉన్న పేదలకు తగిన సాయం అందుతున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ఒక కుల సంఘంగా మనం సాధిస్తున్న విజయాలు ఇతర కులాల వారికి ఎవరికీ సాధ్యం కావట్లేదంటే మనం గర్వపడి తీరాల్సిన సందర్భం. ఒక్క సారి మన పురోగతి కోసం జరుగుతున్న కార్యక్రమాలను మనం తెలుసుకుందాం.
1. హైదరాబాద్ లోని కోకాపేటలో మనం రెండు ఎకరాల స్థలం సాధించుకోవడమే అతి పెద్ద విజయం. జనాభా పరంగా తక్కువ ఉన్నప్పటికీ ఎక్కువ జనాభా కలిగిన కులాలతో సమానంగా రెండు ఎకరాల స్థలాన్ని మనం సాధించుకోగలిగాం. దాని విలువ ఇప్పుడు మార్కెట్లో కనీసం 200 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ స్థలంలో మనం ఇప్పుడు పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మించుకుంటున్నాం. ఇప్పటికే మొదటి స్లాబు పూర్తి అయింది. జూన్ నెలలో రెండో స్లాబు, జూలైలో మూడో స్లాబు వేసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడ రాకున్నా, మొత్తం మన కుల సోదరులు అందించిన విరాళాలతోనే ఈ నిర్మాణాన్ని చేసుకుంటున్నాం. ఆత్మగౌరవ నిర్మాణ స్థలంలో బోరు వేసుకున్నాం. కరెంటు కనెక్షన్ కూడా మంజూరీ అయింది. చాలా తక్కువ సమయంలోనే, మిగతా కులాల కంటే చాలా ముందుగానే మనం కోకాపేటలో భవన నిర్మాణం పూర్త చేసుకుని ఆత్మగౌవర భావుటా ఎగుర వేయబోతున్నాం.
2. ఎంతో మంది సేవాతత్పరుల ఆలోచన, ముందు చూపు కారణంగా ఖైరతాబాద్ చౌరస్తాలో వెలిసిన పెరిక విద్యార్థి వసతి గృహం బహు విధాలుగా విస్తరిస్తున్నది. వేసవి సెలవులు ఉండడంతో ప్రస్తుతం ఖైరతాబాద్ హాస్టల్ ను పూర్తి స్థాయిలో ఆధునీకరించే పనులు జరుగుతున్నాయి. జూన్ మాసాంతం వరకు ఈ పనులు పూర్తయి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వసతి కల్పించే బాధ్యతను కమిటీ విజయవంతంగా పూర్తి చేస్తున్నది.
3. పెరిక కులస్తుల చిరకాల వాంఛ అయిన బాలికల హాస్టల్ నిర్మాణానికి బలంగా అడుగులు పడ్డాయి. ఎల్.బి. నగర్ మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో 395 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. నెల రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, నిర్మాణం ప్రారంభించాలనే దృఢ సంకల్పంతో మన నాయకులు శ్రమిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి మన సొంత భవనంలోనే బాలికల హాస్టల్ నిర్వహణ జరుగుతుంది. ఈలోగా 2025-26 విద్యా సంవత్సరంలో కూడా బాలికల హాస్టల్ నడపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవసరం ఉన్న బాలికలు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే హాస్టల్ కమిటీ కోరింది. ఎంత మంది బాలికలకు అవసరం ఉంటే, అంత మందికి హాస్టల్ వసతి కల్పించడానికి కమిటీ సిద్ధపడింది.
4. పెరిక విద్యార్థి వసతి గృహం ఆధ్వర్యంలో ఉప్పల్ లో నిర్మించిన భవనానికి సంబంధించిన పెండింగ్ పనులు కూడా పూర్తి కావడానికి రంగం సిద్ధమయింది. ఆ భవనాన్ని లీజుకు తీసుకున్న వారితో మన రాష్ట్ర నాయకులు చర్చించారు. పెండింగులో ఉన్న ఐదు నెలల కిరాయిని మన హాస్టల్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ప్రతీ నెలా కిరాయి క్రమం తప్పకుండా వసూలు చేయడం జరుగుతున్నది. ఉప్పల్ భవనం లీజుకు తీసుకున్న వారితో చర్చించి పెంట్ హౌజు నిర్మాణానికి ఒప్పించడం జరిగింది. అతి త్వరలోనే ఉప్పల్ బిల్డింగులో పెంట్ హౌజు నిర్మాణం జరుగుతుంది.
5. పెరిక విద్యార్థులను అత్యున్నత పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి ‘విద్యాజ్యోతి’ కార్యక్రమం నిర్వహించాలని మన కుల పెద్దలు నిర్ణయించారు. సివిల్స్, గ్రూప్స్ పరీక్షల్లో మెయిన్ కు క్వాలిఫై అయిన పేద పిల్లల ట్యూషన్ ఫీజులు చెల్లించడంతో పాటు, వారికి హైదరాబాద్ లో మంచి వసతి కల్పించి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించడం జరిగింది. నీట్, ఐఐటి, ఐఐఎంలలో మెరిట్ సాధించిన పేద విద్యార్థుల ఫీజులను కూడా ‘విద్యాజ్యోతి’ కార్యక్రమం ద్వారా మన కుల సంఘమే చెల్లించాలని నిర్ణయించడం జరిగింది.
6. మన కులంలోని 20 మంది దాతలు ఎంతో మానవతా హృదయంతో తలా ఒక 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి పెరిక కుల సంక్షేమ సమితిని స్థాపించారు. ఇలా జమ అయిన డబ్బులను వడ్డీకి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బులతో ప్రతీ నెలా క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపదలో ఉన్న పేదలకు సాయం అందిస్తున్నారు.
7. పెరిక కుల పరపతి సంఘం దిగ్విజయంగా నడుస్తున్నది. 1333 మంది సభ్యులతో దాదాపు 4 కోట్ల టర్నోవర్ తో దాదాపు ఒక బ్యాంకు మాదిరిగా నడుస్తున్నది. పెళ్లిళ్లకు, చదువులకు, వైద్యానికి చాలా తక్కువ వడ్డీకి రుణ సాయం అందుకోవడం ఈ పరపతి సంఘం ద్వారా సాధ్యమవుతున్నది. గతంలో 2 లక్షల వరకున్న రుణ పరిమితిని ఇప్పుడు 3 లక్షల రూపాయలకు పెంచి ఇవ్వడం జరుగుతున్నది.
8. పెరిక కుల వివాహ వేదిక మన కులంలోని యువతీ యువకుల పెళ్లిళ్లకు సాయం అందిస్తున్నది. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా మొత్తం వేదిక నిర్వహణ వ్యయమంతా మన కుల పెద్దలే భరిస్తున్నారు. ఇప్పటికి 26 సార్లు వివాహ వేదికలు నిర్వహించి దాదాపు 6,500 పెళ్లిల్లు కుదిరించడం జరిగింది. త్వరలోనే 27వ వివాహ వేదిక జరగబోతున్నది.
పై కార్యక్రమాలతో పాటు మన పెరిక కుల పెద్దలు శ్రీశైలం, యాదగిరిగుట్ట, భద్రాచలంలో నిర్మిస్తున్న పెరిక కుల సత్రాలకు ఇతోధికంగా సాయం అందిస్తున్నారు.
కులం అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి ఎంతో ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్న మన కుల సంఘం రాష్ట్ర నాయకులకు, అన్ని కమిటీల బాధ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఎవరి స్వార్థం వారు చూసుకునే ఈ రోజుల్లో మన పెరిక సంఘం నాయకులు తమ విలువైన సమయాన్ని, కష్టపడి సంపాదించుకున్న డబ్బులను కులం కోసం ఖర్చు చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. అన్నింటికంటే ముఖ్యంగా కులాన్ని ఒక్కతాటిపై నిలిపి, అన్ని కమిటీలు కలిసి కట్టుగా కులాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తుండడం నిజంగా పెరిక కులం చేసుకున్న అదృష్టం.
జై పెరిక
జైజై పెరిక
రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ ఘన నివాళి.
ఈరోజు ఉదయం మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి శ్రీ సత్యనారాయణ గారు కన్నుమూశారు.
వారి పార్థివ దేహాన్ని సందర్శించి తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు, I News ఎడిటోరియల్ డైరెక్టర్ డా. గటిక విజయ్ కుమార్ గారు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాజీ మంత్రి హరీశ్ రావు గారు, వారి సోదరుడు మహేష్ గారిని పరామర్శించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం పొందాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
సంతాపం తెలిపిన వారిలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బందు శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు.
ఇటీవల ప్రకటించిన UPSC ర్యాంకుల్లో ఆల్ ఇండియా 11 వ ర్యాంకు, తెలుగు రాష్ట్రాల్లో మొదటి ర్యాంకు సాధించిన ఇట్టేబోయిన సాయి శివాని, 255 వ ర్యాంకు సాధించిన పోతరాజు హరిప్రసాదులను వరంగల్‌లో 2025 ఏప్రిల్ 24న రాష్ట్ర పెరిక సంఘం నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు.
మొదట వరంగల్ శివనగర్ ప్రాంతంలో ఉండే సాయి శివాని ఇంటికి వెళ్లి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న ఆమె తండ్రి రాజు, తల్లి రజనిని కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలియచేసారు.
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజు తన కూతురిని ఐఏఎస్ అధికారిగా చూడాలని కల కనడం, ఆ కలను తన కూతురు నిజం చేయడం ఎంతో అభినందనీయమని సంఘం నాయకులు వారిని కొనియాడారు,
ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దనే ప్రిపేర్ అయ్యి టాప్ ర్యాంక్ సాధించడం అసాధారణ విషయమని, ఇది యావత్ పెరకజాతి గర్వించదగ్గ సందర్భమని నాయకులు తెలిపారు.
ఆ తర్వాత బాలసముద్రంలో ఉండే పోతరాజు సాయి ప్రసాద్ ఇంటికి చేరుకొని, అతని తండ్రి తెలుగు పండిట్ ఆయన కిషన్, తల్లి విజయను నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ ఇద్దరు పిల్లలు పెరిక జాతి చరిత్రలోనే ఐఏఎస్ సాధించిన మొదటి వారుగా నిలవనున్నారని నాయకులు ఈసందర్బంగా తెలిపారు.
అనంతరం జరిగిన సమావేశంలో పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయకుమార్ మాట్లాడుతూ, పెరిక బిడ్డల అభ్యున్నతికి రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
పెరిక కుల బిడ్డలు భవిష్యత్తులో మరిన్ని సివిల్ సర్వీస్ ర్యాంకులు, గ్రూప్ వన్ ర్యాంకులు సాధించడానికి వీలుగా విద్యా జ్యోతి కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు ప్రకటించారు.
సివిల్ సర్వీస్, గ్రూపు వన్ పరీక్షల్లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులై మెయిన్స్ అర్హత సాధించిన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యేవారికి హైదరాబాదులో సౌకర్యవంతమైన ఉచిత వసతితో పాటు, ఉచిత భోజనం అందిస్తామని ప్రకటించారు వారి ట్యూషన్ ఫీజులు కూడా రాష్ట్ర పెరిక సంఘం నాయకులు భరిస్తారని చెప్పారు. ఈ సదుపాయాన్ని పెరిక విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో వారు అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం, పెరిక విద్యార్థి వసతి గృహం, పెరికకుల సంక్షేమ సమితి, కోకాపేట ఆత్మ గౌరవ భవన నిర్మాణ కమిటీ, పెరిక కుల పరపతి సంఘం సంయుక్తంగా విద్యా జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రకటించారు.
సివిల్స్ టాప్ యాంకర్ల సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోశాధికారి దొంగరి మనోహర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ మైలార్శెట్టి చైతన్య, పెరిక విద్యార్థి వసతి గృహం గౌరవ సలహాదారుడు చింతకుంట్ల శ్యామ్ కిరణ్, పెరిక సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతం ప్రవీణ్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్, పెరిక విద్యార్థి వసతిగృహం ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస వర్మ, సంయుక్త కార్యదర్శి అల్లం రాజేష్ వర్మ, పెరికథాద్రి ఎడిటర్ బరుపాటి సంపత్, లీగల్ సెల్ కన్వీనర్ అల్లం నాగరాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు చింతకుంట్ల మాధవ్, బిల్లా పవన్, బరుపాటి గోపి , డాక్టర్ అత్తే భగీరథ, చింతల యాదగిరి, ముతినేని సురేష్, అవిరే వెంకటేశ్వర్లు, చుంచు నరసింహమూర్తి, తీర్థాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పెరిక కుల కార్యవర్గ విస్తరణ.. వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గంలోకి వచ్చిన వారికి నియామక పత్రాలు అందించిన అధ్యక్షుడు మద్దా లింగయ్య.
హైదరాబాద్... ఉప్పల్ :
ఉప్పల్ పెరిక హాస్టల్ లో ఆదివారం 24/09/23న జరిగిన జిల్లా పదాధికారులు , కుల పెద్దలు, రాష్ట్ర పూర్తిస్థాయి కార్యవర్గం, భవన నిర్మాణ కమిటీ సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో గత ఆగస్టు నెల 27వ తేదీన కోకాపేట భూమి పూజ అనంతరం పదివేల మందితో జరిగిన బహిరంగ సభ కోసం ఎంతో శ్రమ తీసుకున్న జిల్లా పదాధికారులను, ఇతర కులముక్యులను సన్మానం చేసి మెమొంటోళ్లను అందజేశారు.
.
ఈ సమావేశంలో త్వరలో నిర్మించాబోయే కోకాపేట పెఱిక భవన్ పొడవు, వెడల్పు, ఏ ఎ అంతస్తులో ఏమి ఉండబోతున్నాయి అనే మోడల్ డిజైన్లతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య,, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్‌లు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పెరికకుల సంఘాన్ని పటిష్టపరిచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా చేపట్టాలని, సాధారణ సభ్యత్వం 500 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వం 5000 రూపాయలు ఉండేవిధంగా ఆలోచన చేస్తున్నామని దీనిపై ఈ జిల్లా పదాధికారులు తమ అభిప్రాయం తెలియజేయాల్సిందిగా కోరారు.
రాష్ట్ర సంఘం, భవన నిర్మాణ కమిటీ చేసిన చేసిన తీర్మానాలను జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మంచి నిర్ణయాలని కొనియాడి వాటిని ఆమోదించారు.
కార్యక్రమానికి హాజరైన 28 జిల్లాల అధ్యక్షులు జిల్లా ప్రముఖులు మాట్లాడుతూ కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తమ తమ జిల్లాలలో భారీగా విరాళాలు సేకరిస్తామని హామీ ఇచ్చారు
నియామక పత్రాలు అందజేత.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి రాష్ట్ర కార్యవర్గంలోకి వచ్చిన కుల బాంధవులకు రాష్ట్ర అధ్యక్షులు మద్దాలింగయ్య వారి కార్య వర్గం నియామక పత్రాలు అందజేశారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్ మాట్లాడుతూ భూమి పూజ మహాసభ కోసం శ్రమించిన జిల్లా పదాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ భద్రయ్య మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత పెరికకుల సంఘం అంతా ఏకతాటిపై నడుస్తుండడం నాకు చాలా సంతోషం అనిపిస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూసాని శ్రీనివాస్ ఇప్పటివరకు రాష్ట్ర పెరిక సంఘం చేసిన కార్యక్రమ వివరాలను సభికులకు తన నివేదికలో చదివి వినిపించారు.
కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం ఇప్పటివరకు విరాళాలు అందజేసిన వారి పేర్లు, వారు అందజేసిన డబ్బుల వివరాలను రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి దొంగరి మనోహర్ నివేదికలో చదివి వినిపించారు.
ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్ మాట్లాడుతూ కోకాపేట భవన నిర్మాణానికి ప్రతి జిల్లాలలో సంఘీయులు సహకరించాలని కోరారు..
రాష్ట్ర పెరిక సంఘం, భవన నిర్మాణ కమిటీ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న సమాచారానికి ప్రతి ఒక్కరూ లైకులు, షేర్లు చేస్తూ ప్రతీ పెరిక సోదరునికి చేరేలా సహకరించాలని ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు భవన నిర్మాణ కమిటీకి విరాళాలను ప్రకటించిన కుల పెద్దలు.
కోకాపేట భవన నిర్మాణ కమిటీకి 10 లక్షల రూపాయలను విరాళం ప్రకటించిన మైదంశెట్టి లక్ష్మీరాజ్యం గారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పెరికకుల సంఘం అధ్యక్షుడు బత్తిని పరమేష్ ను భవాన నిర్మాణ కమిటీ అధికార ప్రతినిధిగా
ఎల్బీనగర్ జోన్ అధ్యక్షులు సుందరి వీరభాస్కర్ ను రాష్ట్ర పరిక సంఘం అధికార ప్రతినిధిగా హాజరైన కుల సోదరుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.
అంతకుముందు రాష్ట్ర కుల సంఘం పెద్దలు పాయల జంగయ్య,ఏడ్మా నరసింగరావు,శ్రీరామ్ దయానంద్, చుంచు ఉషన్న, కాంశెట్టి నర్సింగ్ రావు,కంశెట్టి శివకుమార్,బండి పుల్లయ్య,వలిశెట్టి లక్ష్మీ శేఖర్,
డా.దొంగరి వెంకటేశ్వర్లు, చుంచు ఉషన్న, మైదం శెట్టి లక్ష్మీరాజ్యం, విద్యావేత్త అనంత రాములు గారికి రాష్ట్ర పెరిక సంఘం, భవన నిర్మాణ కమిటీ సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ అధికార ప్రతినిధులు బత్తిని పరమేష్, సుందరి వీరభాస్కర్, కుంచాల శ్రీనివాస్,బోడపుంటి ప్రకాష్,అంకతి విజయ్ కుమార్, దిడ్డి సురేష్, రిటైర్డ్ కల్నాల్ శ్రీనివాస్ రావు,అందె శ్రీనివాస్, రఘు కుమార్ డాక్టర్ బొలిశెట్టి సతీష్, దాసరి జయప్రకాష్, మడిశెట్టి శ్రీధర్, జిల్లా అధ్యక్షా, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు, నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర కుల ప్రముఖులు పాల్గొన్నారు.