తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
గౌరవ అధ్యక్షుడు
ప్రదాన కార్యదర్శి
కోకాపేట పెరిక కుల భవన నిర్మాణానికి కుల బంధువులు విరాళాలు అందించాలి, అందించిన వారికి కృతజ్ఞతలు.
- కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్.
ఎల్బీనగర్లో త్వరలోనే పెరికకుల మహిళా హాస్టల్.
- వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు.
పెరికకుల కోపరేటివ్ సొసైటీ త్వరలోనే బ్యాంకుగా ఏర్పడబోతుంది.
--- సొసైటీ అధ్యక్షుడు అందె శ్రీనివాస్.
ఘనంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, ఎల్ బి నగర్ సంఘాల సంయుక్త సమావేశం
కుల పెద్దలు, అధ్యక్షుల సమక్షంలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఎల్ బి నగర్ జోన్ కుల సంఘాలకు ఏకగ్రీవంగా నూతన కమిటీల ఎన్నిక, ప్రకటన, ప్రమాణ స్వీకారం.
సమావేశానికి హాజరై నూతన కార్యవర్గాలకి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య,ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్,ముఖ్య సలహాదారులు శ్రీరామ్ భద్రయ్య, మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, దాసరి మల్లేశం గార్లు.
గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా
డా. బోలిశెట్టి సతీష్ కుమార్,
గౌరవ అధ్యక్షులుగా గుండు వెంకటేశ్వర్లు,
ప్రధాన కార్యదర్శిగా రాందేని నారాయణ
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా రామినేని వెంకటేశ్వర్లు,
ప్రధాన కార్యదర్శిగా ఇండ్ల వాసుదేవరావు
ఎల్ బి నగర్ జోన్ అధ్యక్షులుగా బుద్దె వెంకటేశ్వర్లు,
ప్రధాన కార్యదర్శిగా ముత్తినేని వెంకటేశ్వర్లు.
రంగారెడ్డి జిల్లా యువజన విభాగం,మహిళా కమిటీకి నూతన కార్యవర్గాలు ఏర్పడ్డాయి.
నూతన కమిటీ సభ్యులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్యవర్గం
ఎన్నికైన మూడు కమిటీలకు, యువజన,మహిళా కమిటీలకు హాజరైన కుల పెద్దలు, రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ కార్యవర్గాలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన రాష్ట్ర కార్యవర్గం నుండి,
అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, కార్య నిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్, ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్, అధికార ప్రతినిధి దొంగరి శంకర్ గార్లు,
పెరిక విద్యార్థి వసతి గృహం కమిటీ నుండి,
అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ఆర్థిక కార్యదర్శి బాల్దూరి రవికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్ గార్లు,
కోకాపేట భవన నిర్మాణ కమిటీ నుండి,
చైర్మన్ సుందరి వీరభాస్కర్, కో- చైర్మన్ చుంచు ఉషన్న,
ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్ గార్లు,
పెరిక కుల కో-ఆపరేటివ్ సొసైటీ నుండి,
అధ్యక్షులు అందే శ్రీనివాస్,
ఆర్థిక కార్యదర్శి గోపతి కేశవ్ గార్లు,
పెరిక కుల సంక్షేమ సమితి నుండి
అధ్యక్షులు బత్తిని పరమేష్,
ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మి శేఖర్, ఆర్థిక కార్యదర్శి బోడపుంటి ప్రకాష్ గార్లు,
రాష్ట్ర యువజన విభాగం నుండి,
గౌరవాధ్యక్షుడు మైలారిశెట్టి చైతన్య, యువజన విభాగపు అధ్యక్షుడు దాసరి జయప్రకాష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జూకూరి చైతన్య రాజు, యువజన విభాగపు మాజీ గౌరవ అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీధర్ గార్లు
కోఆర్డినేటర్లు విభాగం నుండి,
కల్చరల్ కోఆర్డినేటర్ యాగ్గడి శ్రీనివాస్, ప్రొఫెసర్స్ అండ్ లెక్చరర్స్ కోఆర్డినేటర్ వడ్డానం వాసు,టీచర్స్ కోఆర్డినేటర్ గుండు వెంకటేశ్వర్లు,ఇంజనీర్స్ విభాగపు కోఆర్డినేటర్ ఇండ్ల చంద్రశేఖర్, న్యాయవాదుల విభాగపు కోఆర్డినేటర్లు జూకూరి మహేష్, అల్లం నాగరాజు గార్లు పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ జోన్ ల నుండి అధిక స్థాయిలో కుల బంధువులు, అంతే స్థాయిలో మహిళా మణులు పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.
అంబరాన్నంటినపెరికబతుకమ్మసంబరాలు
గణపతి పూజతో శాస్త్రోక్తంగా ప్రారంభమైన వేడుకలు*
బతుకమ్మ ఆట పాటలు, దాండియా నృత్యాలు, డి జే పాటల హోరు, బాణాసంచా కాల్పులతో మార్మోగిన హయత్ నగర్.
హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య గారు, రాష్ట్ర సంఘం అధ్యక్షులు మద్ద లింగయ్య గారు, కోకాపేట పెరిక భవన్ నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ గారు, హాస్టల్ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర నాయకులు దాసరి మల్లేశం గారు, పిసీసీ సభ్యులు దొంగరి వెంకటేశ్వర్లు గారు, ఆ పెరిక విద్యార్థి వసతి గృహం మాజీ అధ్యక్షులు బొలిశెట్టి వీరయ్య గారు, రాష్ట్ర కుల సంఘం నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ గారు,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, కుల సంఘం పెద్దలు ప్రముఖులు
పెరిక జాతి ఐక్యతకు, పెరిక మహిళల సంఘటితశక్తికి నిదర్శనంగా నిలిచిన కార్యక్రమం
హాజరైన కుల ప్రముఖులను సత్కరించిన నిర్వాహక కమిటీ
సమన్వయంతో బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన నిర్వహణ కమిటీకి అభినందనలు తెలిపిన రాష్ట్ర సంఘం.
గ్రేటర్ హైదరాబాద్ పెరికకుల సంఘం,ఎల్బీనగర్ పెరిక కుల సంఘం, రంగారెడ్డి జిల్లా పెరిక కుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 24-09-25 న హయత్ నగర్లోని ఒక ఫంక్షన్ హల్ లో జరిగిన పెరిక కుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని వేలాదిమంది మహిళలు ప్రత్యేకంగా అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో హాజరై ఆటపాటలతో ఆనందంగా గడిపారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బత్తిని పరమేష్ గారు, ఎల్బీనగర్ అధ్యక్షులు సుందరి వీరభాస్కర్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోలిశెట్టి సతీష్ గారు వారి సంఘ కార్యవర్గ సభ్యుల సంయుక్త సమన్వయ సహకారంతో కార్యక్రమం అంచనాలను మించి అత్యద్భుతంగా విజయవంతం అయ్యింది.
సాయంత్రం నుండి కుల సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం మొత్తం పండుగ కళ ఉట్టిపడి హాజరైన కుల సోదరులకు మర్చిపోలేని మధురానుభూతిని మిగిల్చింది.
కుంకుమార్చన పూజ అనంతరం బతుకమ్మ ఆటపాటలలలో మహిళామణులు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొనగా, కుల బంధువులు ఉత్సాహంగా కార్యక్రమం వీక్షించారు.
పెరిక కులస్తులంతా సమైక్య భావనతో, కలసికట్టుగా జరుపుకున్న ఈ బతుకమ్మ వేడుకలు పెరిక సంఘం బలం, సాంస్కృతిక గౌరవాన్ని ఐక్యతశక్తిని ప్రతిబింబించాయి. మహిళల ఉత్సాహం, పురగిరి క్షత్రియుల సమైక్యత ఈ సంబరానికి ప్రత్యేకతను చేకూర్చాయి.
రాష్ట్ర కుల పెద్దలు ఉత్సాహంగా పాల్గొని మేమంతా ఒక్కటే ఐక్యత మా బలం అని చాటి చెప్పిన తీరు ప్రతి ఒక్క సంఘీయుడులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
రాష్ట్ర కుల సంఘం అధ్యక్షులు మద్దాలింగయ్య, కోకాపేట పెరిక భవన్ చైర్మన్ గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్కు నాలుగు వైపులా పెరిక భవన్ లు ఉండేలా ప్రణాళికలు వేస్తున్నామని, ఒకవైపు హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ పెరిక భవన్, వైపు ఉప్పల్ భవనం గత కుల పెద్దల కృషితో నిర్మించుకున్న విషయం గుర్తు చేస్తూ, ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా నిర్మించు కుంటున్న కోకాపేట పెరిక భవన్, వచ్చే సంవత్సరానికి ఎల్బీనగర్లో పెరిక భవాన్ నిర్మించి ఇలాంటి కార్యక్రమాలన్నీ అక్కడే చేసుకుందామని ఇది పెరిక జాతి బలానికి ఐక్యతకు,చిహ్నం అని అన్నారు.
నిర్వాహకులు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు బహుమతులు కూడా అందజేశారు, శ్రీరామ్ విజయపాల్ దంపతులు ఎత్తయిన బతుకమ్మను తీన్మార్ చప్పుల్ల మధ్యన వేదిక దగ్గరికి తీసుకు రావడం అందరినీ ఆకర్షించింది, వారికి ప్రత్యేక బహుమతి లభించింది.
ఆర్లపూడి మౌనిక వీరబాబు, రామినేని లక్ష్మీ భూలోకరావు, రామినేని స్నేహ వెంకటేశ్వర్లు, యగ్గడి నాగమణి శ్రీనివాస్ లు రూపొందించిన బతుకమ్మలకు మొదటి ఐదు బహుమతులు లభించాయి.
మన కుల బంధువు యగ్గడి శ్రీనివాస్, బొలిశెట్టి స్వాతి కార్యక్రమం అధ్యంతం చక్కని యాంకరింగ్ నిర్వహించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.
హాజరైన కుల బంధువులందరికీ రుచికరమైనటువంటి విందు భోజనాన్ని అందించి, అందరిచే నిర్వాహకులు అభినందనలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు అందే శ్రీనివాస్, కోకాపేట పెరిక భవన్ కో చైర్మన్ చుంచు ఉషన్న, రాష్ట్ర సంఘం ఆర్థిక కార్యదర్శి దొంగరి మనోహర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, పెరిక విద్యార్థి వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చా రఘుకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్, ఆర్థిక కార్యదర్శి బల్దూరి రవికుమార్, పెరికకుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మీ శేఖర్, కోశాధికారి బోడకుంటి ప్రకాష్, రాష్ట్ర నాయకులు దొంగరి శంకర్, కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షులు డాక్టర్ హసానబాద రాజేష్, రాష్ట్ర నాయకులు మైలారిశెట్టి చైతన్య, హాస్టల్ మాజీ ప్రధాన కార్యదర్శి దిడ్డి సురేష్, మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు కోట మల్లికార్జున్, రాష్ట్ర నాయకులు శ్రీరాం విజయ్ పాల్, రాష్ట్ర సంఘం యువజన విభాగపు అధ్యక్షులు దాసరి జయప్రకాష్, హాస్టల్ సంయుక్త కార్యదర్శి యర్రంశెట్టి ఉపేందర్, యువజన సంఘం గౌరవ అధ్యక్షులు మాడిశెట్టి శ్రీధర్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వి, ఎల్బీనగర్ మహిళా అధ్యక్షురాలు యగ్గడి నాగమణి, రంగారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపతి వెంకటలక్ష్మి,ముత్తినేని వెంకటేశ్వర్లు, బుద్దె వెంకటేశ్వర్లు,బి ఎల్ ఎన్,గోపతి రాజేశ్వరరావు, కుంచాల రమేష్, జ్యోతి బస్, రాజీవ్, నెమ్మని లింగస్వామి, బాల్తు రజినీకాంత్ , బాల్తు శ్రీనివాస్, రామినేని భూలోకరావు, సంధ్యాల వెంకటనారాయణ, జూకూరి మహేష్,జుకూరి చైతన్య రాజు,కుల బంధువులు, అత్యధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.
ఇంకా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర రోడ్డు రవాణా డెవలప్మెంట్ కార్పొరేషన్ మల్రెడ్డి రామ్ రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి హాజరయ్యారు.