తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
కో ఆర్డినేటర్
కో ఆర్డినేటర్
కో ఆర్డినేటర్
2026 జనవరి 30న జరిగే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పెరిక బిడ్డ శ్రీమతి ముత్తె అంజలీదేవి నిలబడ్డారు. అంజలీదేవి హైకోర్టులో ప్రముఖ న్యాయవాది. గతంలో హైకోర్టులో ఎజిపిగా కూడా పనిచేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటితీ ఇసి మెంబర్ గా గెలిచారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్ సభ్యురాలిగా పోటీ పడుతున్నారు. అంజలికి రాష్ట్ర పెరిక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆమెను గెలిపించే బాధ్యతను పెరిక కులస్తులు తీసుకోవాలని రాష్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పెరిక కులానికి చెందిన అడ్వకేట్లు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయడంతో పాటు, ఇతర న్యాయ వాదులతో కూడా ఓట్లు వేయించాలని కోరారు. సీరియల్ నెంబర్ 10తో అంజలీదేవి పోటీ చేస్తున్నారని, ఆమెను గెలిపించాలని కోరారు. పోటీలో ఉన్న అంజలీదేవి, ఆమె భర్త ప్రముఖ న్యాయవాది తిరుపతి వర్మ 2026 జనవరి 13న హైదరాబాద్ లో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ను కలిశారు. శాలువాతో సన్మానించారు. పెరిక సంఘం మద్దతు కోరారు. అంజలీదేవికి యావత్ పెరిక సమాజం అండగా ఉండి, గెలిపించే బాధ్యత తీసుకుంటుందని విజయ్ కుమార్ హామీ ఇచ్చారు.
తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రముఖ హైకోర్టు న్యాయవాది అంజలీదేవి ముత్తె గారికి తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంజలీదేవి గారిని గెలిపించుకుందామని పిలుపు ఇచ్చిన రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.
ఈనెల 30 వ తేదీన జరుగుతున్న తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కుల బంధువు హైకోర్టు న్యాయవాది ముత్తే అంజలి గారు, తన భర్త న్యాయవాది తిరుపతి వర్మ గారితో కలిసి ఈరోజు ఖైరతాబాద్ లోని పెరిక హాస్టల్ లో పెరిక కుల సంఘం పెద్దలని ఎన్నికలల్లో తనకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.
రాష్ట్రవ్యాప్తంగా 250 మంది పెరిక కుల అడ్వకేట్లు బార్ కౌన్సిల్ మెంబర్స్ గా ఉన్నారని, కుల సంఘం తరఫున ఎన్నికలో వారు తనకు ఓటు వేయాలని పిలుపు ఇవ్వాలని కోరారు.
గౌరవాధ్యక్షుడు మద్ద లింగయ్య గారు మాట్లాడుతూ పెరిక కుల బార్ కౌన్సిల్ మెంబర్స్ అంజలి దేవి గెలుపుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర సంఘం అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్ గారు, బొలిశెట్టి వీరయ్య గారు, దాసరి మల్లేశం గారు,పాయిల జంగయ్య గారు, విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు సుందరి వీరభాస్కర్ గారు, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు, సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మీ శేఖర్ గారు, సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్ గారు, రాష్ట్ర సంఘం ఆర్థిక కార్యదర్శి సందెల లింగం గారు, వసతి గృహం ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్ గారు, ఆర్థిక కార్యదర్శి బాల్దూరి రవికుమార్ గారు, కార్యనిర్వాక కార్యదర్శి, అంకతి విజయ్ కుమార్ గారు, పవన్ నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, యువజన విభాగపు గౌరవాధ్యక్షులు మైలారిశెట్టి చైతన్య గారు, ఎల్బీనగర్ జోన్ గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి నరసింహరావు గారు, ఎల్బీనగర్ జోన్ అధ్యక్షుడు బుద్దె వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు గారు, లాయర్ విభాగపు కోఆర్డినేటర్ జూకూరి మహేష్ గార్లు పాల్గొన్నారు.
పెరిక కుల ఐక్యతను, అంకితభావాన్ని చాటిచెప్పిన బార్ కౌన్సిల్ ఎన్నికలు
అంజలీదేవి గెలుపుకోసం నిస్వార్థంగా చెమటోడ్చిన పెరిక బంధువులు
పెరిక సోదరుల పోరాటతత్వాన్ని, సంఘటిత శక్తిని కొనియాడిన యావత్ జ్యుడిషియరీ ప్రపంచం
తెలంగాణ బార్ కౌన్సిల్ కు 2026 జనవరి 30న జరిగిన ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర పెరిక కులం ఐక్యతను, అంకితభావాన్ని, సంఘటిత శక్తిని చాటి చెప్పాయి. ఎన్నికలో మన పెరిక ఆడబిడ్డ, బెల్లంపల్లికి చెందిన హైకోర్టు అడ్వకేట్, ప్రస్తుతం హైకోర్టు బార్ అసోసియేషన్ ఇసి మెంబర్ కూడా అయిన ముత్తె అంజలీదేవి గారు పోటీ చేశారు. ఆమె గెలుపును రాష్ట్ర పెరిక కుల సంఘం (766/2014) తన భుజాన వేసుకుని పని చేసింది. రాష్ట్ర పెరిక సంఘం చాలా రోజుల ముందే ఎంతో ముందు చూపుతో తెలంగాణ న్యాయవాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగానికి రాష్ట్ర కో ఆర్డినేటర్లుగా వ్యవహిరించిన అల్లం నాగరాజు గారు, జూకూరి మహేశ్ కుమార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన పెరిక కుల ఆడ్వకేట్ల వివరాలు సేకరించగలిగారు. ఈ ప్రయత్నం బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మనకు బాగా ఉపయోగపడింది. ఏ మూలన ఏ లాయర్ ఉన్నాడో తెలుసుకోవడం సులభమయింది.
దురదృష్ట వశాత్తూ అల్లం నాగారాజు గారి నామినేషన్ తిరస్కరణకు గురయినప్పటికీ, నిరుత్సాహ పడకుండా అంజలీదేవి గారి కోసం అంతా కష్ట పడ్డారు. హైదరాబాద్ లో పెరిక కుల న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిచడంతో పాటు, వారం రోజులు వార్ రూమ్ నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న కుల నాయకులంతా ప్రతీ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించి, పెరిక కులస్తులను సమన్వయం చేయగలిగారు. మన పెరిక కుల అడ్వకేట్లే కాకుండా, వారికి తెలిసిన,పరిచయం ఉన్న అడ్వకేట్లతో కూడా ఓటు వేయించడానికి ప్రయత్నించారు.
ఎన్నికల రోజు మన సంఘం నాయకులు చూపిన అంకితభానం నిజంగా చాలా గొప్పది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నుంచి మొదలుకుని నల్గొండ, అచ్చంపేట వరకు, వికారాబాద్-సంగారెడ్డి నుంచి మొదలుకుని భద్రాచలం, కొత్తగూడెం వరకు మన కుల సంఘం నాయకులు న్యాయవాదులను సమన్వయం చేయడంలో, అంజలీదేవి గారికి ఓట్లు వేయించడానికి ఎంతో శ్రమ పడ్డారు. హైదరాబాద్ నగరంలో ఇటు హైకోర్టు, రంగారెడ్డి కోర్టు, సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి కోర్టు, కూకట్ పల్లి కోర్టు తదితర కోర్టుల వద్ద రాష్ట్ర పెరిక కుల అడ్వకేట్ విభాగం నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు, రంగారెడ్డి జిల్లా శాఖ నాయకులు, ఎల్.బి. నగర్ జోన్ నాయకులు న్యాయవాదులను ఓట్లు అర్థించారు. మంచిర్యాల, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, కోదాడ, మిర్యాలగూడ, నర్సంపేట.... ఇంకా చాలా చోట్ల మన పెరక సంఘం నాయకులు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపుకోసం శక్తి వంచన లేకుండా శ్రమించారు.
బార్ కౌన్సిల్ లో నిలబడ్డ చాలా మంది అభ్యర్థులకు ఆయా పార్టీల మద్దతు ఉంది. అంగబలం, అర్థబలం, కండబలం, కులబలం ఉంది. ఇవేమీ లేకున్నప్పటికీ కేవలం గుండె ధైర్యం, సమాజంలో మనకున్న మంచి పేరును మాత్రమే నమ్ముకుని మన కుల సోదరులు ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అలుపు లేని కృషి చేశారు.
తక్కువ సమయంలోనే ముత్తె అంజలీ దేవి గారు ప్రధాన పోటీ దారుగా మారడం చూసి మొత్తం న్యాయవాద లోకం అవాక్కయింది. పెరిక కులం వారు చాలా స్పూర్తివంతంగా తమ అభ్యర్థిని ప్రమోట్ చేశారని కొనియాడారు. ఇతర కులస్తులు కూడా పెరిక భవన్ వచ్చి మరీ అంజలీదేవి గారికి ఓటు వేస్తామని చెప్పి మరీ పోయారు.
మొత్తం 35 వేల ఓట్లలో పెరిక కులం న్యాయవాదులు 300 లోపు ఉంటారని అంచనా. అయినప్పటికీ మన లాయర్లకున్న పరిచయాలు, మన సంఘ నాయకులకు సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు, సంబంధాలను వాడుకుని గెలుపుకోసం శ్రమించారు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితాలు రాకముందే, మన పెరిక కులం మాత్రం ఐక్యతను చాటడంలో, పోరాటం చేయడంలో, అంకితభావం ప్రదర్శించడంలో విజయం సాధించింది.
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మన అభ్యర్థి గెలుపుకోసం విశేషంగా కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ రాష్ట్ర సంఘం తరుఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే స్పూర్తిని రాబోయే రోజుల్లో కొనసాగించాలని అభ్యర్థిస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 130 చోట్ల సర్పంచులుగా గెలిచారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూడా పెరిక కులస్తులు ఎక్కువ మంది ప్రజాప్రతినిథులుగా గెలవడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభినందనలు, ధన్యవాదములతో....
గటిక విజయ్ కుమార్
అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం
(రిజిష్టర్ నెంబరు 766/2014)
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో పెరిక కులానికి చెందిన శ్రీమతి ముత్తె అంజలీదేవి ఘన విజయం సాధించారు. బెల్లంపల్లికి చెందిన అంజలీదేవి పదేళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆమె భర్త మంచిర్యాలకు చెందిన అక్కల తిరుపతి వర్మ.
అంజలీ దేవి బార్ అసోసియేషన్ సభ్యురాలిగా ఎన్నిక కావడం పట్ల తెలంగాణ పెరిక కుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. 2025 మార్చి 31న హైదరాబాద్ లో రాష్ట్ర నాయకులు అంజలీదేవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు శ్రీరాం దయానంద్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, అచ్చ రఘు కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంకతి విజయ్ కుమార్, పెరిక సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.