తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షులు
ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర ఎన్నిక సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెరిక కుల కుటుంబ సమగ్ర డిజిటల్ సర్వే కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ కరీంనగర్ లో ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక ఇంపీరియల్ కన్వెన్షన్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా శాఖ అధ్యక్షుడు గాండ్ల చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా గటిక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, రాష్ట్ర సంఘం గౌరవ సలహాదారుడు దొరిశెట్టి వెంకటయ్య, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, పెరికదాత్రిఎడిటర్ బరుపాటి సంపత్, వరంగల్ జిల్లా శాఖ అధ్యక్షుడు అల్లం రాజేష్ వర్మ గౌరవ అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పెరిక బిడ్డ వివరాలు సేకరించి వెబ్సైట్లో పెడతామని, రాష్ట్రంలో ఏ పెరిక బిడ్డ ఏ ఏ వృత్తిలో ఉన్నాడు ?ఎక్కడ నివసిస్తున్నాడు? వారి సామాజిక స్థితిగతులు ఏమిటి ?తదితర విషయాలని అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ సర్వే ద్వారా సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుందని, అప్పుడు పెరిక కులస్తుల కోసం చేయాల్సిన కార్యక్రమాలను రచించడం జరుగుతుందని విజయకుమార్ వెల్లడించారు. రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భవన నిర్మాణం జరుగుతున్నదని, పెరిక విద్యార్థి వసతిగృహం ద్వారా బాలికల హాస్టల్ నిర్మాణం జరుగుతున్నదని, పరపతి సంఘాన్ని బ్యాంకుగా మార్చే ప్రక్రియ సాగుతున్నదని, వివాహ వేదిక ద్వారా ఉచిత వివాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి కుల సంఘం తన కుల అభివృద్ధి కోసం కృషి చేస్తే అంతిమంగా సామాజిక పరివర్తన సాధ్యమవుతుందని చెప్పారు. కులం కోసం పనిచేయడం అంటే మరో కులానికి వ్యతిరేకం కాదని, ఎవరి ఇంటిని వారు చక్కదిద్దుకోవడమని విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శాఖ నూతన అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా గాండ్ల చంద్రశేఖర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాన కార్యదర్శిగా బస్వ వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కోకాపేటలో ఆత్మగౌరవ భవనానికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, కరీంనగర్ నగరంలో పెరిక భవన్ నిర్మించడానికి స్థలం కేటాయించాలని ఈ సమావేశం తీర్మానాలు చేసింది. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే విరాళాలు సేకరించి కరీంనగర్ లో పెరిక భవన్ నిర్మించుకుంటామని సంఘం నాయకులు ప్రకటించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కరీంనగర్ నగరంలో పెరిక భవన్ కోసం స్థలం కేటాయించే ప్రయత్నం ప్రారంభమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని స్థలం కేటాయింపు ఉత్తర్వులు ఇవ్వాలని సమావేశం కోరింది.
ఈ సమావేశంలో యువజన విభాగం అసోసియేట్ అధ్యక్షుడు పోకల నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేణ మల్లయ్య, కరీంపేట మాజీ సర్పంచ్ వనపర్తి మల్లయ్య, జిల్లా నాయకులు సాయిని దేవన్న, పెట్టాం సంపత్, దాసరి అశోక్, మీసా శ్రీనివాస్, తమ్మిశెట్టి రవి, వంగల మధు, కరుకూరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.