తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గౌతమి నగర్ లో ఉన్న ఎస్.ఏ ఫంక్షన్ హాల్లో పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశం 2026 ఏప్రిల్ 18న ఘనంగా నిర్వహించబడింది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కుల బంధువులు హాజరై సంఘ ఐక్యతను చాటారు.
పెద్దపల్లి జిల్లా పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశములో రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. సంఘ అభివృద్ధి, సామాజిక సంక్షేమం, యువత పురోగతి వంటి ముఖ్య అంశాలపై చర్చలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు డా గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్ద లింగయ్య, అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్ రాష్ట్ర సంఘం మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, శ్రీ కందుల పోచం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గాండ్ల చంద్రశేఖర్, యువజన విభాగం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పొకల నాగయ్య, సీనియర్ నాయకులు మీసా అర్జున్ రావు, బోడకుంటి చొక్కయ్య బత్తుల రమేష్ సీనియర్ పాత్రికేయులు బండి చంద్రమౌళి న్యాయవాది చల్లా విశ్వం కారుకూరి చంద్రమౌళి లగిశెట్టి చంద్రమౌళి హాజరయ్యారు.
రామగుండం కార్పొరేషన్ పెరిక కుల సంఘం అధ్యక్షుడు పోతరాజు అంజయ్య గారి అధ్యక్షతన ఇట్టి సమావేశం కొనసాగినది . ప్రధాన కార్యదర్శి మార్త రాజేశం గారు మరియు వివిధ గ్రామాల కుల ప్రముఖులు ప్రజాప్రతినిధులు హాజరై సమావేశాన్ని దిగ్విజయం చేయడం జరిగినది పలువురు నాయకులు సంఘ బలోపేతంపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని, యువత ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. సమాజ ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని వారు స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షులుగా దుండె మల్లేశం గారిని అసోసియేట్ అధ్యక్షులుగా గోవిందుల ఆనంద్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.