తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షులు
ప్రధాన కార్యదర్శి
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు మద్దాలింగయ్య, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయకుమార్ వారి కార్యవర్గాలు, కుల పెద్దలు, సంఘ నాయకులు.
సూర్యాపేట :
సూర్యాపేట పట్టణ పరిధిలో దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి గుడి ఎదురుగా నేషనల్ హైవే పక్కన అత్యంత విలువైన ఎకరం స్థలాన్ని జిల్లా పెరిక భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసింది.
పెరిక భవన్ నిర్మాణానికి మంత్రి జగదీష్ రెడ్డి గారు గురువారం సాయంత్రం హాజరైన రాష్ట్ర పెరిక సంఘం నాయకులు, జిల్లా నలుమూలల నుండి హాజరైన కుల బంధువుల సమక్షంలో శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పెరికభవన్ నిర్మాణానికి 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నానని, భవిష్యత్తులో కూడా అన్ని రకాల సహాయ సహాకారాలు అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంఘం అధ్యక్షులు మద్దాలింగయ్య, ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్‌లు హాజరైన రాష్ట్ర నాయకులతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డికి కోకాపేట భవన నిర్మాణ మోడల్ మెమొంటోను అందజేసి అయనను సత్కరించారు.
సూర్యాపేట పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా పెరిక భవనం కోసం ఎదురుచూస్తున్నామని, భవనం నిర్మాణం కోసం ఎకరం స్థలం 50 లక్షల రూపాయలను ప్రకటించినందుకు మంత్రి జగదీశ్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు మద్దాలింగయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పెరిక హాస్టల్ అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున,మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ,పెద్దలు దాసరి మల్లేశం, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, భవన నిర్మాణ కమిటీ అధికార ప్రతినిధి బత్తిని పరమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరి వీరభాస్కర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంధు శ్రీధర్ బాబు, పెరిక హాస్టల్ గౌరవ అధ్యక్షుడు డా. దొంగరి వెంకటేశ్వర్లు,ఆత్మ గౌరవ భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, నిర్మాణ కమిటీ సభ్యులు దొంగరి శంకర్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వనపర్తి లక్ష్మీనారాయణ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొలిశెట్టి సతీష్, నల్గొండ జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు ముత్తినేని శ్యామ్, ఖమ్మం జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు గజవెల్లి సత్యనారాయణ సూర్యాపేట పట్టణ అధ్యక్షులు బాల్తు శ్రీనివాస్ తో పాటు జిల్లా వ్యాప్తంగా కుల భాంధవులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా పెరుకకుల సంఘం 766/2014 సర్వసభ్య సమావేశం, సంక్రాంతి వేడుకలు మరియు సర్పంచులు ఉప సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం 2026 జనవరి 12న కోదాడ పెరిక హాస్టల్లో ఘనంగా జరిగాయి. పెరిక హాస్టల్ అధ్యక్షుడు హస్నాబాద్ రాజేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఘటిక విజయ్ కుమార్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట ఆత్మగౌరవ భావన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి ఆనంద్, సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన పిసిసి సభ్యులు శ్రీ దొంగరి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
8- 2 తేడాతో కొత్త కమిటీని ఎన్నుకున్న సమన్వయ కమిటీ
సూర్యాపేట జిల్లా కమిటీ అధ్యక్షుని ఎన్నిక చేయడం కోసం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున మొత్తం 12 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు అయింది. ఈ సమన్వయ కమిటీలోని ఎనిమిది మంది సభ్యులు (డాక్టర్ మిన్న రామకృష్ణ, దొంగరి వెంకటేశ్వర్లు, కీత భద్రయ్య, యరంశెట్టి పిచ్చయ్య, శిరంశెట్టి వెంకన్న, మార్త కృష్ణమూర్తి, దాచపల్లి వెంకన్న, పుల్లూరి అచ్చయ్య) బందు శ్రీధర్ బాబు అధ్యక్షుడుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇద్దరు సభ్యులు (జుట్టుకొండ సత్యనారాయణ, అంగిరేకుల నాగార్జున) సముద్రాల రాంబాబు అధ్యక్షుడిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. మరో ఇద్దరు సభ్యులు (సుంకరి అజయ్ కుమార్, బొలిశెట్టి కృష్ణయ్య) తటస్థంగా వ్యవహరించారు. దీంతో అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు పేరును జిల్లా సమన్వయకర్త దొంగరి వెంకటేశ్వర్లు ప్రకటించారు. దాంతోపాటు ప్రధాన కార్యదర్శిగా పాయిలి వెంకటనారాయణ ను కమిటీ ఎన్నుకున్నది. ఈ ఇద్దరికీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.
అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు
కోదాడ పెరిక హాస్టల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా జరిగాయి. మహిళలకు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో విజేతలకు రాష్ట్ర సంఘం నాయకులు బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
సర్పంచులు ఉపసర్పంచ్ లకు ఘన సన్మానం
సూర్యాపేట జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజేతలైన సర్పంచులు ఉపసర్పంచ్ లకు రాష్ట్ర పెరిక సంఘం నాయకులు ఘనంగా సన్మానం నిర్వహించారు. కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, జడ్జి చిత్తలూరి సత్యనారాయణ, జిల్లా నాయకులు పాయిల కోటేశ్వరరావు, తొగరు రమేష్, దొంగరి శ్రీనివాసరావు, సుందరి వెంకటేశ్వర్లు, రామినేని సత్యనారాయణ, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ సత్యనారాయణ, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల బాలరాజు శ్రీనివాస్, పెరిక విద్యార్థి వసతిగృహం ప్రధాన కార్యదర్శి అచ్చా రఘుకుమార్, కోశాధికారి బాల్దురి రవికుమార్, ఎల్బీనగర్ జోన్ అధ్యక్షుడు బుద్దే వెంకటేశ్వర్లు, అడ్వకేట్ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ జూకూరి మహేష్, యువజన విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మైలారిశెట్టి శెట్టి చైతన్య, ఎల్బీనగర్ జోన్ ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకన్న తదితర నాయకులు దాదాపు వెయ్యిమంది స్వసంఘీయులు పాల్గొన్నారు.