రాజు వెడ్స్ రాంబాయి సూపర్ డూపర్ హిట్ తో చరిత్ర సృష్టించిన పెరిక బిడ్డ
మొదటి సినిమాతోనే టాలీవుడ్ ను షేక్ చేసిన పూజారి నాగేశ్వరరావు గారు
పూజారి నాగేశ్వర్, ఊడుగుల వేణును అభినందించిన రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షులు మద్దాలింగయ్య, అధ్యక్షులు గటిక విజయ్ కుమార్
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పెరిక జాతి ముద్దుబిడ్డ, రాష్ట్ర పెరిక సంఘం న్యాయ విభాగం కోఆర్డినేటర్ పూజారి నాగేశ్వరరావు గారు రూపొందించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. టాలీవుడ్ చరిత్రలోనే కనివిని ఎరగని రికార్డులను సొంతం చేసుకుంటున్నది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పెరిక సంఘం గౌరవ అధ్యక్షులు మద్దాలింగయ్య, అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్ హైదరాబాదులో పూజారి నాగేశ్వరరావును అభినందించారు పూజారి నాగేశ్వరరావు తో పాటు ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ దర్శకుడు ఊడుగుల వేణును కూడా రాష్ట్ర సంఘం నాయకులు అభినందించారు.
భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి పేరు తెచ్చుకోవాలని, టాలీవుడ్ లోనే ప్రముఖ నిర్మాణ రంగ సంస్థగా పూజారి నాగేశ్వర్ రావు గారికి చెందిన ఎదగాలని పెరిక సంఘం నాయకులు అభివర్ణించారు.
సినీ bపరిశ్రమలో ఇప్పుడిప్పుడే పెరిక బిడ్డలు ఎదుగుతున్నారని, వారందరికీ నాగేశ్వరరావు గారు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పెరక సంఘం నాయకులు కోరారు. నాగేశ్వరరావు గారిని స్ఫూర్తిగా తీసుకొని పెరిక బిడ్డలు మరింత మంది సీనియర్ రంగంలో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం నాయకులు వనపర్తి రాము కూడా పాల్గొన్నారు.