వివరాలను నింపి సర్వే ప్రారంభించిన ప్రముఖ బిజెపి రాష్ట్ర నాయకులు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ గారు.రాష్ట్ర సంఘం మంచి కార్యక్రమం చేపట్టిందని తెలిపిన పెరిక విద్యార్థి వసతి గృహం మాజీ అధ్యక్షులు, విద్యాసంస్థల అధినేత అంగిరేకుల నాగార్జున గారు. మంచి కార్యక్రమానికి రాష్ట్ర కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గజవెల్లి సత్యనారాయణ గారిని సన్మానించిన ప్రముఖ వైద్యులు, ప్రతిష్ట ఫార్మసీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మిన్నా శివరామకృష్ణ గారు.రాష్ట్రంలో మన కుల సంఘీయుల సంఖ్యను తెలుసుకొని,కుల అభివృద్ధికి పాటు పడాలన్న ప్రధాన ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారు పెరిక కుల సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజవెల్లి సత్యనారాయణ గారిని నియమించిన విషయం తెలిసిందే, వారు పెరిక కుల కుటుంబ సర్వేను ఈరోజు(29/11/25) శనివారం సూర్యాపేటలో మొదలు పెట్టారు.ఈ సర్వే ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పెరిక కుటుంబం వివరాలు సేకరించడం, మన కుల సామాజిక, ఆర్థిక స్థితి తెలుసుకొని, భవిష్యత్తు కార్యక్రమాలకు పునాదులు వేసే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం (రి. నెం 766/2014) సమగ్ర కుటుంబ సర్వేను చేపడుతున్నది. ఈ సందర్భంగా గజవెల్లి సత్యనారాయణ గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు గారు, పట్టణ సంఘం అధ్యక్షులు పత్తిపాక వేణుధర్ గారు, పట్టణ, జిల్లా కుల బంధువుల సమక్షంలో ప్రముఖ బీజేపీ రాష్ట్ర నాయకులు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ గారు తమ వివరాలు నింపి ఈ సర్వేను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇది మన కుల చరిత్రలో ఒక ముఖ్యమైన అడుగు. ప్రతి కుటుంబం ఇందులో పాల్గొనాలని అన్నారు.పెరిక విద్యార్థి వసతి గృహం మాజీ అధ్యక్షులు, ప్రముఖ బిఆర్ఎస్ నాయకులు అంగిరేకుల నాగార్జున గారు మాట్లాడుతూ రాష్ట్ర సంఘం చేస్తున్న ఈ సర్వే మన కుల అభివృద్ధికి తోడ్పడుతుందని, ఇది భవిష్యత్తు తరాలకి ఉపయోగపడుతుందని అన్నారు. గజవెల్లి సత్యనారాయణ గారు గతంలో ఖమ్మం జిల్లాలో కుటుంబ సర్వే విజయవంతంగా పూర్తి చేసిన అనుభవంతో, ఇప్పుడు రాష్ట్ర స్థాయి కుటుంబ సర్వే కోఆర్డినేటర్గా నియమితులయ్యారని, ఇది అద్భుతమైన కార్యక్రమమని ఈ సందర్భంగా సత్యనారాయణ గారిని ప్రముఖ వైద్యులు, ప్రతిష్టా ఫార్మసీ కాలేజ్ అధినేత డాక్టర్ మిన్నా శివరామకృష్ణ గారు సత్కరించారు, వారి వివరాల అందించారు. సూర్యాపేట పట్టణ పెరిక కుల సంఘం మాజీ అధ్యక్షులు దొంగరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పెరికకుల సంఘానికి ఈ కార్యక్రమం ఒక దిక్సూచి అవుతుందని తెలిపారు. పట్టణ గౌరవాధ్యక్షులు బందు వీరయ్య గారు,జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సముద్రాల రాంబాబు గారు, జిల్లా ఉపాధ్యక్షులు బోలిశెట్టి మధు గారు, పట్టణ సహా అధ్యక్షుడు యర్రంశెట్టి రామలింగయ్య గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి పోతురాజు నరసయ్య గారు, పట్టణ కోశాధికారి సోమిశెట్టి లింగయ్య గారు, పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి నట్టే కిరణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మంచి కార్యక్రమమని అభినందించి వారి వివరాలను నమోదు చేశారు. కుటుంబ సర్వే అంటే కేవలం వివరాల సేకరణ కాదు – మన కుల బలం, ఐక్యతకు ప్రతీక.ప్రతి పెరిక కుటుంబం ఈ సర్వేలో భాగస్వామ్యం కావాలని రాష్ట్ర సంఘం పిలుపునిస్తోంది.