రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను వందకు వంద శాతం పాటించడం ద్వారా పెరిక కుల పరస్పర సహాయ సహకార పరపతి సంఘం ప్రత్యేక బ్యాంకుగా రూపాంతరం చెందే అర్హత సంపాదించిందని, దీంతో అతి త్వరలోనే రాష్ట్రంలో పెరిక కో ఆ బ్యాంకు ఏర్పాటు అవుతుందని సంఘం నాయకులు ప్రకటించారు
*పెరిక కుల పరస్పర సహాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్ల సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు అందె శ్రీనివాస్ అధ్యక్షతన పెరిక భవన్ లో 2025 నవంబర్ 19న జరిగింది. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో డైరెక్టర్లుగా ఎన్నికైన వారు కొత్త కార్య నిర్వాహక కమిటీని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు డా.గటిక విజయ్ కుమార్, మాజీ అధ్యక్షుడు శ్రీ శ్రీరాం దయానంద్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా శ్రీ అందె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ సుంకరి ఆనంద్ మరోసారి ఎన్నికయ్యారు., నూతన కోశాధికారిగా శ్రీ గోపతి కేశవ్, ఉపాధ్యక్షుడిగా పత్తిపాక వెంకన్న, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీ బరుపటి సంపత్ కుమార్ ఇంటర్నల్ ఆడిటర్లుగా శ్రీ వలిశెట్టి లక్ష్మిశేఖర్ మరియు శ్రీ వలిశెట్టి అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం 1350 మంది సభ్యులతో, కోటి 35 లక్షల మూలధనంతో, నాలుగు కోట్ల టర్నోవర్ తో పరపతి సంఘం నడుస్తుందని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అందె శ్రీనివాస్, సుంకరి ఆనంద్ ప్రకటించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను సంపూర్ణంగా అమలు చేసినట్లు సహకార శాఖ నుంచి క్లీన్ చిట్ వచ్చిందని చెప్పారు. ప్రత్యేక బ్యాంకుగా ఏర్పాటు చేయడానికి పెరిక పరపతి సంఘం అర్హత సంపాదించిందని వెల్లడించారు. ప్రస్తుతం పరపతి సంఘం వద్ద ఉన్న నిధులతో పాటు అవసరమైతే తాము మరికొన్ని డిపాజిట్లు సమకూర్చి బ్యాంకు ఏర్పాటుకు ముందుంటామని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీ గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు శ్రీ మద్దా లింగయ్య గార్లు ప్రకటించారు.
పరపతి సంఘాన్ని బ్యాంకుగా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను మాజీ బ్యాంకు అధికారి అయిన శ్రీ వలిశెట్టి లక్ష్మిశేఖర్ గారికి సంఘం నాయకులు అప్పగించారు.
2026 సం.ము నూతన డైరీ తీసుకురావాలని, డిసెంబరు నాటికి 1500 తద్వారా 2000 వరకు సభ్యులను పెంచాలని నిర్ణయించారు. దాదాపు 90 శాతం మంది సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని, 10 శాతం మంది కేవలం దురుద్దేశ్యంతోనే సంఘాన్ని నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే కిస్తీలు సరిగా చెల్లించడం లేదని గుర్తించారు. అలాంటి డిఫాల్టర్లకు, వారికి గ్యారంటీ ఇచ్చిన వారికి వెంటనే లీగల్ నోటీసులు పంపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానం చేశారు.
పరపతి సంఘం సహకార శాఖ, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నియమాలకు అనుగుణంగా నడుస్తున్నదని, ఈ విషయం గతంలోనే అనేక విచారణల ద్వారా వెల్లడయిందని నాయకులు ప్రకటించారు. అయినప్పటికీ కొంత మంది వ్యక్తులు దురుద్దేశ్యంతో సోషల్ మీడియాలో పరపతి సంఘం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని సమావేశంలో తీర్మానించారు.
సంఘం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారానికి దిగిన వారికి లీగల్ నోటీసులు పంపడంతో పాటు సివిల్,క్రిమినల్ చర్యలు తీసుకోవాని నిర్ణయించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ ఆర్ధిక కార్యదర్శి సందెల లింగం ప్రచార కార్యదర్శి బంధు శ్రీధర్ బాబు రాష్ట్ర క్రీడా కో ఆర్డినేటర్ గుమ్మళ్ల సురేందర్ కోకాపేట భవన నిర్మాణ కమిటీ కో కన్వీనర్ చుంచు ఉషన్న పెరిక విద్యార్థి వసతి గృహం కోశాధికారి బాల్దూరి రవి కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్ పరపతి సంఘం డైరెక్టర్లు పాయిల కవిత శ్రీనివాస్ ఇండ్ల చంద్ర శేఖర్ ఆకుల అనిల్ కుమార్ బస్వ వెంకన్న మరియు పత్తిపాక వెంకట వర ప్రసాద్ గార్లు పాల్గొన్నారు.