తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
గౌరవ అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
మంచిర్యాల జిల్లా పెరికకుల సంఘం సర్వసభ్య సమావేశం ఈరోజు 21-12-2025 (ఆదివారం) లక్షట్టిపేటలోని ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ కోఆర్డినేటర్ చుంచు ఉషన్న గారి పర్యవేక్షణలో అత్యంత ఘనంగా, కుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా జరిగింది.
రాష్ట్ర అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ కులాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నదని, కోకపేట భవనం, హైదరాబాదులో మహిళా హాస్టల్ నిర్మాణం లాంటి నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తున్నామని వాటికి మీ సహకారం కావాలని అన్నారు పెరిక కులస్తులు అధికంగా ఉన్న జిల్లా మంచిర్యాల అని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇక్కడి నుంచే మన వారే ఎమ్మెల్యే కావాలని అది సాధ్యమవ్వాలంటే మనమంతా ఐక్యంగా నిలవాలని,వ్యక్తులకంటే కులం, పదవులకంటే భవిష్యత్తు ముఖ్యమని ఆయన అన్నారు.
గౌరవ అధ్యక్షుడు మద్ద లింగయ్య గారు మాట్లాడుతూ కుల ఐక్యత, మన వారి రాజకీయ భవిష్యత్తుపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మంచిర్యాల జిల్లాలో గెలుపొందిన
పెరిక కుల సర్పంచ్లకు ఘన సన్మానం నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దోంగరి వెంకటేశ్వర్లు, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి దొంగరి శంకర్ గార్లకు మంచిర్యాల జిల్లా ప్రముఖులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూజారి రమణ,పెరిక ధాత్రి ఎడిటర్ బరుపటి సంపత్, యువజన విభాగపు అసోసియేట్ అధ్యక్షులు పోకల నాగయ్య, ఉమ్మడి ఆదిలాబాద్ మాజీ అధ్యక్షుడు పెట్టెం లక్ష్మణ్, యూత్ ప్రెసిడెంట్ అంకతి శ్రీనివాస్, లక్షట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గోళ్ళ ముని, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు.
క్యాతనపెల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ లో పెరిక సంఘం మంచిర్యాల జిల్లా ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్ గారు, గౌరవ అధ్యక్షులు పెట్టేం లక్స్మన్ గారు, ఆత్మ చైర్మన్ సంగతి మురళి గారు,మాజీ కాన్సిలర్ పనస రాజు గారు, కాంగ్రెస్ నాయకులు భానేష్,obc జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి, పెరుక సంఘం నాయకులు నెల్కి మల్లేశ్, కారుకూరి చంద్రమౌళి, క్యాతన పల్లి మున్సిపాలిటీ కి చెందిన అక్కల రమేష్,బియ్యల సత్తయ్య, మంచిర్యాల కి చెందిన అక్కల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
2026 జనవరి 3న జరిగిన పురగిరి క్షత్రియ పెరిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ పివిఆర్ గార్డెన్ లో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బొడ్డు శంకర్ గారు మరియు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి చుంచు రాజ్ కిరణ్ గారు మరియు మంచిర్యాల పట్టణ అధ్యక్షులు బొడ్డు తిరుపతి గారు మరియు నస్పూర్ సీనియర్ నాయకులు తిప్పరి రామన్న గార్ల ఆధ్వర్యంలో క్యాలెండర్ 2026 ఆవిష్కరణ జరిగింది
2026 జనవరి 4 రోజున స్థానిక లోటస్ స్కూల్లో బెల్లంపల్లి నియోజకవర్గ పురగిరి క్షత్రియ పెరిక సంఘం సమావేశంఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు శ్రీ ఆకిరెడ్డి శంకర్ గారు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు శ్రీ బొడ్డు శంకర్ గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ పెట్టం లక్ష్మణ్ గారు హాజరయ్యారు. అలాగే విశిష్ట అతిథులుగా శ్రీ తొంగల సత్యనారాయణ గారు, శ్రీ కారుకూరి రాంచందర్ గారు పాల్గొని కార్యక్రమానికి విశేషమైన ప్రాధాన్యత చేకూర్చారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ, సమావేశానికి హాజరైన స్వసంగీలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే సంవత్సరంలో వారు అనుకున్న అన్ని కార్యాలు విజయవంతంగా పూర్తవాలని ఆకాంక్షించారు. అలాగే పెరిక స్వసంగీలందరూ కుల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సమయాన్ని కేటాయిస్తూ ఐక్యతతో ముందుకు సాగాలని, విద్య, ఉపాధి, సామాజిక రంగాల్లో మరింత పురోగతి సాధించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బెల్లంపల్లి పెరిక కులస్తుల చిరకాల కోరిక అయిన పెరిక భవన్ నిర్మాణానికి అవసరమైన స్థలం విషయమై విస్తృతంగా చర్చించడమైంది.
అనంతరం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా బెల్లంపల్లికి వచ్చిన జిల్లా అధ్యక్షులు శ్రీ బొడ్డు శంకర్ గారిని, అలాగే గౌరవ అధ్యక్షులు శ్రీ పెట్టం లక్ష్మణ్ గారిని ఘనంగా సన్మానించారు.
తదనంతరం హాజరైనా స్వసంగీయులందరి సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ను శ్రీ బొడ్డు శంకర్ గారు, శ్రీ తొంగల సత్యనారాయణ గారు, శ్రీ కారుకూరి రాంచందర్ గారు, శ్రీ ఆకిరెడ్డి శంకర్ గారు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి హాజరై తమ విలువైన సమయాన్ని కేటాయించిన మంచిర్యాల జిల్లా కుల పెద్దలకు, బెల్లంపల్లి నియోజకవర్గం పెరిక స్వసంగీయులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.