తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
ఉపాధ్యక్షుడు
యువజన విభాగం అధ్యక్షుడు
యువజన విభాగం ప్రధాన కార్యదర్శి
సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ఆయా కుల సంఘాలు కూడా బాధ్యతగా తీసుకొని తమ వర్గాల సంక్షేమం- అభివృద్ధికి పాటుపడాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయా సామాజిక వర్గాల్లోని పేదలను ఆదుకుంటూనే భావితరాలకు బాట చూపే కార్యక్రమాలు కుల సంఘాలు అమలు చేయాలని సూచించారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని సామాజిక వర్గాలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉందని ఆయన చెప్పారు.
సిద్దిపేట జిల్లా పెరికకుల సంఘం సమావేశం 2026 ఆగస్టు 2 ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు పిన్నాని రాధా కిషన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి గటిక విజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కుల ఆత్మగౌరవ భవనాల కోసం హైదరాబద్ లో స్థలాలు కేటాయించిందని, కానీ భవనాల నిర్మాణానికి నిధులు ఈనాటికి విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు.
ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ నిధుల ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో అర్హులకు అందడం లేదని, కుల సంఘాల సమన్వయంతో కార్యక్రమాలు చేపడితే తప్పక విజయవంతం అవుతాయని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర పీకకుల సంఘం తమ కులంలోని పేదలు, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 51 సంవత్సరాలుగా ఖైరతాబాద్ చౌరస్తాలో పెరిక భవన్ నిర్వహిస్తూ వేలాది మంది విద్యార్థులకు విద్యా- వసతి -భోజనం కల్పిస్తున్నట్లు వివరించారు. కోకాపేటలో అద్భుతమైన రీతిలో ఆత్మగౌరవం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ లో బాలికల కోసం ప్రత్యేకంగా హాస్టల్ నిర్మిస్తున్నామని చెప్పారు. పెరిక పరపతి సంఘం ద్వారా అవసరమైన వారికి ఆర్థిక చేయూత అందిస్తున్నామని పెరిక సంక్షేమ సమితి ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నామని వివరించారు.
రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు మద్ద లింగయ్య, ప్రత్యేక ఆహ్వానితుడు భూసాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మార్త సత్తయ్య, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం కిషన్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా లక్కరుసు సుధాకర్
సిద్దిపేట జిల్లా పెరిక సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా లక్కరుసు సుధాకర్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కారు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ముత్తినేని రాజు, యువజన విభాగం అధ్యక్షుడిగా అటిక వంశీ, ప్రధాన కార్యదర్శిగా భూసాని సాయి ఎన్నికయ్యారు. అన్ని గ్రామాల ప్రాతినిధ్యంతో త్వరలోనే జిల్లాస్థాయి పూర్తి కార్యవర్గం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన సమావేశం
సిద్దిపేటలో హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట పెరుకకుల భవన నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయించడానికి కృషిచేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది ఈ స్థలంలో త్వరలోనే పెరిక భవన్ నిర్మించాలని సమావేశం తీర్మానించింది. భవన నిర్మాణానికి కూడా తన వంతు సహాయం అందిస్తానని చెప్పిన హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపింది.