తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
ముఖ్య సలహాదారు
గౌరవ అధ్యక్షుడు
కోశాధికారి
వర్కింగ్ ప్రసిడెంట్
అధికార ప్రతినిథి
ప్రచార కార్యదర్శి
అధ్యక్షుడు, యువజన విభాగం
ప్రధాన కార్యదర్శి, యువజన విభాగం
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో జూన్ 28న ‘పెరిక మహాసభ’ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం, యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక సంఘం నిర్ణయించాయి. ఉదయం 8 గంటలకు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కోకాపేటలో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడంతో పాటు, యాదాద్రిలో పెరిక సత్రం నిర్మాణానికి దేవుడి ఆశీస్సులను పెరిక పెద్దలు కోరనున్నారు. అనంతరం యాదాద్రిలోని పెరిక సత్రం స్థలాన్ని నాయకులు సందర్శిస్తారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో మహాసభ జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను 2026 జూన్ 17న ఖైతరాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహంలో తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర పెరిక కుల సంఘం ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ ఆవిష్కరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు తిప్పని పరమేశ్, ప్రధాన కార్యదర్శి కోటా సుధాకర్, యాదాద్రి పెరిక కుల సేవా సమితి ట్రస్టు అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీధర్, గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు దిడ్డి బాలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా అధికార ప్రతినిథి దాచేపల్లి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి దాచేపల్లి కృష్ణ, జిల్లా నాయకుడు సోమగాని అశోక్ తదితరులు పెరిక కుల పెద్దలకు ఆహ్వాన పత్రిక అందించారు.
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు, పెరిక కుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గారు, వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు గారు, విప్ గంప గోవర్థన్ గారు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ గారు, రాష్ట్ర పెరిక సంఘం ముఖ్య సలహాదారులు శ్రీరాం భద్రయ్య గారు, మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం గారు, శ్రీరాం దయానంద్ గారు, రాష్ట్ర పెరిక సంఘం నాయకులు, పెరిక విద్యార్ధి వసతి గృహం మేనేజింగ్ కమిటీ, కోకాపేట ఆత్మగౌరవ కమిటీ బాధ్యులు, పెరిక సంక్షేమ సమితి కార్యవర్గం, పెరిక పరపతి సంఘం కార్యవర్గం, పెరిక వివాహ వేదిక బాధ్యులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.
యాదగిరిగుట్ట, 2026 జూన్ 28:
యాదాద్రి భువనగిరి జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు తిప్పని పరమేష్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం SNLS FUNCTION HALL యాదగిరిగుట్ట లో ఈ రోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి పెరిక కుల పెద్దలు, ప్రముఖులు, సంఘ నాయకులు, యువ నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సంఘ పెద్దలు మాట్లాడుతూ, పెరిక సమాజ అభివృద్ధి, ఐక్యత, యువతకు ప్రోత్సాహం, విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అలాగే యాదగిరిగుట్టలోని పెరిక కుల సేవ సమితి ట్రస్ట్ లో మన పెరిక కులస్తులు ట్రస్ట్ మెంబర్ లుగా చేరాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పెరిక కుల పెద్దలు, నాయకులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించి, విజయవంతంగా బాధ్యతలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గటిక విజయ్ కుమార్ గారు,పెరిక కుల కార్పోరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, పెరిక కుల కార్పోరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గారు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మద్దే లింగయ్య గారు, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు, రాష్ట్ర పెరిక కుల ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారు, సందేల లింగం గారు, జిల్లా ప్రముకులు దాసరి మల్లేశం గారు మహిళా విభాగం అధ్యక్షురాలు కందుల సంధ్య రాణి గారు, ప్రధాన కార్యదర్శి మంచాల వరలక్ష్మి గారు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బంధు శ్రీధర్ బాబు గారు, యువజన విభాగం అధ్యక్షుడు దాసరి జయ ప్రకాష్ గారు, పెరిక కుల సేవ సమితి ట్రస్ట్ అధ్యక్షుడు అరె శ్రీనివాస్ గారు, ట్రస్ట్ మెంబర్లు, వివిధ జిల్లాల అధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా కుల పెద్దలు, గ్రామ శాఖ అధ్యక్షులు, కుల బంధువులు పాల్గొన్నారు