తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సహకార కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 6 న భర్తీ చేసింది. చైర్మన్ గా దొంగరి వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా బుడగం శ్రీనివాస్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దొంగరి వెంకటేశ్వర్లు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన వారు. వీరు గతంలో రెండు పర్యాయాలు గ్రామ సర్పంచ్ గా పని చేశారు. ఒకసారి ఉప సర్పంచ్ గా పని చేశారు. సింగిల్ విండో చైర్మన్ గా, డిసిసిబి డైరెక్టర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న దొంగరి వెంకటేశ్వర్లు గారు గతంలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం (766/2014) సూర్యాపేట జిల్లా కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.
బుడగం శ్రీనివాస్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామానికి చెందిన వారు. గతంలో శ్రీనివాస్ గారు భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. జాతీయ ఫార్మాస్యూటికల్ బోర్డు మెంబర్ గా విధులు నిర్వర్తించారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. పిసిసి సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం (766/2014) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు కావడం పెరిక సమాజ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కుల సంఘం నాయకులు పేర్కొన్నారు. అర్హులైన నాయకులను ప్రభుత్వం ఎంపిక చేయడం అభినందనీయం అని, కార్పొరేషన్ ద్వారా కుల అభివృద్ధికి నియమితులైన కమిటీ కట్టుబడి పనిచేయాలని ప్రభుత్వ సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
తమ నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ, 2026 ఏప్రిల్ 7న తెలంగాణ రాష్ట్ర పెరికకుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు (డి.వి), వైస్ చైర్మన్ బుడిగం శ్రీనివాస్, రాష్ట్ర పెరికకుల సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కుల సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం
మంత్రులను కలవడానికి ముందు పెరిక విద్యార్థి వసతి గృహంలో అధ్యక్షుడు ఘటిక విజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు మద్దా లింగయ్య, వసతి గృహ అధ్యక్షులు డా. దొంగరి వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్, మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్, దాసరి మల్లేశం, ఇతర కుల బంధువుల సమక్షంలో నూతనంగా నియమితులైన చైర్మన్, వైస్ చైర్మన్లకు ఘన సన్మానం నిర్వహించారు.
మంత్రులు, ముఖ్య నాయకులతో భేటీ
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లను మర్యాదపూర్వకంగా కలిసి, పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్–వైస్ చైర్మన్ పదవులను కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
పెరిక కులం బలమైన సామాజిక వర్గం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లాలో పెరిక కుల సామాజిక వర్గం ఎంతో బలంగా ఉన్నదని పేర్కొన్నారు. దొంగరి వెంకటేశ్వర్లు వంటి నిస్వార్థ నాయకులు మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ పార్టీకి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు.
పెరికకుల కార్పొరేషన్ చైర్మన్‌గా దొంగరి వెంకటేశ్వర్లు (డి.వి) ఎంపిక కావడం ఆనందదాయకమని తెలిపారు. అలాగే భద్రాచలం పీసీసీ సభ్యులు బుడిగం శ్రీనివాస్ గారిని వైస్ చైర్మన్‌గా నియమించడం పట్ల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిద్దరిని మంత్రి సన్మానించారు.
పార్టీ సేవలకు గుర్తింపు – వేం నరేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించినo నాయకులకు పెరిక కుల కార్పొరేషన్లో పదవులు కల్పించడం వారి సేవలకు గుర్తింపని తెలిపారు. వారి నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.కోకాపేటలో నిర్మాణంలో ఉన్న పెరికకుల ఆత్మగౌరవ భవనం పనులను అభినందిస్తూ, కుల సంఘ అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని విధాలుగా ప్రభుత్వం, పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
వీరి నాయకత్వంలో పెరిక కుల అభివృద్ధి – మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
పెరిక సమాజానికి ప్రత్యేక గుర్తింపు, అవకాశాలు కల్పించేందుకు ఈ కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. చైర్మన్‌గా దొంగరి వెంకటేశ్వర్లు (డి.వి), వైస్ చైర్మన్‌గా బుడిగం శ్రీనివాస్‌ల నియామకం సముచిత నిర్ణయమని, వారి నాయకత్వంలో పెరిక సమాజం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
త్వరలో భారీ బహిరంగ సభ
త్వరలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పెరిక సంఘీయులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ తెలిపారు. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించే ప్రణాళిక ఉందని వెల్లడించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, వైస్ చైర్మన్ బుడిగం శ్రీనివాస్ గారు,తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఘటిక విజయ్ కుమార్ గారు, గౌరవ అధ్యక్షులు మద్ద లింగయ్య గారు, మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం గారు,మాజీ జడ్పీ చైర్మన్ చుంచు ఉసన్న గారు, పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షులు దొంగరి వెంకటేశ్వర్లు గారు,కోకాపేట భవన నిర్మాణ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు, రాష్ట్ర సంఘం కోశాధికారి సందేల లింగం గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు గారు, హాస్టల్ జనరల్ సెక్రెటరీ అచ్చా రఘు కుమార్ గారు, హాస్టల్ కోశాధికారి బాల్డురి రవి గారు, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్ గారు,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బొలిశెట్టి సతీష్ గారు, ఎల్బీనగర్ జోన్ గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి నరసింహ రావు గారు, ఎల్బీనగర్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎర్రంశెట్టి రవీందర్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు గారు,
గౌరవ అధ్యక్షులు బోలిశెట్టి జానకిరాముడు గారు, మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షులు చింతం రాజేశ్వర్ గారు, న్యాయవాదుల కోఆర్డినేటర్ అల్లం నాగరాజు గారు, మరియు జూకూరి మహేష్ గారు, అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ల విభాగం అధ్యక్షులు వడ్డానం వాసు గారు, యువ నాయకులు దొంగరి శ్రీరామ్ గారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే పెఱిక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన గౌరవనీయులు శ్రీ దొంగరి వెంకటేశ్వర్లు (డి.వి) గారికి 2026 మే 9న హుజుర్నగర్ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో సూర్యాపేట జిల్లా పెఱిక కుల సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, కనీవినీ ఎరుగని రీతిలో సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది.
పెఱిక కుల సమాజ అభ్యున్నతి కోసం ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా సేవలందిస్తూ, అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకుడిగా పేరు పొందిన దొంగరి వెంకటేశ్వర్లు గారికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యత అప్పగించడం పట్ల పెఱిక కుల బంధువుల్లో అపార ఆనందం వ్యక్తమైంది. సభా ప్రాంగణం మొత్తం హర్షధ్వానాలు, అభినందనలు,బాణాసంచా కాల్పుల మోతలతో, శుభాకాంక్షలతో మార్మోగిపోయింది.
ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా పెఱిక కుల సంఘం జిల్లా అధ్యక్షులు బందు శ్రీధర్ బాబు గారు, గౌరవ అధ్యక్షులు రామినేని సత్యనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి పాయిలి వెంకటనారాయణ గార్లు వారి కార్యవర్గం, జిల్లా సలహాదారులు మిన్నా శివరామకృష్ణ గారు, పాయిలి కోటేశ్వరరావు గారు, మర్త కృష్ణమూర్తి గారు, కోదాడ హాస్టల్ అధ్యక్షులు హాసనబాధ రాజేష్ గారు వారి కార్యవర్గం పాల్గొన్నారు.
సూర్యాపేట, కోదాడ, హుజుర్నగర్ పట్టణ కుల బంధువులతో పాటు ఇతర ప్రాంతాల కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోకపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో కార్యక్రమం మరింత రక్తి కట్టింది.
అలాగే జిల్లా లోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి హుజుర్నగర్ నియోజకవర్గాల నుండి ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు, యువత, మహిళలు, పెఱిక కుల సోదర సోదరీమణులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హాజరైన నాయకులు, కుల బంధువులు మాట్లాడుతూ దొంగరి వెంకటేశ్వర్లు గారి సేవా భావం, అంకితభావం, సరళ స్వభావం కారణంగానే ఈ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.
సన్మాన కార్యక్రమం అధ్యంతం ఎంతో ఆత్మీయంగా, ఉత్సాహభరిత వాతావరణంలో అద్భుతంగా జరిగి, పెఱిక సమాజ ఐక్యతను, అభిమానాన్ని ప్రతిబింబించింది. 💐
పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం అయిన పిసిసి సభ్యుడు దొంగరి వెంకటేశ్వర్లు గారిని కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి గారు అభినందించారు. 2026 మే9న కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నాయకుుల, పెరిక కుల పెద్దల సమక్షంలో డివిని సన్మానించారు. కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షుడు హస్నాబాద రాజేశ్ తో పాటు పలువురు పెరిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని 2026 మే 9న మర్యాదపూర్వకంగా కలిసిన మన పెరిక కుల కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గారు.
పెరిక కుల కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవికి నియమితులైన సందర్భంగా మంత్రి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే భవిష్యత్తులో పెరిక సమాజ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తనకు సహకారం అందించాలని మంత్రి గారిని కోరారు.
2026 మే 14న హైదరాబాద్‌లోని బీసీ కార్పొరేషన్ భవనంలో పెరిక కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు (డి.వి), వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం హాజరైన పెరిక కుల బంధువులు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెరిక కుల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి పెరిక సమాజానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, పిసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం పెరిక కుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.
ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పెరిక సమాజ అభివృద్ధి, యువత ఉపాధి, విద్య, సంక్షేమ కార్యక్రమాల అమలులో కార్పొరేషన్‌ను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెరిక కుల బంధువులు, నాయకులు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజ ఐక్యతతో ముందుకు సాగితే మరిన్ని అభివృద్ధి అవకాశాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ఘన సత్కారం
ఈ సందర్భంగా హాజరైన పెరిక కుల బంధువులు, నాయకులు, కార్యకర్తలు ఇరువురు నాయకులను శాలువాలతో సత్కరించి, పూల బోకేలు అందజేసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర పెరిక సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ సహకారం ఉంటుంది - మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు (డి.వి) గారు, వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గారు రాష్ట్ర సంఘం అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ గారు, కుల బంధువులతో కలిసి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఇరువురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెరిక కుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బాల మాయాదేవిని చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గారు ఆమె ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఇరువురికి అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో మంచి సేవలు అందించాలని కోరారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి పదవీకాలం పెరిక సమాజానికి మరింత ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు- రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అత్యంత ప్రతిభావంతమైన నాయకులకు చైర్మన్, చైర్మన్ పదవులను అందజేసిందని ఈ పెరిక కార్పొరేషన్ కు నిధులు కూడా మంజూరు చేసి కుల అభివృద్ధికి పాటుపడేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య, మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, కోశాధికారి సందెల లింగం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు, పెరిక విద్యార్థి వసతి గృహ అధ్యక్షులు డా. దొంగరి వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు సుందరి వీరభాస్కర్, కో-చైర్మన్ చుంచు ఉషన్న, కోపరేటివ్ సొసైటీ అధ్యక్షులు అందె శ్రీనివాస్ రావు, పెరిక కుల సంక్షేమ సమితి అధ్యక్షులు బత్తిని పరమేష్, వసతి గృహ కోశాధికారి బాల్దూరి రవి కుమార్, నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్, పెరికకుల వివాహ వేదిక కన్వీనర్ గోపతి కేశవ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డా. బోలిశెట్టి సతీష్, గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బందు శ్రీధర్ బాబు, కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షులు హసనాభాధ రాజేష్, ఎల్బి నగర్ గౌరవ అధ్యక్షులు దొంగరి నర్సింహారావు, ఎల్బి నగర్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రంశెట్టి రవీందర్, మల్కాజ్గిరి అధ్యక్షులు దిడ్డి రాజు తదితరులు వారి కార్యవర్గాలతో కలిసి పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా నియమితులైన దొంగరి వెంకటేశ్వర్లు గారు, బుడగం శ్రీనివాస్ గారు 2026 మే 25న ముఖ్యమంంత్రి రేవంత్ రెడ్డి గారిని సెక్రటేరియట్ లో కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు వారు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెేస్ పార్టీ అభివృద్ధికి, కుల సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి సూచించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రిీనివాసరెడ్డి, డిజిపి సివి ఆనంద్ లను వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్ గారు మర్యాద పూర్వకంగా కలిశారు.