తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
గౌరవ అధ్యక్షుడు
అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
కోశాధికారి
అధ్యక్షురాలు, మహిళా విభాగం
ప్రధాన కార్యదర్శి
గౌరవ అధ్యక్షురాలు
గౌరవ అధ్యక్షురాలు
కోశాధికారి
అధ్యక్షులు, యువజన విభాగం
ప్రధాన కార్యదర్శి, యువజన విభాగం
కోశాధికారి, యువజన విభాగం
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెరిక సంఘం సమావేశం 2026 జనవరి 3న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశం. నూతన కమిటీ ఎన్నికలు- నూతన కమిటీ ఎన్నికలు
ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక. కొత్త కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశం 2026 జనవరి 3 న సీనియర్ నాయకులు, ఆర్టీసీ మాజీ చైర్మన్ పోకల మనోహర్ గారి అధ్యక్షతన అచ్చంపేటలోని పెరిక భవన్లో జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి.
అధ్యక్షుడిగా అంగిరేకుల బిక్షపతి, గౌరవ అధ్యక్షులుగా పోకల మనోహర్, వనపర్తి శేఖరయ్య, ప్రధాన కార్యదర్శిగా పోకల శ్రీధర్, కోశాధికారిగా నల్లపు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
యువజన విభాగం అధ్యక్షుడిగా అంగిరేకుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా పిన్నెల్లి అభినవ్ వర్మ, కోశాధికారిగా బెక్కం వెంకటేష్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అంగిరేకుల రమాదేవి, గౌరవ అధ్యక్షులుగా పోకల శోభారాణి, పోకల విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా అచ్చ నీరజ, కోశాధికారిగా అంగిరేకుల రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులతో రాష్ట్ర సంఘం అధ్యక్షులు గటిక విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మద్దాలింగయ్య, పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, పెరికకుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, పెరిక విద్యార్థి వసతి గృహం కోశాధికారి బాల్దూరి రవికుమార్, పెరిక సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి వలిశెట్టి లక్ష్మీ శేఖర్, అచ్చంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ లావణ్య వెంకటేష్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాజీ అధ్యక్షులు నల్లపూ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాల్దురీ శ్రీనివాస్, మాజీ కోశాధికారి పోకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ నాయకులు పోకల రాజమోహన్, వనపర్తి శేఖరయ్య, పోకల రమేష్ గార్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
పెరిక కులానికి అచ్చంపేట బడి లాంటిది : గటిక విజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర పెరిక కులానికి అచ్చంపేట పెరిక కులస్తులు ఆదర్శమని, అచ్చంపేట పెరిక కులానికి బడి లాంటిదని పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అన్నారు. అచ్చంపేటలో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అచ్చంపేటలోని పెరిక కులస్తులు ఎవరికి వారుగా వ్యాపార, ఉద్యోగ, విద్యా, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగారని ప్రశంసించారు. పెరిక కులస్తులంతా ఐక్యంగా ఉండి భవనం నిర్మించుకున్నారని, గుడులు కట్టారని, బడులను బాగు చేసుకుంటున్నారని ఇది ఎంతో ఆదర్శనీయమన్నారు.
రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య మాట్లాడుతూ అచ్చంపేటలో పెరిక కులస్తులు చేస్తున్న కార్యక్రమాలు చాలా ప్రశంసనీయమన్నారు. పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ ప్రాంతంలో త్వరలోనే బాలికల హాస్టల్ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ మాట్లాడుతూ పెరిక కులస్తులు ఐక్యంగా నిలిచి నిర్మించుకుంటున్న భవనానికి విరివిగా విరాళాలు అందివ్వాలని కోరారు.
అచ్చంపేట కు చెందిన ప్రముఖ విద్యావేత్త, సంఘ సేవకులు శ్రీ సాదే రాజు చేస్తున్న కృషి అభినందనీయం. పంచాయతీ రాజ్ శాఖలో గ్రూప్ 2 ఉద్యోగం వస్తే, కొంతకాలం పనిచేసి రాజీనామా చేసిన రాజు హైదరాబాద్ లో సివిల్స్, గ్రూప్స్ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ లో కూడా ఉన్నారు. ఉన్న ఊరికి, పుట్టిన కులానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ఉట్ల కోనేరును పునరుద్ధరించారు. దీని కోసం దాదాపు 15 లక్షల రూపాయలు వెచ్చించారు. గ్రామంలోని పాఠశాలలో 10 లక్షల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించారు. పెరిక భవన్ లో 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి మౌలిక వసతులు, ఫర్మిచర్ ఏర్పాటు చేశారు. ఇంకా గ్రామంలో లైబ్రరీ నెలకొల్పడానికి, విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రాజు గారిని పెరిక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. అచ్చంపేట లో దేవాలయ పునరుద్ధరణకు, స్కూల్ అభివృద్ధికి, పెరిక భవన్ లో మౌలిక వసతులు కల్పించేందుకు దాదాపు 35 లక్షల రూపాయలు వెచ్చించిన సాదె రాజు గారిని నాయకులు అభినందించారు.
అచ్చంపేట లో పెరిక కులస్తుల ఆధ్వర్యంలో నిర్మించిన బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర పెరిక సంఘం నాయకులు గటిక విజయ్ కుమార్, మద్ద లింగయ్య, డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, సుందరి వీరభాస్కర్, సుంకరి ఆనంద్, దొంగరి మనోహర్, బాల్దూరి రవికుమార్, వలిశెట్టి లక్ష్మీ శేఖర్. రాష్ట్ర నాయకులకు ఘనంగా స్వాగతం పలికిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు పోకల మనోహర్ గారి నేతృత్వంలోని పెరిక సంఘం.
అచ్చంపేటలోని పెరిక భవన్లో పతాకావిష్కరణ చేసిన రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్. పాల్గొన్న రాష్ట్ర నాయకులు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు.
అచ్చంపేటకు చెందిన శ్రీ నల్లపు శ్రీనివాస్ గారు పూనుకుని శ్రీ శివాంజనేయ స్వామి దేవస్థానాన్ని తన సొంత ఖర్చులతో పునరుద్ధరించారు.