తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లా పెరిక సంఘం ఎన్నికలు ఏకగ్రీవం.
కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర సంఘం జిల్లా కోఆర్డినేటర్, భవన నిర్మాణ కమిటీ కో- చైర్మన్ చుంచు ఉషన్న, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్, వసతిగృహం కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయ్ కుమార్.
గౌరవ అధ్యక్షులుగా ముత్యం రాజయ్య
నూతన జిల్లా అధ్యక్షులుగా బండి శ్రీనివాస్
నూతన జిల్లా ప్రధాన కార్యదర్శిగా బుద్దె విజయ్ కుమార్
తెలంగాణా రాష్ట్ర పెరిక కుల సంఘము (రి. నెం 766/2014)ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు ముత్యం రాజయ్య గారి అధ్యక్షతన
కోనేరుకొనప్ప సత్రంలో
ది23/11/2025ఆదివారం ఘనంగా జరిగింది.
ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల నుండి దాదాపుగా మూడు వందల మంది పెరిక బంధువులు హాజరయ్యారు.
ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా నూతన అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది
ఈ సర్వ సభ్య సమావేశానికి జిల్లా కో ఆర్డినేటర్ మరియు కోకపేట ఆత్మగౌరవ భవనం వైస్ చైర్మన్ చుంచు ఊషన్న, రాష్ట్ర పెరిక కుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయకుమార్, రాష్ట్ర సంఘం ఆర్థిక కార్యదర్శి సందెల లింగం, విద్యార్ధి వసతి గృహము కార్యనిర్వాహక కార్యదర్శి అంకతి విజయకుమార్ గారు హాజరైనారు
కాలపరిమితి ముగిసిన జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేసి నూతన జిల్లా అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది.
నూతన అధ్యక్షులుగా కాగజ్ నగర్ వాస్తవ్యులు బండి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తిర్యాణి మండలం నుండి బుద్దె విజయకుమార్, గౌరవ అధ్యక్షులు ముత్యం రాజయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది
ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు చుంచు శ్రీనివాస్ గారు అన్ని విధాలుగా సహాయ సహాకారాలు అందించారు
ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా నుండి పెరిక సంఘము నాయకులు సింగతి మురళి, కారుకూరి చంద్రమౌళి, మొటపలుకుల తిరుపతి, బొడ్డు శంకర్, చల్ల విశ్వం మరియు వడ్డె రాజమౌళి గార్లు హాజరైనారు.
నూతన అధ్యక్షులను జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన పెరిక కుల బంధువులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేసారు
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినందుకు నూతన అధ్యక్షులకు, సహకరించిన జిల్లా కుల బంధువులకు మరియు నిర్వహించిన రాష్ట్ర నాయకులకు రాష్ట్ర సంఘం అధ్యక్షులు గటిక విజయకుమార్, గౌరవ అధ్యక్షులు మద్దా లింగన్న, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ మరియు కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియచేసారు.