తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
గజవెల్లి సత్యనారాయణ
అధ్యక్షుడు
పెరిక కులం అని గర్వంగా చెప్పుకుందాం, అన్ని రంగాల్లో మనం ఎదుగుతున్నాం.
పేదరికం లేని పెరిక కుల నిర్మాణం కోసం కృషి చేద్దాం.
అగ్రవర్ణాల అడ్డాలో పెరిక కుల జెండా ఎగురవేసినం.
రాజ్యాధికార పోరాటంలో కులం అడ్డంకి కాదు,నాయకత్వ లక్షణాలు అలవార్చుకోవాలి
ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో విజయం సాధించిన కుల బంధువులకు ఘనంగా సన్మానం.
మనది పెరిక కులం అని అందరూ సగర్వంగా చెప్పుకుందామని, మనం అన్ని రంగాలలో ఎదుగుతున్నామని, ఖమ్మం జిల్లా కేంద్రంలో అగ్రవర్ణాల అడ్డాలో మన పెరిక కుల బిడ్డలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో గెలిచి పెరిక కులానికి ఎనలేని తెచ్చిపెట్టారని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ది. 23.12.25 న ఖమ్మం జిల్లా కేంద్రంలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గజవెల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విశిష్ట అతిధులుగా కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు. పెరిక కుల కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు అందే శ్రీనివాస్ రావు,రాష్ట్ర పెరిక కుల సంఘం అసోసియేట్ ప్రసిడెంట్ సుంకరి ఆనంద్,తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రచార కార్యదర్శి బంధు శ్రీధర్ బాబు,పెరిక వసతి గృహ ఆర్ధిక కార్యదర్శి బాల్దూరి రవి కుమార్,కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షులు డాక్టర్ హసానభాధ రాజేష్, రాష్ట్ర నాయకులు బొలిశెట్టి నరసింహ రావు, STU సంఘం ప్రసిడెంట్ బుద్దె వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
పేదరికం లేని పెరిక సమాజం కోసం కృషి.
-అధ్యక్షులు గటిక విజయ్ కుమార్
పేదరికం లేని పెరిక కులం నిర్మాణం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు, పెరిక సమాజ అభివృద్ధి కోసం అన్ని రంగాలలలో ఉన్న ప్రముఖులతో ఇప్పటి వరకు 31 అనుబంధ కమిటీలు వేసామని తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బత్తిని నరసింహారావు గారికి, సంయుక్త కార్యదర్శి బాధ రవి గారికి, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాలుగో సారి ఘన విజయం సాధించిన బందు సూర్యం గారికి, కార్యనిర్వాక సభ్యులు మల్లెల అప్పారావు, సాదే శంకర్, జుట్టుకొండ చైతన్య, యమ్మని ఉపేందర్ గార్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి రాష్ట్ర సంఘం తరఫున ఘన సన్మానం చేశారు. గెలిచి మంచి అవకాశం లభించిందని దీని ద్వారా సేవ చేసి, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. రాష్టంలో అల్పసంఖ్యక అగ్రవర్ణాలు రాజ్యమేళుతున్నారని సంఖ్యపారంగా అగ్రస్థానం వున్న బీసీ లు అణచివేతకు గురువుతున్నామని, రాజ్యాధికార పోరాటంలో వెనుకబడిన అన్ని వర్గాలను సమన్వయ పరుస్తూ నాయకత్వ లక్షణాలు అలవార్చుకోవాలని పిలుపునిచ్చారు, తెలంగాణ రాష్టంలో బీసీ కులాల జాబితాలో పెరిక కులం 9 వ కులం రికార్డు ఐయ్యిందని,పెరిక సంఘీయులు అందరూ తమ కులం పెరిక అని చెప్పుకోవడానికి నామోషీ గా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు, ఇక నుండి ఐయినా పెరిక అని మాత్రమే చెప్పుకోవాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణన లొ కొందరు క్షత్రియ అని కొందరు బలిజ అని కొందరు వర్మ అని చెప్పడం తొ పెరిక జనాభ లెక్కలు తక్కువ గా చూపిస్తున్నారు కాబట్టి ఇకనుండి పెరిక అని మాత్రమే పెట్టుకోవాలని గటిక విజయ్ కుమార్ అన్నారు.
మన కుల భవిష్యత్తు నిర్మాణం కోకాపేట భవనం.
కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో మన కుల బంధువులు ఘన విజయం సాధించడం అభినందనీయం, పెరిక కులస్థులు సామాజికం గా ఆర్ధికం గా ఎదుగుతూ రాజ్యాధికారం సాధించాలని ఖమ్మం జిల్లాలొ పెరిక జాతి ప్రతిష్ట పెంపోందించడానికి అన్ని కులాల తొ సమన్వయం తొ ముందుకెళ్లాలని కోరారు,కోకాపేట ఆత్మగౌరవ భవన నిర్మాణం లొ ప్రతి పెరిక బిడ్డ తమ వంతుబాధ్యత గా ఆర్ధిక సహాయం అందించాలని కోరారు.
సంవత్సర కాలంలో బాలికల వసతి గృహం
పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఖైరతాబాద్ వసతిగృహాన్ని అత్యాధునికంగా ఆధునికరించామని పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని, బాలికల వసతి గృహం కోసం శంకుస్థాపన జరిగిందని, సంవత్సరకాలంలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
పెరిక కుల బ్యాంకు ఏర్పాటుకు బాటలు
పెరిక కుల కో-ఆపరేటివ్ సంస్థ అధ్యక్షులు అందే శ్రీనివాసరావు, రాష్ట్ర పెరిక కుల సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ మాట్లాడుతూ గెలిచిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపి పెరిక కుల కో-ఆపరేటివ్ సొసైటీ 1300 పై చిలుకు సభ్యులతో విజయవంతంగా నడుస్తున్నదని, జిల్లా నుండి మరింత మంది సొసైటీ సభ్యులు కావాలని ఆశిస్తున్నామని, త్వరలో పెరికకుల బ్యాంక్ ఏర్పాటుకు బాటలు పడుతున్నాయని తెలిపారు.
గర్వంగా ఉంది.
కోదాడ హాస్టల్ అధ్యక్షులు హాసనాబాద రాజేష్ మాట్లాడుతూ 19 శాఖలతో కూడిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలలో ప్రధానమైన రెండు పదవులు మన కుల బంధువులు గెలుచుకోవడం, బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నాలుగవసారి బందు సూర్యం గారు గెలవడం గర్వంగా ఉందన్నారు.
ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్, వసతి గృహం ఆర్థిక కార్యదర్శి బల్దూరి రవి, రాష్ట్ర సంఘం నాయకులు బొలిశెట్టి నరసింహారావు, బుద్దె ద్ధి వెంకటేశ్వర్లు గార్లు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలలో మన కులం పేరును ఆకాశానికి ఎత్తిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఘన సన్మానం
హాజరైన రాష్ట్ర సంఘం నాయకులు, రాష్ట్ర సంఘం నాయకుల సమక్షంలో ఖమ్మం జిల్లా కుల బంధువులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు బత్తిని నరసింహారావు, బాదే రవి,బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బందు సూర్యం, కార్యనిర్వాహక సభ్యులుగా గెలిచిన మల్లెల అప్పారావు,సాదే శంకర్, జుట్టుకొండ చైతన్య,యమ్మని ఉపేందర్ లకు ఘన సన్మానం చేశారు.
గజవెల్లి సత్యనారాయణ గారికి అభినందనలు
చక్కని కార్యక్రమం నిర్వహించిన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజవెల్లి సత్యనారాయణ గారిని రాష్ట్ర సంఘం అభినందించి, శాలువతో సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని బాలు వీరా రావు, కీత వేణు, ముత్తినేని రత్నాకర్ గార్లు సమన్వయం చేసి విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల్తూ శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ గజ్జెల వెంకన్న -లక్ష్మి ఖమ్మం జిల్లా అసోసియేట్ ప్రసిడెంట్ ముత్తినేని రత్నాకర్, పత్తిపాక రమేష్,ఖమ్మం జిల్లా పెరిక కుల సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు పత్తిపాక లత, ఖమ్మం జిల్లా కుల బంధువులు పాల్గొన్నారు.