తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
భూపాలపల్లి జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా సూరం రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక
కుల బంధువుల విరాళాలతో కోకాపేటలో భవన నిర్మాణం,
విద్యార్థులకు పూర్తి సౌకర్యాలు ఇస్తూ, పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న హాస్టల్ కమిటీ,
కుల అభిమానం ఉన్న 20మంది కోటి రూపాయల నిధితో ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందిస్తున్న పెరిక కుల సంక్షేమ సమితి.
సొసైటీ సభ్యులకు తక్కువ వడ్డీలకు రుణాలు అందిస్తూ కుల బంధువులను ఆదుకుంటున్న పెరిక కుల కోఆపరేటివ్ సొసైటీ
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు.
- గటిక విజయ్ కుమార్.
భూపాలపల్లి జిల్లా పెరిక కుల సర్వసభ్య సమావేశం మరియు జిల్లా కమిటీ ఎన్నికలు 28-11-2025 శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎన్నికల్లో సూరం రవీందర్ గారు ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గటిక విజయ్ కుమార్, విశిష్ట అతిథులుగా కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్, రాజకీయ వ్యవహారాల కోఆర్డినేటర్ చింతం సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి కారుకూరి నారాయణ, గౌరవ అధ్యక్షులు రామినేని రవీందర్, కోశాధికారి ముద్దసాని కిరణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నాండ్రె కుమార స్వామి (కిరణ్), పట్టణ అధ్యక్షులు చుంచు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గోళ్ళ రాజు, రాష్ట్ర నాయకులు గోవిందుల శ్యామ్, కానిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన అతిథి డాక్టర్ గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పెరిక బిడ్డకూ ఆత్మన్యూనత భావం ఉండకూడదు. బీసీ జనాభా ప్రాతిపదికన పెరిక కులం తొమ్మిదవ అతి పెద్ద కులం. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోకాపేటలో పెరిక ఆత్మగౌరవ భవన నిర్మాణం, పెరిక విద్యార్థుల కోసం వసతిగృహాల ఏర్పాటు, పెరిక సంక్షేమ సమితి సేవలు, పరస్పర సహాయ సహకార పరపతి సంఘం, వివాహ పరిచయ వేదిక వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అన్నారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు ఇలా అన్ని రంగాల్లో ఉన్న ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తెచ్చి సుమారు 35 విభాగాల కోఆర్డినేటర్లను నియమించామని తెలిపారు.
పెరిక కుల పునర్నిర్మాణం, అభివృద్ధి, స్వాభిమాన భవిష్యత్తు ఇవన్నీ మనందరి సమిష్టి కృషితో సాధ్యమవుతాయి. ప్రతి పెరిక యువకుడు, ప్రతి పెరిక కుటుంబం ఈ పునర్నిర్మాణ యజ్ఞంలో భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమం అనంతరం రాష్ట్ర సంఘం నాయకులను భూపాలపల్లి జిల్లా సంఘీయులు సన్మానం చేశారు.