తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
గౌరవ అధ్యక్షుడు
అసోసియేట్ అధ్యక్షుడు
యువజన విభాగం అధ్యక్షుడు
ప్రభుత్వం వివిధ కులాలకు కేటాయించిన స్థలాల్లో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించుకునేందుకు అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా విడుదలయ్యే నిధులను కులాల వారీగా విభజించి జనాభా ప్రాతిపదికన ఖర్చు చేయాలని కోరారు.
2026 ఫిబ్రవరి 22న నిర్మల్ జిల్లా పెరిక సంఘం సమావేశం జిల్లా అధ్యక్షుడు చుంచు భూమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, కోశాధికారి సందేల లింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకుడు శ్రీధర్ల జగదీష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తోట లచ్చన్న సమావేశ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పెరిక సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
జిల్లా అధ్యక్షుడిగా ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా చుంచు భూమయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా సంగం వెంకట రాజు, యువజన విభాగం అధ్యక్షుడిగా బోగ కోటేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిర్మల్ జిల్లాలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన పెట్టం చంద్ర శేఖర్ (రంగ పెట్), సంగం వెంకట రాజు (కనకాపుర్), బొడకుంటి నరేష్ (పెరక పల్లి), పలువురు ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం జరిగింది.
1958 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు సాగునీరు అందిస్తున్న కడెం ప్రాజెక్టును రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఊశన్న, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోశాధికారి సందెల లింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, నిర్మల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చుంచు భూమన్న తదితరులు సందర్శించారు. నిర్మల్ జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులను జిల్లా నాయకులు కడెం ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్లారు. ప్రాజెక్టులోని మొత్తం 18 గేట్లను, ప్రాజెక్టు తూములను, కాల్వలను నాయకులు సందర్శించారు. ఎస్.ఆర్.ఎస్.పి. నుంచి అనుసంధానం అయ్యే సరస్వతి కాలువను తిలకించారు. కడెం ప్రాజెక్టు నుంచి గోదావరి నదికి నీరు వెల్లే మార్గాన్ని పరిశీలించారు.
నిజాం ప్రభుత్వంలోనే డిజైన్ చేసి, ఎత్తయిన కొండల మధ్య ఈ ప్రాజెక్టును నిర్మించారు. నిల్వ ఉన్న నీరు స్థానికంగా దాదాపు 600 ఎకరాలకు సాగునీరుగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో కడెం ప్రాజెక్టు ద్వారా చాలా పెద్ద మొత్తంలో నీరు గోదావరిలోకి చేరుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటగా నిండే ప్రాజెక్టుగా, గోదావరికి మొదట స్వాగతం చెప్పే ఉపనదిగా కడెం నిలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతమైన నిర్మల్ జిల్లాలో పెరిక కుల సంఘం అందరికీ ఆదర్శంగా నిలిచింది. కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవనం కోసం 5 లక్షల విరాళం ప్రకటించింది. ఇందులో మొదటి విడతగా కడెం మండల పెరిక సంఘం తరుఫున లక్షన్నర రూపాయలు వసూలు చేసింది. లక్షన్నర రూపాయల చెక్కును ఆదివారం కడెంలో జరిగిన జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గారు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారికి అందించారు. మిగతా మండలాల పెరిక సంఘం కమిటీలు కూడా త్వరలోనే కోకాపేట భవన నిర్మాణానికి విరాళం అందించనున్నట్లు ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, కోకాపేట భవన నిర్మాణ కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఊశన్న, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, కోశాధికారి సందెల లింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకుడు శ్రీధర్ల జగదీష్, నిర్మల్ జిల్లా గౌరవ అధ్యక్షులు చుంచు భూమన్న, అసోసియేట్ అధ్యక్షుడు సంగం వెంకటరాజు, యువజన విభాగం అధ్యక్షుడు భోగ కోటేశ్, రంగంపేట సర్పంచ్ పెట్టెం చంద్రశేఖర్, కనకాపూర్ సర్పంచ్ వెంకటరాజు, పెరకపల్లి సర్పంచ్ బోడకుంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కోకాపేట భవనానికి ఉదారంగా విరాళం అందించిన నిర్మల్ జిల్లా పెరిక సంఘం నాయకులను రాష్ట్ర సంఘం గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ అభినందించారు. హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల నిర్మల్ లో జరిగిన పెరిక కుల సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆ జిల్లా నుండి కోకాపేట ఆత్మగౌరవ భావనానికి ఐదు లక్షల రూపాయల విరాళం ఇస్తామని రాష్ట్ర సంఘం అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ వైస్ చైర్మన్ చుంచు ఉషన్న, రాష్ట్ర అసోసియేటర్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గార్లకు మాట ఇచ్చారు. అందులో కడెం మండలానికి చెందిన పెరిక బంధువులు ఇప్పటికే 1,80,000 అందించారు ఈరోజు ఖానాపూర్ మండలానికి చెందిన కుల బంధువులు 80 వేల రూపాయలను అందించారు.
30-03-2026 రోజున నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల పెరిక కుల బంధువులంతా ఏకమై హైదరాబాదులో నిర్మిస్తున్న కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం కొరకు 80,000 విరాళం అందించారు. మండలం లోని పలు గ్రామాల నుండి కుల సంఘం సోదరులు గ్రామాల వారిగా వారు జమ చేసిన రూపాయలు కింద తెలుపబడినది. అట్టి రూపాయలను ముక్కెర శ్రీనివాస్, నిర్మల్ జిల్లాఅధ్యక్షుల ఆధ్వర్యంలో ఖానాపూర్ మండల అధ్యక్షులు మోట పలుకుల రాజమౌళి, ఉపాధ్యక్షులు కట్ల రవి, గోడలపంపు రాష్ట్ర కమిటీ మెంబర్ పెట్టేం శేఖర్ ఆధ్వర్యంలో కోకాపేట్ భావన నిర్మాణo ఐసీఐసీఐ బ్యాంకు అకౌంట్ లో వేయడం జరిగింది.
గ్రామాల వారీగా వచ్చిన విరాళాలు
28.000 రంగంపేట
13.000 బీర్నంది
10.000. గోడల పంపు
10.000 మస్తాన్ ఎల్లపూర్
7.500 సింగపూర్
2.500 సత్తెనపల్లి
5.000 పెంభి
2.000. కొత్తపేట
1.000 గోసంపల్లి
1.000.
-----------------------
80.000. Total
------------------------
కోకాపేట పెరిక ఆత్మగౌరవ భవనానికి అన్నమాట ప్రకారం విరాళం అందిస్తున్న నిర్మల్ జిల్లా పెరిక సంఘం నాయకులకు రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, వారి కార్యవర్గం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
కోకాపేటలో నిర్మిస్తున్న పెరికకుల ఆత్మగౌరవ భవనం కోసం విరాళాల సేకరణలో అన్ని జిల్లాల కన్నా నిర్మల్ జిల్లా పెరిక సంఘం నాయకులు ఆదర్శవంతమైన పనితీరును ప్రదర్శిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల నాయకులు గ్రామ గ్రామాన తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. మండలాల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎక్కువ విరాళాలు అందించడానికి శ్రమ పడుతున్నారు.
నిర్మల్ జిల్లా నుండి మొత్తం ఐదు లక్షల రూపాయల విరాళం ఇస్తామని రాష్ట్ర నాయకత్వానికి హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే నాలుగు లక్షల 77 వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కడెం మండలానికి సంబంధించి 1,80,000 విరాళాలు సేకరించారు.
ఖానాపూర్ మండలం నుండి 77 5000 రూపాయలను సేకరించారు.
మామడ మండలం నుండి 25వేల రూపాయలు సేకరించారు.
లక్ష్మన చాంద మండలం పీసర గ్రామం నుండి 80 వేల రూపాయలు సేకరించారు.
సారంగాపూర్ మండలం నుండి 87 వేల రూపాయలను సేకరించారు.
నిర్మల్ రూరల్ మండలం నుండి 25000 సేకరించారు.
పెంబి మండలం నుండి 5000 రూపాయలు సేకరించారు.
మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుండి ఇప్పటివరకు ఆరు లక్షల 75 వేల రూపాయల కమిట్మెంట్ వచ్చిందని ఇంకా ఎక్కువ విరాళాలు సేకరించడానికి ప్రయత్నిస్తామని జిల్లా అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్ శనివారం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవాధ్యక్షులు మద్ద లింగయ్య, అసోసియేట్ అధ్యక్షులు సుంకర ఆనంద గార్లకు తెలియజేశారు.
నిర్మల్ జిల్లా పెరిక బంధువులు రాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా నిలిచేలా ఎంతో శ్రమపడి విరాళాలు సేకరిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం అభినందించింది.
ముక్కెర శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా ఆయా జిల్లాల్లో విరాళాల సేకరణకు పూనుకోవాలని రాష్ట్ర నాయకత్వం పిలుపు ఇచ్చింది.