తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
గౌరవ అధ్యక్షుడు
అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
కోశాధికారి
ప్రచార కార్యదర్శి
అసోసియేట్ అధ్యక్షుడు
మహిళా గౌరవ అధ్యక్షురాలు
మహిళా అధ్యక్షురాలు
మహిళా ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర పెరిక సంఘం నాయకుల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పెరిక కుల సంఘం ఎన్నిక ఏకగ్రీవం
నల్గొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడుగా ముత్తినేని శ్యాంసుందర్
ప్రధాన కార్యదర్శిగా కొనకంచి వీర రాఘవులు ఎన్నిక.
నల్గొండ జిల్లాలో సమగ్ర పెరిక కుల కుటుంబ సర్వే ప్రారంభం
రాష్ట్రంలోని ప్రతి పెరిక బిడ్డకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర సంఘం కార్యక్రమాలు ఉంటాయి
రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్.
ప్రభుత్వ గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం (రి. నెం. 766/2014 ) నాయకుల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా పెరిక కుల సంఘం ఎన్నికలు ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి.
జిల్లా అధ్యక్షుడిగా ముత్తినేని శ్యామ్ సుందర్. ప్రధాన కార్యదర్శిగా కొనకంచి వీరరాఘవులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా అన్ని పదవులను కూడా ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు ఘటిక విజయ్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా హాజరుకాగా నలగొండ జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్న దాసరి మల్లేశం గారు ఎన్నికలను నిర్వహించారు.
ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పెరిక సంఘం నాయకులు, అదే కార్యక్రమంలో పెరిక కుల సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ఫారాన్ని రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం నింపి రాష్ట్ర అధ్యక్షుడు ఘటిక విజయ్ కుమార్ కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెరిక కుల సంఘానికి బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వం వద్ద, రాజకీయ పక్షాల వద్ద గుర్తింపు గౌరవం తెచ్చేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం 31 అనుబంధ సంఘాల ద్వారా రాష్ట్రంలోని పెరిక కులం నాయకులందరినీ సమన్వయం చేసే పని జరుగుతున్నదని తెలిపారు.
పెరిక కులస్తులకు రాష్ట్రంలో ఉచిత వైద్యం ఉచిత న్యాయ సలహాలు అందించే కార్యక్రమం ప్రారంభం అయిందని మిగతా అన్ని కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం నల్గొండ జిల్లాలో త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.
కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెరిక కుల గౌరవాన్ని ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే కోకాపేట పెరిక భవన్ కు రాష్ట్రంలోని పెరిక కులస్తులందరూ తగిన సహాయ సహకారాలు అందించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో ప్రతి పెరిక బిడ్డా కోరుకునే విధంగా నిర్మాణం సమున్నతంగా జరుగుతున్నదని వీరభాస్కర్ తెలిపారు.
పెరిక విద్యార్థి వసతిగృహం అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హైదరాబాదులో బాలికల కోసం ప్రత్యేక హాస్టల్ పెట్టాలన్నది ప్రతి పెరిక కుల బిడ్డల కల అని, ఆ కల త్వరలో సాకారం కాబోతున్నదని తెలిపారు. ఎల్బీనగర్లో పెరిక కుల బాలికల హాస్టల్‌ను త్వరలోనే నిర్మించి ప్రారంభిస్తామని వెల్లడించారు.
పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి ఆనంద్ మాట్లాడుతూ పెరిక కుల పరపతి సంఘం చాలా గొప్పగా నడుస్తున్నదని కోటి 35 లక్షల రూపాయల మూల నిధితో, నాలుగు కోట్ల రూపాయల టర్నోవర్‌తో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే పరపతి సంఘం బ్యాంకుగా మారబోతున్నదని వెల్లడించారు.
సభకు అధ్యక్షత వహించిన నల్గొండ జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్ సుందర్ మాట్లాడుతూ గటిక విజయ్ కుమార్ అధ్యక్షుడిగా, మద్దా లింగయ్య గౌరవ అధ్యక్షుడుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం మిగతా అన్ని కుల సంఘాల కన్నా చాలా గొప్పగా పనిచేస్తున్నదని ఈ సంఘానికి అనుబంధంగా నల్లగొండ జిల్లా శాఖలో కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ పరపతి సంఘం అధ్యక్షుడు అందె శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు డాక్టర్ బొలిశెట్టి సతీష్, రాష్ట్ర నాయకులు బొలిశెట్టి నరసింహారావు, బుద్దె వెంకటేశ్వర్లు, రాష్ట్ర పెరిక సంఘం యువజన విభాగం గౌరవ అధ్యక్షులు చైతన్య మైలారిశెట్టి. నల్గొండ జిల్లా పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు వలిశెట్టి హరి, జిల్లా కోశాధికారి వలిశెట్టి పరశురాం, పట్టణ అధ్యక్షుడు నెమ్మని కాంతారావు, ప్రధాన కార్యదర్శి అశోక్, మైలార్శెట్టి సైదయ్య, ఉపేందర్, బొలిశెట్టి మల్లయ్య, మైనం కృష్ణయ్య.