ఘనంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వసభ్య సమావేశం.
భారీగా హాజరైన కుల బంధువులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులుగా సముద్రాల వెంకటేశ్వర్లు.
గౌరవాధ్యక్షులు నల్లపు రవీందర్ గారు.
ప్రధాన కార్యదర్శిగా చిట్టి మల్లేష్.
కోశాధికారిగా నాగేశ్వరరావు.
ఉపాధ్యక్షుడిగా పారపర్తి వెంకటేశ్వర్లు మరికొందరు.
కార్యవర్గం పూర్తిగా ఏకగ్రీవం.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు, అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు.
విశిష్ట అతిథులుగా హాజరైన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు. శ్రీధర్ బాబు గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి దొంగరి శంకర్ గారు, యువజన విభాగపు గౌరవ అధ్యక్షులు మైలార్శెట్టి చైతన్య గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గజవెల్లి సత్యనారాయణ గారు హాజరయ్యారు.
తెలంగాణా రాష్ట్ర పెరిక కుల సంఘం 766/2014 అనుబంధ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లా కోఆర్డినేటర్ గా ఉన్న బుడిగం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో , పిఎసిఎస్ సొసైటీ అధ్యక్షులు, రాష్ట్ర పెరిక సంఘం నాయకులు మండే వీర హనుమంతరావు గారి సహకారంతో కొత్తగూడెం జిల్లా సర్వసభ్య సమావేశం 2025 నవంబర్ 30న అత్యంత ఘనంగా, కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
అధ్యక్షులు గటిక విజయకుమార్, గౌరవ అధ్యక్షులు మద్ద లింగయ్య గార్లు మాట్లాడుతూ అట్టడుగున ఉన్న పెరికకుల బంధువులకు సహకారం అందించడానికి పూర్తి నిబద్ధతతో, కులం మీద ప్రేమ అభిమానంతో రాష్ట్ర సంఘం, వసతి గృహం, సంక్షేమ సమితి, కో-ఆపరేటివ్ సొసైటీ, పెరికకుల వివాహ వేదిక కార్యవర్గాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వాటికి జిల్లా కుల బంధువులు పూర్తి సహకారం అందించాలని, పనిచేస్తున్న కార్యవర్గానికి మీ మద్దతు ఉండాలని కోరారు.
ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యవర్గ సభ్యులు మొత్తం వారి వారి పనుల్లో క్షణం తీరిక లేకున్నా కులాభివృద్ధికి కంకణ బద్ధులమై సైనికుల్లా పనిచేస్తున్నామని అన్నారు.
కోకాపేట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు మాట్లాడుతూ కోకాపేటలో రెండు ఎకరాల స్థలం విలువ 300 కోట్లకు పైగా పెరిగిందని, మన కుల బంధువుల విరాళాల సహకారంతో అహర్నిశలు కష్టపడుతూ విరాళాలు సేకరిస్తూ నిర్మించుకుంటున్న విషయం మీకు తెలిసిందే అన్నారు. భవన నిర్మాణ విషయంతో సహా అన్ని కార్యక్రమాలకు మీ సహకారం తప్పనిసరి అని తెలిపారు.
జిల్లా కోఆర్డినేటర్, పి సి సి సభ్యులు బుడిగం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పనిచేసే తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘానికి మన మద్దతు ఇవ్వాలని అన్నారు.
రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు, కోపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి, సుంకరి ఆనంద్ గారు మాట్లాడుతూ కోఆపరేటివ్ సొసైటీ అత్యంత తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ సొసైటీ సభ్యులకు సహకారమందిస్తుందని తెలిపారు. సొసైటీ బ్యాంకు గా రూపాంతరం చెందే రోజులు త్వరలో వస్తున్నయని అన్నారు.
పిఎసిఎస్ సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు గారు మాట్లాడుతూ కులాభివృద్ధి కోసం కష్టించి పనిచేస్తున్న గటిక విజయ్ కుమార్ గారికి మనం సంపూర్ణ మద్దతు అందజేయాలని, కులం కోసం పని చేయకుండా, సంఘాన్ని చీల్చే ప్రయత్నం చేసేవారిని ప్రశ్నించాలని తెలిపారు.పాల్వంచ పట్టణ ప్రధాన కార్యదర్శి పారపర్తి వెంకటేశ్వర్లు గారు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున కుల బంధువులు హాజరయ్యారు.
2025 డిసెంబర్ 1
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు గారితో రాష్ట్ర సంఘం నాయకుల గౌరవ పూర్వక భేటీ.కుల సంఘ కార్యక్రమాలు అడిగి మరీ తెలుసున్న ఎం ఎల్ ఏ.రాష్ట్ర సంఘ నాయకులను సన్మానం చేసిన ఎం ఎల్ ఏ వెంకట్ రావు గారు
భద్రాచలం : పిసిసి సభ్యులు బుడిగం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘ అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్, అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, బందు శ్రీధర్ బాబు, దొంగరి శంకర్, మైలార్శెట్టి చైతన్య గార్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు గారితో భద్రాచలంలోని వారి క్యాంప్ ఆఫీసులో గౌరవపూర్వక భేటీ జరిగింది. ఎమ్మెల్యేతో రాష్ట్ర నాయకుల అల్పాహార విందు అనంతరం ఆయన మాట్లాడుతూ కుల సంఘానికి తప్పకుండా నా సహాయ సహకారాలు అందిస్తానని వారు హామీ ఇచ్చారు. కులాభివృద్ధి కోసం మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాష్ట్ర సంఘం నాయకులను వారు అభినందించి సన్మానించారు. రాష్ట్ర నాయకులు కూడా ఎమ్మెల్యే వెంకట్రావు గారిని శాలువాతో సన్మానించారు
2025 డిసెంబర్ 1
భద్రాచలంలో పెరిక సంఘం రాష్ట్ర నాయకుల ప్రత్యేక పూజలు🙏
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం నాయకులు భద్రాచలం పి సి సి సభ్యులు బుడిగం శ్రీనివాస్ గారి సహకారంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోకాపేటలో నిర్మాణం జరుగుతున్న ఆత్మగౌరవ భవన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా త్వరితగతిన పూర్తి కావాలని,
ఎల్బీ నగరంలో పెరిక లేడీస్ హాస్టల్ నిర్మాణం వేగంగా పూర్తవ్వాలని,
మన పరపతి సంఘం పెరిక బ్యాంక్ గా అవతరించే ప్రయత్నం విజయవంతం కావాలని,
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి పెరిక బంధువు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నాయకులు మనస్పూర్తిగా కోరుకున్నారు.
భక్తి – భవనం – కుల భవిష్యత్తు అనే త్రివేణి సాంగమంగా నిలిచిన ఈ పూజ కార్యక్రమం, మన పెరిక కుల ఐక్యతకు, మన ఆత్మగౌరవ ప్రయాణానికి మరొక బలమైన సంకేతం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు డా. ఘటిక విజయ్ కుమార్ గారు,
గౌరవాధ్యక్షుడు మద్దా లింగయ్య గారు,
కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్ గారు,
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్ గారు,
రాష్ట్ర ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు,
రాష్ట్ర అధికార ప్రతినిధి దొంగరి శంకర్ గారు,
రాష్ట్ర యువజన విభాగ గౌరవాధ్యక్షుడు మైలార్శెట్టి చైతన్య గారు పాల్గొన్నారు.