తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
అధ్యక్షుడు
గౌరవ అధ్యక్షుడు
ప్రధాన కార్యదర్శి
ఆర్గనైజింగ్ కార్యదర్శి
కోశాధికారి
ఉపాధ్యక్షుడు
కార్యదర్శి
కార్యదర్శి
మార్చి 1, 2026న చెంగిచెర్లలోని కమ్యూనిటీ హాల్ (మెరీడియన్ స్కూల్ సమీపంలో)లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు డా.గటిక విజయ్ కుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీరామ్ దయానంద్ గారు, దాసరి మల్లేశం గారు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సందేల లింగం గారు, అసోసియేట్ ప్రెసిడెంట్ సుంకరి ఆనంద్ గారు,రాష్ట్ర యువజనవిభాగం అధ్యక్షులు దాసరి.జయప్రకాష్ గారు,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డా.సతీష్ గారు
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు గారు,యాదాద్రి-భువనగిరి జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్ గారు ,మల్కాజ్ గిరి నియోజక వర్గ అధ్యక్షులు దిడ్డి.రాజు గారు మరియు వారి కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సోమసాని రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు
జిల్లా అధ్యక్షుడు: శ్రీ చింతం రాజేశ్వర్ గారు
ప్రధాన కార్యదర్శి: శ్రీ.చింతం గిరి వర్మ గారు
ఉపాధ్యక్షుడు:శ్రీ. కొమిరిశెట్టి శ్రవణ్ గారు
ఆర్గనైజింగ్ సెక్రటరీ: శ్రీ. సోమసాని రాజ్ కుమార్ గారు
కోశాధికారి: శ్రీ.మంచాల నవీన్ రాజ్ గారు
సెక్రటరీలు: అంకతి రాజమౌళి గారు, గోదాసు ఉమేష్ గారు
జిల్లా యువజన విభాగం అధ్యక్షులు: అంకతి రవి వర్మ గారు,ఇట్టి కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పెరిక కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.
పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర స్వభావాన్ని బట్టి చూస్తే గ్రామీణ జనాభా తగ్గుతూ, పట్టణ జనాభా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇదే విధంగా పెరిక కులస్తుల పట్టణ వలస శరవేగంగా జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ అన్నారు. 2026 మార్చి 1న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
‘‘తెలంగాణ రాష్ట్రం పట్టణాల్లో నివసిస్తుంది. ఇప్పటికే 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంది. హైదరాబాద్ లోనే కోటి 10 లక్షల మంది నివిసిస్తున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పెద్ద నగరాల్లో ఎక్కువ జనాభా ఉంది. భవిష్యత్తులో గ్రామాలు అంతరించి, పట్టణాలు పెరుగుతాయి. కుల వృత్తి చాలా కాలం క్రితమే కోల్పోయిన పెరిక కులస్తుల వలసలు అందరి కంటే ముందే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నగరానికి పెరిక కులస్తులు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం, చదువులు, ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇలా వలస వచ్చిన పెరిక కులస్తులు ఎక్కువగా ఉండేవారు. భవిష్యత్తులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో వలస వచ్చిన పెరిక కులస్తుల సంఖ్య బాగా పెరుగుతుంది’’ అని గటిక విజయ్ కుమార్ చెప్పారు.