తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
తెలంగాణ పెరికకుల సంఘం (766/2014) అనుబంధంగా ఉన్న ములుగు జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక సన్రైజర్స్ స్కూల్లో జరిగింది. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కీత విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు అల్లం రాజేష్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సూరం రవీందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రామినేని రాజేష్, గౌరవ అధ్యక్షుడు సోమిశెట్టి శ్రీనివాస్, పెరిక ధాత్రి ఎడిటర్ బరుపాటి సంపత్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ములుగు జిల్లా పెరిక కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా అక్కల రవి, గౌరవ అధ్యక్షునిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు గందె జగన్నాథం, గౌరవ సలహాదారులుగా బియ్యాల కుమారస్వామి, కోశాధికారిగా దిడ్డి మల్లయ్య, ఉపాధ్యక్షులుగా కొమిరిశెట్టి వెంకన్న, పత్తిపాక రాములు, దిడ్డి రాజు కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
సంఖ్యా పరంగా అధిక శాతం పెరిక జనాభా ఉన్న వాజేడు వెంకటాపురం, ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాల కుల సంఘ నాయకులకు ఇంకా ప్రాతినిధ్యం ఇస్తూ త్వరలోనే పూర్తిస్థాయి జిల్లా కమిటీని వేయాలని సమావేశంలో నిర్ణయించారు. ములుగు జిల్లా పరిధిలోని వివిధ మండలాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
ఆతిథ్యం ఇచ్చిన పాఠశాల యాజమాన్యం శ్రీ పెట్టెం రాజు గారికి ధన్యవాదాలు.
నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లా కమిటీ కి రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మద్దాలింగయ్య మరియు కార్యవర్గం హృదయపూర్వక అభినందనలు తెలిపింది