తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
వరంగల్ జిల్లాకు చెందిన పెరిక సంఘం నాయకులు 2025 డిసెంబర్ 5న హన్మకొండలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని కలిశారు. పెరిక సంఘం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలపై చర్చించారు. 2025 డిసెంబర్ 7న వరంగల్ ఎంకె నాయుడు కన్వెన్షన్ లో జరిగే జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. పెరిక కుల సంఘం అధికారిక వెబ్ సైట్ ప్రారంభించాలని కోరారు. దీనికి మంత్రి సురేఖ గారు సమ్మతించారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయకుమార్ , పెరిక ధాత్రి ఎడిటర్ బరుపటి సంపత్ కుమార్, పెరిక కుల నాయకులు అల్లం రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెరకకుల పెద్దలు వనపర్తి శ్రీనివాస్ , పెరిక కుల వరంగల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బెడద వీరన్న, ఎసిరెడ్డి ప్రభాకర్ , అంకతి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం (766/2014) అనుబంధ వరంగల్ జిల్లా కమిటీ సమావేశం ఈ నెల 7న వరంగల్లోని ఎంకె నాయుడు కన్వెన్షన్ లో జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యవరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో మంత్రి కొండా సురేఖ పెరిక కుల అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభిస్తారు. పెరిక కులస్తులు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను కూడా మంత్రి ప్రారంభిస్తారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్దా లింగయ్య, ముఖ్య సలహాదారుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య తదితరులు పాల్గొంటారు. ఈ సర్వసభ్య సమావేశంలో జిల్లా కొత్త కమిటీని కూడా ఎన్నుకుంటారు.
పెరిక కులస్తులను అభినందించిన సురేఖ
2025 డిసెంబర్ 7న వరంగల్ ఎంకె నాయుడు కన్వెన్షన్ లో జరిగే జిల్లా పెరిక సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రిని ఆహ్వానించారు. పెరిక కుల సంఘం అధికారిక వెబ్ సైట్ ప్రారంభించాలని కోరారు. దీనికి మంత్రి సురేఖ గారు సమ్మతించారు. తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయకుమార్ , పెరిక ధాత్రి ఎడిటర్ బరుపటి సంపత్ కుమార్, పెరిక కుల నాయకులు అల్లం రాజేష్ వర్మ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెరకకుల పెద్దలు వనపర్తి శ్రీనివాస్ , పెరిక కుల వరంగల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బెడద వీరన్న, ఎసిరెడ్డి ప్రభాకర్ , అంకతి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.