తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
పెరిక కులస్తులకు ఓ సంఘం ఉండాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిక కులస్తులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని, వారందరి సంక్షేమం కోసం పాటు పడాలనే లక్ష్యంతో 1970 దశకంలో చాలా మంది పెరిక పెద్దలు ఎంతో శ్రమించారు. వారందరినీ మన జాతి మరిచిపోకుండా గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో పెరిక యుగకర్తలను పరిచయం చేయాలని రాష్ట్ర సంఘం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు గజవెల్లి సత్యనారాయణ గారు పెరిక యుగకర్తల గురించిన వివరాలను అందించారు.
జాతీయ నాయకుడుగా ఎదిగిన ఏకైక పెరిక బిడ్డ
లోకసభ మాజీ డిప్యూటీ స్పీకర్
రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్
నెహ్రూతో కలిసి స్వతంత్ర్య ఉద్యమం
లోహియాతో కలిసి సోషలిస్టు ఉద్యమం
ఇందిరాగాంధితో కలిసి ప్రభుత్వ నిర్వహణ
పార్లమెంటు నుంచి సస్పెండైన తొలి ఎంపి
క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లిన చరిత్ర
గోడె మురహరి గారు సోషలిస్టు. పార్లమెంటేరియన్. స్వతంత్ర్య సమరయోధుడు. యావత్ పెరిక జాతి గర్వించదగిన గొప్ప నాయకుడు. సోషలిస్టు భావజాలం కలిగిన మురహరి బహుముఖ పాత్రలు నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్ లో క్రియాశీల సభ్యుడిగానే కాకుండా, ఏఐసిసి సభ్యుడిగా కూడా పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూ గారితో కలిసి స్వతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. 1948లో సోషలిస్టు వర్గం కాంగ్రెస్ నుండి వేరుపడే వరకు కాంగ్రేసులోని సోషలిష్టు వర్గానికి చెందినవాడు.
1943లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను జైలులో పెట్టింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే నేరాభియోగంతో బనారస్ జిల్లా నుండి రెండేళ్లు బహిష్కరించబడ్డాడు. 1946లో జవాహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడేవరకు ఈ బహిష్కరణ కొనసాగింది. స్వతంత్ర భారతంలో కూడా ఈయన సోషలిష్టు పార్టీ కార్యకలాపాలలో పాల్గొని మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు. సోషలిస్టు భావజాలంతో ప్రభావితుడై, రామ్ మనోహర్ లోహియా ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. 1957 నుండి 1958 వరకు అఖిల భారత సమాజ్‌వాదీ యువక్ సభకు కార్యదర్శిగా, 1957 నుండి 1958 వరకు అఖిలభారత సోషలిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, 1961 నుండి 1963 వరకు సోషలిస్టు పార్టీ కేంద్ర పార్లమెంటు బోర్డుకు కార్యదర్శిగా పనిచేశారు.
1962 లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నాటి నుంచి 1977 వరకు 13 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యడిగా కొనసాగారు. రాజ్యసభలో ఎక్కువగా ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు. ప్రాంతీయ అభివృద్ధి గురించి పరిశోధనాత్మక ఉపన్యాసాలు చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించి, రాజ్యసభను స్తంభింప చేయడానికి ప్రయత్నించడంతో సస్పెండ్ కూడా అయ్యారు. స్వతంత్ర్య భారతదేశంలో రాజ్యసభ నుంచి సస్సెండైన తొలి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు.
నాటి ప్రధాని ఇందిరాగాంధి ప్రత్యేకమైన చొరవతో మురహరి గారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చేశారు. నాడు రాజ్యసభ చైర్మన్ గా ఉప రాష్ట్రపతి బిడి జెట్టి ఉండేవారు. 1972 నుంచి 1977వరకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు. 1977లో విజయవాడ లోకసభ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అదే టర్మ్ లో లోకసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. నాడు స్పీకర్ గా నీలం సంజీవరెడ్డి, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధి ఉండేవారు.
గోడె మురహరి గారు 1926 మే 20న ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో జన్మించారు. ఆయన తండ్రి గోడె గంగరాజు గారు. 982 ఆగస్టు 5న న్యూఢిల్లీలో మురహరి గారు మరణించారు.
తులాబందుల నాగేశ్వరావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజా నేత, ప్రజాసేవను జీవిత ధ్యేయంగా స్వీకరించిన విశిష్ట నాయకుడు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామంలో జన్మించినారు.
1967 లో అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శాసనసభలో ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావించి, ప్రజాప్రతినిధిగా విశిష్ట గుర్తింపు పొందారు. రాష్ట్ర శాసనసభలొ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా ప్రభుత్వ ఖర్చుల పరిశీలన లొ కీలక పాత్ర పోషించారు.అధికార భాష సంఘ సభ్యుడిగా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారు. వెనకబడిన వర్గాల సంక్షేమ కోసం ఏర్పాటు అయిన కమిషన్ లో సేవలందించారు. దేశ రక్షణ తదితర ముఖ్యాంశాలపై ఆకాశవాణి ద్వారా ప్రజలకు అవగాహన కనిపించే ప్రసంగాలు చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారు అధ్యక్షులుగా ఉన్న ఆల్ ఇండియా పంచాయతీ రాజ్ స్టడీ టీమ్ లో సభ్యులుగా పాల్గొన్నారు. వెనకబడిన వర్గాల సంక్షేమ పరిశీలనార్థం ఏర్పాటు చేసిన కాలేల్కర్ కమిషన్ కార్యక్రమాలను అనుబంధంగా సేవలందించారు. మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయమునకు ధర్మకర్తగా ఆలయ అభివృద్ధికి కృషి చేసినారు. సమాజ సేవలొ విశేష కృషి చేసినందుకు సంఘమిత్ర అనే బిరుదు అందుకున్నారు. తులాబత్తుల నాగేశ్వరావు గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక చైతన్యవేత్త, పరిపాలన నిపుణుడు ఆధ్యాత్మిక సేవకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందినారు.
ఎంపిపి నుంచి ఎంపి వరకు 24 సంవత్సరాల పాటు ఏకధాటిగా వివిధ పదవులు నిర్వహించిన బోడకుంటి వెంకటేశ్వర్లు గారిది విశిష్ట రాజకీయ ప్రస్థానం. మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి. రామారావు, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గార్లతో కలిసి పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
వెంకటేశ్వర్లు గారు11.05.1956 న శ్రీమతి లక్ష్మమ్మ- సిద్దయ్య దంపతులకు జనగామ జిల్లా బచ్చన్నపేట గ్రామంలో ఏకైక సంతానంగా జన్మించారు. వారిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. చిన్ననాటి నుంచి క్రమశిక్షణ కృషి సేవా భావం అలవర్చుకున్నారు.
ప్రాథమిక విద్యను స్వగ్రామమైన బచ్చన్నపేటలో, ఇంటర్మీడియట్ జనగామలో పూర్తిచేసి అనంతరం ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ(ఎంపీసీ) అగ్రికల్చర్ పట్టా పొందారు.
రాజకీయ ప్రస్థానం గ్రామ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజాసేవకు శ్రీకారం చుట్టినారు.
1978లో జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్ గా నియమితులయ్యారు.
1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పుడు వారు ఆ పార్టీలో చేరారు.
1987లో మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత, మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బచ్చన్నపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1995 జెడ్పిటిసి ఎన్నికల్లో సంగెం మండలం నుంచి జడ్పీటిసిగా విజయం సాధించి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
1999లో వరంగల్ లోసభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2009లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2015 లో కూడా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2019లో శాసనమండలిలో చీప్ విప్ గా నియమితులైనారు.
గౌరవ శ్రీ బోడ కుంటి వెంకటేశ్వర్లు గారు సుమారు 40 సంవత్సరాల రాజకీయ జీవితం అంతట నీతి, నిజాయితీ, పారదర్శకత ల కు ప్రాధాన్యమిస్తూ ప్రజాసేవే ముఖ్యంగా పని చేశారు.
తెలంగాణ ఉద్యమంలోనూ క్రియాశీల పాత్ర పోషించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ రాష్ట్రంలో పెరిక సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎంపిగా, ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తన నియోజకవర్గ అభివృద్ది నిధులను పెరిక భవన్ల నిర్మాణానికి ఉపయోగించి కులానికి సేవలు అందించారు.
శాసనసభకు ఐదుసార్లు ఎన్నికై, అసెంబ్లీలో రెండు పర్యాయాలు ప్రభుత్వ విప్ గా పని చేసిన ఏకైక పెరిక బిడ్డ గంప గోవర్థన్ గారు.
మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గార్లతో కలిసి పనిచేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లా భిక్నూరు మండలం బస్వాపూర్ గ్రామంలో వెంకయ్య, రాజమ్మ దంపతులకు 1963 ఫిబ్రవరి 5న జన్మించారు.
ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహంలో వసతి పొందుతూ సిటీ కాలేజిలో బిఏ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తి కాగానే తెలుగుదేశం పార్టీలో చేరారు.
1887లో బస్వాపూర్ సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. బిక్నూర్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
1994లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి టిడిపి పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1999 లో ఉమ్మడి నిజామాబాద్ టిడిపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
2000లో టిడిపి రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
2009లో కామారెడ్డి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2011లో తెలంగాణ ఉద్యమం నడుస్తున్న నేపథ్యంలో టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
2012లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ పై కామారెడ్డి ఎమ్మెల్యేగా మూడో సారి గెలిచారు.
2014లో కామారెడ్డి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో ప్రభుత్వ విప్ గా నియామకం అయ్యారు.
2018లో కామారెడ్డి నుంచి నాలుగో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విప్ గా కొనసాగారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో గోవర్థన్ గారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాలేదు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడంతోపాటు, పెరిక సంఘం కార్యక్రమాల్లో కూడా గోవర్థన్ గారు చురుగ్గా పాల్గొన్నారు.
కోకాపేటలో పెరిక కులానికి ప్రభుత్వం నుంచి స్థలం తీసుకురావడానికి కృషి చేశారు.
శ్రీరాం భద్రయ్య గారు రాజకీయ నాయకుడిగా, ప్రజా ప్రతినిథిగా, పెరిక సంఘం నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం పెద్ద వంగర గ్రామంలో సత్తయ్య, లలితమ్మల దంపతులకు 1954 డిసెంబర్ 14న మొదటి సంతానంగా జన్మించారు.
రాజకీయాల పట్ల ఆసక్తితో 1983లో తెలుగుదేశం పార్టీలో చేారారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు.
1995లో వరంగల్ జిల్లా నెక్కొండ జడ్పీటిసిగా విజయం సాధించి, వరంగల్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1999 అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పెరిక సంఘం నాయకుడిగా విశిష్ట సేవలు అందించారు.
2015 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి 2025 వరకు పెరిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా పని చేశారు. 2025 నుంచి పెరిక సంఘం ముఖ్య సలహాదారులుగా సేవలు అందిస్తున్నారు.
అల్లం నారాయణ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పనిచేస్తూ, జర్నలిజం రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందినారు
తల్లిదండ్రులు: నరసయ్య - బుచ్చమ్మ గార్లు, పెద్దపల్లి జిల్లా మందిని మండలం గాజులపల్లి గ్రామంలో జన్మించినారు
ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు స్వగ్రామమైన గాజులపల్లి మండల కేంద్రమైన మందనిలో పూర్తి చేశారు, 1982 -84 మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం ఏ సోషియాలజీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పుచ్చుకున్నారు
వారు విద్యార్థి దశలోనే నక్సల్ బరి ఉద్యమం వైపు ఆకర్షితుడై 1975లో అప్పటి పీపుల్స్ వారి గ్రూపులో చేరినారు నలుగున్నార సంవత్సరాలపాటు ఆజ్ఞాత జీవితం గడిపారు,రెండు సంవత్సరాల జైలు జీవితం అనంతరం 1982లో తిరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టారు
1985లో కరీంనగర్ కేంద్రంగా వెలువడిన జీవగడ్డ దినపత్రికలో న్యూస్ ఎడిటర్ గా చేశారు, 1986లో ఆంధ్రప్రభ దినపత్రిక బెంగళూరు ఉప సంపాదకుడిగా చేరారు ఉద్యోగ జీవితంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు అసిస్టెంట్ ఎడిటర్ స్థాయికి ఎదిగారు, 2010 లో ఉద్యోగానికి రాజీనామా చేసి నమస్తే తెలంగాణ దిన పత్రిక కు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించారు,
జగిత్యాల పల్లె కవి సంకలన ము పాత్రికేయుడుగా నారాయణ జీవగడ్డ, ఆంధ్రజ్యోతి పత్రికలకు వివిధ పేర్లతో వ్రాసిన శీర్షకలు విశేష ప్రజాదరణ పొందాయి
వార్త రంగంలో ఆయన కున్న అనుభవం నిబద్ధత విలువల ఆధారీత జర్నలిజం ఆయనను రాష్ట్రస్థాయిలో విశ్వసనీయ వ్యక్తిగా నిలపెట్టాయి
ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమ కాలంలో తెలంగాణ ఆకాంక్షలను ప్రజల భావోద్వేగాలను ఉద్యమ లక్ష్యాన్ని మీడియా ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అల్లం నారాయణ గారు ఎంతో కృషి చేసినారు
ఉద్యమానికి మద్దతుగా జర్నలిస్టుగా తన వృత్తి బాధ్యతలతో పాటు తెలంగాణ భావజాలాన్ని అనుకూలంగా నిలిచి తన వంతు పాత్ర పోషించారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అల్లం నారాయణ గారిని జర్నలిస్టు సంక్షేమానికి సంబంధించిన సంస్థ ప్రస్ అకాడమీ చైర్మన్ గా నియమించినారు
ఆయన జర్నలిజంలో చేసిన సేవలకు తెలంగాణ ఉద్యమంలో చూపిన నిబద్ధతకు జర్నలిస్టుల సమస్యలపై ఉన్న అవగాహనకు ప్రభుత్వ ఇచ్చిన గుర్తింపుగా భావిస్తారు
టిఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అల్లం నారాయణ గారి పనితీరుపై ఉన్న నమ్మకంతో రెండవ సారి తెలంగాణ పెస అకాడమీ చైర్మన్‌గా నియమించడం జరిగినది, జర్నలిస్టుల సంక్షేమంలో చూపిన నిజాయితీకి ప్రభుత్వం- మీడియా మధ్య సమన్వయానికి లభించిన విశేషమైన గుర్తింపుగా చెప్పుకోవచ్చు
జర్నలిస్టుల సంక్షేమ పథకాలపై దృష్టి జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమాలు వ్యక్తి పరమైన హక్కులు సమస్యలపై ప్రభుత్వ దృష్టి ఆకర్షించటం జర్నలిజం లో నైతిక విలువలు పెంపొందించడం వంటి అంశాలలో పోషించినారు మీడియా రంగానికి జర్నలిస్టు సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన వ్యక్తి గా అల్లం నారాయణ గారు గుర్తింపు పొందినారు.
స్వాతంత్ర సమరయోధులు, సమాజ సేవకుడు, దూర దృష్టి గల నాయకులు అంకతి మల్లయ్య గారు. అంకతి లక్ష్మయ్య- రామలక్క దంపతులకు జన్మించిన ఆయన సికింద్రాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరచుకొని పెరిక సమాజ అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసినారు.
1972- 74 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నాయకత్వంలో సంఘానికి కొత్త దిశను చూపించినారు. సంఘం బలోపేతమై పెరికకుల గౌరవం రాష్ట్రస్థాయిలో ప్రతిష్ట పొందింది.
1972 సంవత్సరంలో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా సన్మానం పొందటం ఆయన సేవలకు ప్రత్యేక గుర్తింపు వచ్చినది. భారత ప్రభుత్వం నుంచి తామరపత్రం పొందినారు.
పెరిక విద్యార్థి వసతి గృహమునకు ఖైరతాబాద్ నిర్మాణ దశలో సేవలందించినారు
స్వాతంత్ర సమరయోధుడిగా దేశ సేవలోనూ , సమాజ నాయకుడిగా కుల సేవ లోను ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం.
1990 జనవరి 18న శ్రీ అంకతి మల్లయ్య గారు స్వర్గస్తులైనారు.
నల్లపు పిచ్చయ్య గారు స్వతంత్ర సమరయోధుడిగా, సామాజిక సంస్కర్తగా,సమాజ చైతన్యవంతునిగా నిలిచిన మహానుభావుడు. జులై 1915 లో మహబూబాద్ జిల్లా కందికొండ గ్రామంలో సంపన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పిచ్చయ్య గారు చిన్ననాటి నుంచి జ్ఞానం, ధైర్యం, సేవా భావం కలిగిన వ్యక్తిగా పేరుపొందారు.
వారు కందికొండ గ్రామంలో పెద్దబాలశిక్ష,మహాభారతం, రామాయణం, భాగవతం,నీతి శాస్త్రం వంటి పౌరాణిక గ్రంథాలను లోతుగా అభ్యసించి వాటిలోని పద్యాలను అనర్గళంగా పాడేవారు.
బుర్రకథలు నాటకాలలో అసాధారణ ప్రతిభను కనబరిచి. ప్రజల్లో చైతన్యం కలిగించే ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఎదిగారు.
రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా గ్రామ గ్రామం తిరిగి ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ, బుర్రకథల ద్వారా ప్రజలను యువతను పోరాటానికి ప్రేరేపించేవారు. ఆంధ్ర మహాసభలో చేరి తర్వాత కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం పొంది గ్రామాలలో అనేకమందిని కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేర్పించారు. రజాకర్ల కాలంలో జైలు జీవితం గడిపిన ధైర్యవంతుడైన స్వాతంత్ర సమరయోధుడు నల్లపు పిచ్చయ్య గారు.
కేసముద్రం రైల్వే స్టేషన్ కు దగ్గర ప్రధాన కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించి, విశేష ప్రజాదరణ పొందినారు. వారి ఇంటి పేరును కాంగ్రెస్ పిచ్చయ్య గారిగా మారేంత ప్రజాభిమానాన్ని చూ రుగొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు తక్కువగా ఉన్న కాలంలో మన సమాజం విద్యాపరంగా ఎదగాలి అనే మహాత్ర సంకల్పంతో హైదరాబాదులో హాస్టల్ నిర్మాణానికి ఎనలేని కృషి చేసినారు. జిల్లాలలో పర్యటిస్తూ నిధుల సమీకరణకు తన వంతు బాధ్యతను నిర్వహించినారు. మన కుల నాయకుల లను ప్రేరేపించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక సంఘాన్ని స్థాపించారు. రిజిస్ట్రేషన్ చేయించారు. 1976 నుండి 1982 వరకు వ్యవస్థాపక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు పెరిక సంఘం అధ్యక్షునిగా సేవలందించారు.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేసి పెరిక కుటుంబాలను ఏకతాటిపై తెచ్చి సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు
హాస్టల్ నిర్మాణం,సమాజ అభివృద్ధి, యువతకు ఉపాధి, విద్యా ప్రోత్సహం, వివాహ ఏర్పాట్లు వంటి అనేక కార్యక్రమాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆదర్శంగా నిలిచినారు నల్లపు పిచ్చయ్య గారు.
నల్లపు పిచ్చయ్య గారు కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు. ఒక స్ఫూర్తి, ఒక ఉద్యమం, ఒక చైతన్యం, సమాజాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు.
ఆయన సేవలు,త్యాగం, నిబద్ధత నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.
నల్లపు పిచ్చయ్య గారి సతీమణి సత్తెమ్మ గారు. వీరికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
కుమారులు: కీర్తిశేషులు నల్లపు ఇంద్రసేన, నల్లపు మురళీధర్. నల్లపు శ్రీనివాసరావు, నల్లపు యుగంధర్, శ్రీనల్లపు జలంధర్ (అడ్వకేట్) శ్రీ నల్లపు ప్రహల్లాద ( అడ్వకేట్) గార్లు
కుమార్తెలు: కీర్తిశేషులు తిప్పని ఇందిరా, తమన శకుంతల గార్లు
నల్లపు పిచ్చయ్య గారు ది. 12-07-1988న స్వర్గస్తులైనారు.
పెరిక సంఘం మాజీ అధ్యక్షులు
కీ. శే. చింతల యలమంద గారు మాజీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సంఘం మరియు పెరిక విద్యార్థి వసతిగృహం ఖైరతాబాద్ ప్రధాన కార్యదర్శి గా సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిక కుల సంఘ చరిత్రలో చిరస్మరణీయమైన నాయకుడు పెరిక కులానికి ఆత్మీయులు, సేవా తత్పరులు నిస్వార్ధ సమాజ సేవకులు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు1992-95 మధ్యకాలంలో పెరిక కుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించి సంఘ బలోపేతానికి విశేష కృషి చేసినారు.
ఖైరతాబాద్ లోని పెరిక విద్యార్థి వసతి గృహమునకు 1997-2002, 2003- 2005, 2005-2007,2007-2009 వరకునాలుగు సార్లు ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించటం ఆయన సేవలకు నిదర్శనం. పెరిక హాస్టల్ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసినారు. సుమారు 40 సంవత్సరములు పెరిక సంఘానికి, పెరిక హాస్టల్ అభివృద్ధికి సుదీర్ఘ సేవలందించడం ఆయన సమాజ నిబద్ధతకు ఆయన ప్రత్యేకత
పరమపదించిన తేదీ: 13.09.2020న ఆయన స్వర్గస్తులైన వార్త పెరిక సమాజానికి తీవ్ర విషాదాన్ని కలిగించింది.
మారిశెట్టి నారాయణ గారు పెరిక సమాజ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానీయుడు. నారాయణ గారు సాధారణ కుటుంబంలో జన్మించి, అనేక కష్టనష్టాలు అధిగమించి సమాజ అభ్యున్నతికి లక్ష్యంగా పెట్టుకొని మహానత నాయకుడు.
వారి తల్లిదండ్రులు రాజయ్య, సత్తమ్మ గార్లు చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయినా తల్లి సత్తెమ్మ గారి ఆశీస్సులతో ధైర్య సాహసాలతో ఎదిగినారు. జీవిత పోరాటంలో వెనకడుగు వేయకుండా వ్యాపార రంగంలో ప్రవేశించి సోప్స్ (సబ్బుల ) తయారీ పరిశ్రమను స్థాపించడం ద్వారా ప్రతిభ చాటుకున్నారు.
ఆయన జీవిత లక్ష్యం వ్యక్తిగత విజయాలతో ముగియ లేదు. సమాజం ఎదగాలని, ముఖ్యంగా విద్యా ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఆయన హృదయంలో అగ్నిల దహించుకున్న సంకల్పం.
ఆ సంకల్పమే ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతిగృహం రూపంలో సహకారం అయింది.
హాస్టల్ స్థాపనకు మూల పురుషుడు ఆయన.
పెరిక విద్యార్థి వసతి గృహం ఏర్పాటుకు నారాయణ గారు ఒక ఫౌండర్ మాత్రమే కాదు ఆయనే మూలపురుషుడు, సృష్టికర్త, ఉద్యమకర్త,పునాది దాత.
ఆయన లేని పక్షంలో ఈ హాస్టల్ అనే ఆలోచన రూపుదిద్దుకొనేది కాదు.
ఆయన స్ఫూర్తి కృషి నాయకత్వం లేకపోతే నిర్మాణం ముందుకు సాగేది కాదు.
ఈరోజు పెరిక సమాజానికి లభించిన గౌరవం సాధ్యము అయ్యేది కాదు.
1971 లో హిమాయత్ సాగర్ గెస్ట్ హౌస్ లో జరిగిన సమావేశంలో హాస్టల్ ఆలోచనలకు శ్రీకారం చుట్టగా 1972లో మారిశెట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హాస్టల్ నిర్మాణానికి తుది నిర్ణయం తీసుకున్నారు.
వారి నాయకత్వంలో పెరిక సమాజంలో ప్రముఖులను ఒక వేదిక పైకి తీసుకువచ్చి ముందు చూపుతో 12 మంది ఫౌండర్స్ తో ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం ఆయన దూర దృష్టికి నిదర్శనం.
హాస్టల్ సభ్యత్వం 2,151 లోగా నిర్ణయించి రెండు లక్షల రూపాయలు అతి తక్కువ కాలంలో సమీకరించటం ఆయన నాయకత్వo పటిమ సూచిస్తుంది.
విరాళాల సేకరణకు ఆయన సొంత కారు, పెట్రోలు మారిశెట్టి నారాయణ గారే ఏర్పాటు చేసేవారు.
ఖైరతాబాద్ లో 1,200 గజాలు ఎంతో విలువైన స్థలాన్ని కేవలం రెండు లక్షల 25 వేలకు సమీకరించటం మారి శెట్టి నారాయణ గారి పలుకుబడి చాతురాత్యా యానికి నిదర్శనం. భవిష్యత్తు తరాలకు విద్య ఆలయానికి వేసిన బలమైన పునాది.
హాస్టల్ నిర్మాణం మాత్రమే కాకుండా దీర్ఘకాలంగా ఆర్దిక వనరులు నిలబడేలా సృష్టించడంలో ఆయన ముందుచూపు అపారమైనది.
బ్యాంకు వారితో మాట్లాడి ఆదాయ మార్గాలను ఏర్పాటు కిరాయిల రూపంలో నిరంతరం ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందించినారు.
ఆ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రముఖ రాజకీయ నాయకులు నారాయణ గారికి ఉన్న అనుబంధం అసాధారణం. ఆ పరిచయం వలన సమాజ ప్రయోజనానికి ఉపయోగించి అనేకమంది యువతకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించినారు.
మారిశేట్టి నారాయణ గారికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు తో సన్నిహిత సంబంధాలు కలిగి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకున్నారు.
అలాగే హైదరాబాదులో నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో సమావేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి వద్దకు పెరిక సమాజ ప్రముఖులను తీసుకెళ్లి పరిచయం చేసిన ఆయన ప్రతిష్టకు నిదర్శనం.
మారిశెట్టి నారాయణ గారు నాయకత్వం కేవలం నిర్ణయాల్లో కాదు, అది ఒక ఉద్యమం ఒక శక్తి. ఆయన చూపిన దారిలోనే హాస్టల్ నిర్మాణం ముందుకు సాగింది.
ఆయన ఆలోచనలు సమాజానికి దిశదశ నిర్దేశం చేశాయి. మారిసెట్టి నారాయణ గారి జీవితం ప్రజాసేవకు ప్రతిరూపం ఆయన స్ఫూర్తి తరతరాలకు మార్గదర్శకం.
పెరిక కుల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయులలో కీర్తిశేషులు అచ్చ బాలరాజయ్యగారు ఒకరు. అచ్చ బాలరాజు గారు 1931లో నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామంలో అచ్చ రాజయ్య- శ్రీమతి లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి తండ్రి రాజయ్య గారు దోమకొండ గ్రామములో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. విద్యపై గాఢమైన విశ్వాసం కలిగిన రాజయ్య గారు తమ కుమారుడు అచ్చా బాలరాజయ్య గారిని అదే పాఠశాలలో చేర్పించి చదివించారు.
అచ్చ బాల రాజయ్య గారు స్వగ్రామం దోమకొండ నుంచి హైదరాబాద్ కి 1950 లొ వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అచ్చ బాల రాజయ్య గారు బాల్యం దశ నుంచే ప్రతిభ కనబరిచేవారు. ఉన్నత చదువులు పూర్తి చేసి ఉర్దూ అలీమ్ పట్టా పొందినారు, డిగ్రీలో అప్పటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించటం ఆయనలో విద్య పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం.
తర్వాత వాళ్ళ నాన్నగారు టీచర్‌గా పని చేసిన దోమకొండ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి అదే స్కూల్లో హెడ్మాస్టర్ గా సేవలు అందించి, అనేకమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినారు. క్రమశిక్షణ విలువల బోధన విద్యార్థుల పట్ల ప్రేమ ఆయన ప్రత్యేకత.
హైదరాబాదుకి దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి గృహం సౌకర్యం లేకపోవడం విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని సంకల్పంతో పెరిక విద్యార్థి వసతి గృహాన్ని నిర్మాణ ఆలోచనకు 12 మంది గౌరవ ఫౌండర్లు నిర్మాణం చేపట్టినారు అందులో గౌరవ అచ్చ బాలరాజయ్య గారు ఒకరు కావడం విశేషం.
ఈ వసతి గృహం లొ చదువుకొని అనేకమంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అచ్చ బాలరాజయ్య గారు ఉద్యోగాన్ని వదిలేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1965-70 మధ్య కాలంలో హైదరాబాద్ మునిసిపల్ ఉస్మాన్ గంజి ఏరియాలో కౌన్సిలర్ గా గెలిచి ప్రజలకు సేవలు అందించినారు.
అచ్చా బాల రాజయ్య గారు మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కి ప్రియ శిష్యుడిగా ఉన్నారు.
1975 లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వర్యులు జలగం వెంగళరావు గారు ఆయనను కన్వీనర్ గా నియమించినారు. ఇది ఆయనకు లభించిన గొప్ప వరంగా చెప్పాలి.
అచ్చ బాలరాజయ్య గారికి ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అచ్చ బాల రాజయ్య గారు, హైదరాబాద్ హోల్ సేల్ ఫ్రూట్స్ మర్చంట్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా సేవలు అందించినారు. వారి అబ్బాయిలలో ఒకరు అచ్చ శ్రీనివాసరావు గారు హోల్ సేల్ ఫ్రూట్ మర్చంట్ హైదరాబాదు వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందిస్తున్నారు.
06.03.1999 న అచ్చ బాలరాజయ్య గారు స్వర్గస్తులైనారు. ఆయన సేవ వారసత్వం నేటికీ నిలిచి ఉంది వారి కల నిజమై అనేక కుటుంబాలు వెలుగునిస్తుంది.
శ్రీ పతిపాక బాలరాజయ్య గారు 1926 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలోని పెండర్ఘాస్ట్ రోడ్ ప్రాంతంలో జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి చూపుతూ మంచి విద్యాభ్యాసం చేశారు. ఆయన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఆ కాలంలోనే ఉన్నత విద్యావంతుడిగా పేరు పొందారు.
యువకుడిగా ఉన్న సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమ ప్రభావం ఆయనపై ఎంతో ఉంది. తన విద్యా జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా మార్చి, స్వాతంత్ర్య సమర కాలంలో భారతీయులలో చైతన్యం కలిగించేందుకు కృషి చేశారు. దేశభక్తి, సామాజిక చైతన్యం ఆయన వ్యక్తిత్వంలో ప్రత్యేక లక్షణాలు.
సామాజిక సేవా దృక్పథంతో, ఆయన కైథాబాద్లో స్థాపించబడిన పెరిక విద్యార్థి వసతి గృహం (Perika Vidyarthi Vasathi Gruham, Kaithabad) స్థాపక సభ్యులలో ఒకరుగా (12 మంది స్థాపకుల్లో ఒకరు) విశేష పాత్ర పోషించారు. విద్యార్థుల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి.
వృత్తిరీత్యా ఆయన టెక్స్టైల్ రంగంలో ప్రముఖ హోల్‌సేల్ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్స్టైల్ సరుకు సరఫరా లోపం ఉన్న సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించి హైదరాబాద్‌ను టెక్స్టైల్ వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించారు.
అతను Secunderabad Cloth Merchants Association (SCMA) కు 10 సంవత్సరాలకు పైగా General Secretaryగా సేవలందించారు. అలాగే Federation of Andhra Pradesh Chambers of Commerce and Industry (FAPCCI) సభ్యునిగా కూడా వ్యవహరించారు.
ప్రభుత్వం టెక్స్‌టైల్‌పై ఎంట్రీ ట్యాక్స్ విధించినప్పుడు, వ్యాపార వర్గాల ప్రయోజనార్థం పోరాడి ఆ ప్రభుత్వ ఉత్తర్వును (GO) రద్దు చేయించడంలో ఆయన ముందుండారు. వ్యాపారాభివృద్ధి ఆయన ప్రధాన ధ్యేయం. “రాష్ట్ర వ్యాపారానికి మరింత వస్తుసరఫరా అందించాలి” అనే ఆయన మంత్రం టెక్స్టైల్ రంగ అభివృద్ధికి దోహదపడింది.
1965 నుండి 1970 వరకు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రియాశీలక సభ్యునిగా పనిచేశారు. ఆ కాలంలో ప్రముఖ నాయకుడు T. Anjaiah గారితో ఆయనకు కుటుంబసంబంధం వంటి ఆత్మీయ అనుబంధం ఉండేది. అనేక రాజకీయ నాయకులకు ఆయన సలహాదారుడిగా మార్గనిర్దేశం చేశారు.
సామాజిక సేవకుడిగా మాత్రమే కాకుండా, ఆయన ఒక ఆదర్శ తండ్రిగానూ నిలిచారు. ప్రారంభ దశలో ఆయన మూడవ కుమారుడు Pathipaka Sunil Kumar గారు దాదాపు మూడు దశాబ్దాల పాటు కుటుంబ వ్యాపార అభివృద్ధికి విశేషంగా కృషి చేసి తన వంతు సేవలు అందించారు. అనంతరం ఆయన ఐదవ కుమారుడు Pathipaka Sanjay గారు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వ్యాపారం మరియు సామాజిక సేవలో ముందుకు సాగుతున్నారు.
ఆయన 2014 సంవత్సరంలో పరమపదించారు. అయితే ఆయన వారసత్వం నేటికీ కొనసాగుతోంది. ఆయన కుమారుడు Pathipaka Sanjay గారు టెక్స్టైల్ అసోసియేషన్ సెక్రటరీగా సేవలందిస్తూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. అలాగే సికింద్రాబాద్‌లోని టొబాకో బజార్ ప్రాంతంలో “సప్తగిరి టెక్స్టైల్స్ కాటన్ హౌస్” వ్యాపారం విజయవంతంగా కొనసాగుతోంది
పెట్రం కుప్పుస్వామి గారు పెరిక సమాజ చరిత్రలొ చిరస్మరణీయమైన మహనీయులు. పెరిక విద్యార్థి వసతిగృహం స్థాపనలొ 12 మంది ఫౌండర్ లలొ ఒకరుగా నిలిచి విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన సేవామూర్తి.
పెట్రo కుప్పుస్వామి గారు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా కొండకొర్ల గ్రామంలో జన్మించారు. 1940 లో హైదరాబాదుకు వచ్చి స్వయంకృషితో జీవితం ప్రారంభించారు. బాలానగర్ ప్రాంతంలో రోజువారి వేతనంతో జీవితం ప్రారంభించ, క్రమంగా ఒక స్థాయికి వచ్చినారు.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో సివిల్ కాంట్రాక్టర్ గా సేవలు అందించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ లో డ్రైనేజీ నిర్మాణములొ నైపుణ్యం కలిగిన అనుభవశాలి.
విద్యార్థుల సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషిచేసిన నిర్మాణ యోధుడు. హాస్టల్ నిర్మాణములొ చెమటోడ్చిన త్యాగధనుడు. సమాజ భవిష్యత్ కోసం ఆలోచించిన దూర దృష్టి గల నాయకుడు.
కష్టపడి ఎదిగి సమాజానికి తిరిగి ఇచ్చిన కృతజ్ఞతా ప్రతిరూపం. 12 మంది పౌండర్ల తో కలిసి హాస్టల్ నిర్మాణానికి అంకితభావంతో శ్రమించిన సేవా శిల్పి. కష్టాన్ని ఆయుధాoగా చేసుకొని సమాజానికి ఆశ్రయం కలిపించిన మహా నాయకుడు పెట్రo కుప్పు స్వామి గారు.
విద్యార్థుల వసతి గృహానికి వేసిన ప్రతి ఇటుకకు ఆయన త్యాగం ఉన్నది.
పెట్రం కుప్పు స్వామి గారికి నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు.
పెట్రo కుప్పు స్వామి గారి సతీమణి. సత్యనారాయణమ్మ గారు.
కుమారుల పేర్లు1, కీ.శే. పెట్రం నర్సింగరావు, కీ. శే. పెట్రo రమణారావు, కీ. శే.పెట్రం సోమేశ్వరరావు,కీ. శే.పెట్రo వినోద్ కుమార్ గారు, కుమార్తెలు శ్రీమతి సులోచన, శ్రీమతి శోభా గార్లు.
మనవడు పెట్రo శ్రీధర్ గారు మధుకాన్ ప్రాజెక్టులొ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేస్తున్నారు.
పెరిక విద్యార్థి వసతి గృహం స్థాపనలో 12 మంది ఫౌండర్లలో ఒకరిగా నిలిచిన విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషిచేసిన సేవా శిల్పి.
స్వగ్రామము పటాన్చెరువు ఏరియా వారు ఐదుగురు అన్నదమ్ములు. కావేటి రంగయ్య గారు చిన్నవారు. వీరికి ఐదుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు, కావేటి రంగయ్య గారు స్టీల్, ఇనుము కెమికల్ రంగాలలో పరిశ్రమలు నిర్వహించినారు.
వ్యాపారంలో నిమగ్నమై ఉన్నప్పటికీ సమాజ సేవను మరువని సేవా దృక్పదo గల నాయకుడు.
పెరిక విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి చదువు కొరకు హైదరాబాద్‌కు వచ్చి హాస్టల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి 12 మంది ఫౌండర్స్ తో కలిసి ముందడుగు వేసిన దూరదృష్టి గల నాయకుడు.
హాస్టల్ నిర్మాణంలో ఐక్యతకు ప్రత్యేక నిలిచిన సంఘటిత శక్తి రూపం ఫౌండర్స్ తో కలిసి హాస్టల్ నిర్మాణం కొరకు చెమటోడిచి శ్రమించిన నిర్మాణ యోధుడు.
హాస్టల్ నిర్మాణాన్ని తో పాటు పెరిక కుల సంఘాన్ని కూడా సేవలు అందించిన నాయకుడు కావేటి రంగయ్య గారు.
కావేటి రంగయ్య గారి సతీమణి నరసమ్మ గారు.
తల్లిదండ్రులు కావేటి రాజన్న మల్లమ్మ గార్లు దంపతులు.
కుమారులు :1.కావేటి మనోహర్ బాబు లేటు 2. కావేటి కాశీనాథ్ లేటు, 3. కావేటి ప్రభాకర్ లేటు 4. కావేటి విజయ్ కుమార్, 5. కావేటి కిషోర్ కుమార్ లేటు
కుమార్తెలు : 1. శ్రీమతి వనపర్తి ఛాయాదేవి లేటు 2. శ్రీమతి బెర్రీ కుసుమ,3. శ్రీమతి అంబటి విమల,4. శ్రీమతి ముత్తినేని శ్రీమతి
కావేటి రంగయ్య గారి అన్నదమ్ములు 1. కావేటి వీరమల్లు లేటు, 2. కావేటి ఈశ్వరయ్యలేటు, 3. కావేటి కృష్ణయ్య లేటు,4. కావేటి బాలయ్య లేటు, 5. కావేటి రంగయ్యలేటు గార్లు ఫౌండర్
అక్క చెల్లెలు :1. శ్రీమతి బేలె నాగమ్మ,2. శ్రీమతి బుద్దె దేవకమ్మ,3. శ్రీమతి అంకతి ఈశ్వరమ్మ,4. శ్రీమతి సుబురు సత్తెమ్మ గార్లు
కావేటి రంగయ్య గారి నాలుగో కుమారుడు విజయ్ కుమార్ గారు
కర్రె మల్లయ్య గారు సమాజ చరిత్రను చిరస్థాయిగా నిలిచిన మహనీయులు.
పెరిక విద్యార్థి వసతి గృహ స్థాపనలో 12 మంది పౌండరులో ఒకరిగా ఉన్నారు. వారు విద్యా సేవను సమాజ ధర్మంగా భావించిన గొప్ప వ్యక్తి .
తల్లిదండ్రులు కర్రే రామయ్య -రాములమ్మ గార్లు జన్మస్థలము బీబీనగర్.
వారు వస్త్ర వ్యాపారం కొరకు హైదరాబాద్ వచ్చి స్థిరపడినారు. మల్లయ్య గారి వివాహము మణెమ్మ గారితో జరిగినది నాంపల్లి, నారాయణగూడ ల లో వస్త్ర వ్యాపారం చేసేవారు
పెరిక కుల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం హాస్టల్ నిర్మాణ సంకల్పములొ భాగస్వాములైనారు హాస్టల్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన స్థాపక శిల్పి
సమాజాభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించిన దూర దృష్టి గల నాయకుడు. విద్యార్థుల సంక్షేమం కోసం కృషిచేసిన విద్యా సేవా మూర్తి.
కర్రే మల్లయ్య గారికి ఇద్దరు కుమారులు కీ. శే.రాధాకృష్ణ, కీ. శే.విష్ణు కుమార్ గార్లు.
విష్ణు కుమార్ గారు పెరిక విద్యార్థి వసతి గృహమునకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా 2011-13 లొ సేవలందించినారు. వీరు కాంగ్రెస్ పార్టీ లో వివిధ హోదాలలో ప్రముఖంగా సేవలందించినారు.
కర్రె మల్లయ్య గారు కుటుంబం సమాజసేవ కొనసాగుతున్న వారసత్వం, కర్రె మల్లయ్య గారి మనవడు కర్రే భాను చైతన్య ప్రస్తుతం పెరిక విద్యార్థి వసతిగృహం ఖైరతాబాద్ వర్కింగ్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కర్రె మల్లయ్య గారు సమాజ సేవలో జీవితం గడిపిన మహనీయుడు.
కర్రే మల్లయ్య గారు 1983లో స్వర్గస్తులైనారు.
కర్రి మల్లయ్య గారి మనవడు భాను చైతన్య గారు.
రామినేని బాలకృష్ణయ్య గారు సమాజ సేవకులు అంకితభావంతో పనిచేసిన మహానీయులు. పెరిక విద్యార్థి వసతి గృహం స్థాపనలో ఆయన చేసిన కృషి పెరిక సమాజ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది.
రామినేని బాలకృష్ణయ్య గారు హైదరాబాద్ నగరంలో జన్మించి, అక్కడే పెరిగినారు. వారి తల్లిదండ్రులు లక్ష్మమ్మ విఠోవ గార్లు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
కుమారుడు: రామినేని అశోక్ కుమార్, కుమార్తెలు: 1.సంఘని లక్ష్మి ,2. బండి సునీత 3. అంకతి సంగీత
రామినేని బాలకృష్ణయ్య గారు ఖైరతాబాద్ లోని పెరిక విద్యార్థి వసతిగృహం 12 మంది స్థాపకులలో ఒకరుగా నిలిచినారు. దూరప్రాంతాల నుంచి హైదరాబాదుకు వచ్చి చదువుకునే పేద విద్యార్థులు నివాస సౌకర్యం కలిపించాలన్న మహత్తర సంకల్పంతో వసతి గృహం నిర్మాణంలో ఎంతో శ్రమించినారు.
సమయం,శ్రమ, ధనం అన్నింటిని హెచ్చించి విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమించినారు.
విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే సిద్ధాంతం వారిది.
రామినేని బాలకృష్ణయ్య గారు హైదరాబాదులో హోల్ సేల్ ఫ్రూట్ మర్చంట్ కమిషన్ దారునిగా చేస్తూ ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ వారి విలువైన సమయాన్ని సమాజ సేవకు సమయం కేటాయించేవారు.
హోల్ సేల్ ఫ్రూట్స్ మర్చంట్ అభివృద్ధికి కృషి చేసినారు వ్యాపార వర్గాల్లో ఐక్యత పెంచేందుకు శ్రమ తీసుకునేవారు.
రామినేని బాలకృష్ణయ్య గారు వారి కుమారుడు రామినేని అశోక్ కుమార్ కూడా తండ్రి గారి సేవ భావాన్ని కొనసాగిస్తూ పెరిక కుల సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
అశోక్ కుమార్ గారు గత 20 సంవత్సరాలుగా ఫ్రూట్స్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా సేవలందిస్తూ వ్యాపార వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
రామినేని బాలకృష్ణయ్య గారి విద్యా ప్రాధాన్యతను గుర్తుచేస్తాయి.
వారి సేవలు పెరిక సమాజానికి ఆదర్శంగా నిలిచాయి.
రామినేని బాలకృష్ణయ్య గారు 1996లో స్వర్గస్తులైనారు.
గోపతి శ్రీరాములు గారు ప్రముఖ వ్యాపారవేత్త సమాజ సేవకుడు గా గుర్తింపు పొందిన మహనీయుడు.
గోపతి శ్రీరాములు గారు పెరిక కుల సమాజాభివృద్ధికి తమ జీవితాన్ని అంకితం చేసిన సేవా తత్పరులు.
వీరి తల్లిదండ్రులు గోపతి శ్రీబాలయ్య - కృష్ణమ్మ గార్లు,. హైదరాబాద్ సమీపంలోని ఏదులాబాద్ లొ 12- 12-1928 లొ జన్మించినారు.
విద్య యొక్క ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్న గోపతి శ్రీరాములు గారు గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాదుకు చదువు కోసం వచ్చే పెరిక కుల విద్యార్థులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని హైదరాబాదులొ వసతిగృహం నిర్మించాలని సంకల్పించినారు.
పెరిక విద్యార్థులకు సుర క్షితమైన వసతిగృహం కలి పించాలనే ధ్యేయంతో ఏర్పడిన 12 మంది గౌర పెద్దలు ఫౌండర్స గా ఏర్పడి వారితో కలిసి నిర్మాణంలో భాగస్వామి అయినారు. భవన నిర్మాణానికి విరాళాలు సేకరించటం దాతలను ప్రోత్సహించటం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు.
హాస్టల్ నిర్మాణం పూర్తయిన తర్వాత 1972-75 మధ్యకాలంలో ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహానికి మొదటి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి నారు. తన పదవి కాలంలో హాస్టల్ అభివృద్ధి విద్యార్థుల సంక్షేమం క్రమశిక్షణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించినారు. వారి నాయకత్వంలో హాస్టల్ ఒక విద్యాసేవ కేంద్రంగా అభివృద్ధి చెందింది.
పెరిక హాస్టల్ కార్యకలాపాలు పెరిక కుల సంఘ అభివృద్ధికి సేవలు అందించినారు. విద్యా పట్ల అవగాహన కల్పించడం, ఉన్నత విద్య వైపు ప్రోత్సహించటం, సమాజ ప్రయోజనం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి పనిచేసిన గోపతి శ్రీరాములు గారు సేవలు పెరిక సమాజానికి చిరస్థాయిగా నిలిచిపోయాయి.
గోపతి శ్రీరాములు గారు పెరిక కులం ఐక్యతగా ఉండుట కొరకు మన రాష్ట్రమే కాకుండా చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర మొదలు గు రాష్ట్రాలలో పెరిక కుల సమాచారం తెలుసుకొని ఐక్యత కోసం ఆరాటపడినారు. ఆయన చేసిన కృషితో ఈ రోజున ఏన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. సమాజాన్ని ఏకం చేసిన దూరదృష్టకల మహనీయుడు గోపతి శ్రీరాములు గారు. వారి సేవలు పెరిక సమాజానికి చిరస్మరణీయం.
గోపతి శ్రీరాములు గారు సేవలను పెరిక సమాజం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో స్మరించుకుంటుంది.
వారు చిన్నతనంలోనే హైదరాబాద్ వచ్చి ఆల్విన్ మెటల్ వర్క్స్ అనే ప్రముఖ పారిశ్రామిక సంస్థలొ పని చేసినారు. అక్కడ అనుభవం గడించిన తర్వాత తాను సొంతంగా సంస్థని ఏర్పాటు చేయాలని యువతకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించుకొని ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఫర్నిచర్ వ్యాపారాన్ని నాంపల్లి స్టేషన్ రోడ్డు లొ ప్రారంభించారు.
ఆయన కృషి నిజాయితీ నిబద్ధత తో పనిచేయటం వల్ల అనతి కాలములోనే కస్టమర్ల విశ్వాసాన్ని పొంది ఫర్నిచర్ వ్యాపారం నాంపల్లి స్టేషన్ రోడ్ లో గోపతి ఫర్నిచర్ గా అభివృద్ధి చెందింది.
గోపతి శ్రీరాములు గారి శ్రీమతి బాణామణి గారు జీవిత భాగస్వామిగా ఒక బలమైన ఆధారంగా నిలిచినారు. వీరు ఆదర్శ దంపతులు. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
కుమారులు: గోపతి అశోక్, బాలకృష్ణ ,కీ. శే. అనుప్, సాయిబాబా, లతీష్ కుమార్ గార్లు
కుమార్తెలు : బోడపుంటి అనురాధ, చింతకుంట్ల అమరేశ్వరి గార్లు
తల్లిదండ్రులు కీ.శే. పెరిక సోమయ్య కానుగంటి- వెంకటమ్మ గారి కుమారుడు కానుగంటి లక్ష్మీ నరసయ్య - సద్గుణ గార్లు. కానుగంటి లక్ష్మీ నరసయ్య గారు సేవా తత్పరులైన మహనీయులలో ఒకరు.
కానుగంటి లక్ష్మీ నర్సయ్య గారు చిన్ననాటి నుంచే సేవాభావంతో పెరిగారు. వారి తండ్రి సోమయ్య గారు హోల్‌సేల్ వ్యాపారం నిర్వహిస్తూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన మన కుల బంధువులకు భోజనం వసతి సౌకర్యం కల్పించేవారు. అంతేకాకుండా బీద విద్యార్థులకు స్కూల్ ఫీజులు వసతి సౌకర్యం కల్పించేవారు.
అలాంటి సేవ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కానుగంటి లక్ష్మీ నరసయ్య గారు ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహం సాపనలో 12 మంది ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు.
పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని సంకల్పంతో హాస్టల్ నిర్మాణానికి విరాళాలు సేకరించటం, అంతేకాకుండా స్వయంగా ఆర్థిక సాయం అందించి హాస్టల్ నిర్మాణానికి విశేషంగా కృషి చేసినారు.
వారిది ఉదార స్వభావం,సేవ తత్వం, సమాజం పై ప్రేమ, ఇవన్నీ కలిసిన మహానీయుడు కానుగంటి లక్ష్మీ నరసయ్య గారు.
కామిశెట్టి అంజయ్య గారు పెరిక కుల సమాజ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులు.
వీరు 1920 సంవత్సరంలో హైదరాబాదులోని డబల్ పుర ప్రాంతంలో జన్మించారు. వీరు వ్యాపార రంగంలో ఎంతో అనుభవం సంపాదించి మంచి స్థాయికి ఎదిగినారు.
సమాజ సేవను జీవిత ధ్యేయంగా భావించి బడుగు బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ సహాయ సహకారనందించేవారు. వారికి ప్రజలలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు ఉండేవి. వారి సేవ తత్పరతను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించడం వారి ప్రజా సేవకు వచ్చిన గొప్ప గౌరవం.
కామిశెట్టి అంజయ్య గారు గొప్ప దైవ భక్తి గల వ్యక్తి. ముఖ్యంగా హనుమాన్ భక్తుడిగా ప్రసిద్ధి చెందినవారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా నిరుపేదలకు వస్త్ర దానం అన్నదానం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టేవారు.
పెరిక విద్యార్థి వసతిగృహం నిర్మాణములొ కీలక పాత్ర పోషించినారు. వసతిగృహం సాధనకు ముందడుగు వేసిన 12 మంది స్థాపకుల లో ఒకరుగా నిలిచి, నిర్మాణానికి అవసరమైన విరాళాల సేకరణ, సమాజ ప్రముఖులు చేర్పించడంలోను హాస్టల్ నిర్మాణ లొ ను అపారమైన కృషి చేసినారు.
పెరిక కుల సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లొ రాష్ట్రస్థాయిలో కుల ప్రతిష్ట నిలబెట్టడంలొ ముఖ్యమైన పాత్ర పోషించినారు.
కామిశెట్టి అంజయ్య గారు సమాజానికి చేసిన సేవలు, సమాజం కోసం చూపిన అంకితభావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయి.
కామిశెట్టి అంజయ్య- బాలమ్మ గార్ల పుణ్య దంపతులకు సంతానం.
కుమారులు కామిశెట్టి నర్సింగరావు, కామిశెట్టి ప్రకాష్, కామిశెట్టి సత్యనారాయణ, కామిశెట్టి అశోక్ కుమార్, కామిశెట్టి కృష్ణకుమార్, కామిశెట్టి వెంకటేశ్వరరావు గార్లు.
కుమార్తెలు: పద్మ,శాంతి, విజయ,హరి,ప్రమీల,భగవతి, గీత,మాధవి,
వీరిలో కామిశెట్టి నరసింహారావు గారి మంచితనానికి మారుపేరుగల సంతానం
కుమారులు శివకుమార్, శ్రీనివాస్ లు
కుమార్తెలు ఉషారాణి, సంధ్యారాణి లు
కామిశెట్టి వెంకటేశ్వరరావు గారి అనూష దంపతుల సంతానం
కుమార్తెలు :డాక్టర్ అక్షర,క్షితిక
పాయల జంగయ్య గారు ది.05.04-1944న జన్మించారు.
తల్లిదండ్రులు కీర్తిశేషులు పాయల నరసయ్య గారు - ఈశ్వరమ్మ గార్లు.
25. 05 -1962 లొ శ్రీ పాయల జంగయ్య గారి వివాహం సుజ్ఙాని దేవి గారితో జరిగినది
శ్రీ పాయల జంగయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సంఘానికి, విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ హాస్టలకి విశేష కృషి చేసిన మహనీయుడు
1971 నుంచి ఇప్పటివరకు సుమారు 55 సంవత్సరాలు పైగా వివిధ హోదాలలో నిరంతరం సేవలందింస్తున్న సేవా భావం కలిగిన నాయకుడు, సుమారు 82 సంవత్సరాల వయసు కలిగిన పాయల జంగయ్య గారు ఇప్పటికీ సేవల ను అందించటం వారి సేవా భావానికి నిదర్శనం.
కీర్తిశేషులు నల్లపు పిచ్చయ్య గారి అధ్యక్షతన శ్రీ పాయల జంగయ్య గారు ప్రధాన కార్యదర్శిగా ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెరిక కుల సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది.. శ్రీ జంగయ్య గారు రిజిస్ట్రేషన్ కొరకు విశేష కృషి చేసినారు.
శ్రీ పాయల జంగయ్య గారు పెరిక కుల విద్యార్థుల కోసం విశేష కృషి చేసిన నాయకుడు. ఖైరతాబాద్ హాస్టల్ కి జాయింట్ సెక్రటరీగా, కార్య నిర్వహణ సెక్రెటరీగా,ప్రధాన కార్యదర్శిగా,అధ్యక్షుడిగా 3 పర్యాయాలు( 6 సంవత్సరాలు) సేవల ను అందించి విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పించిన నాయకుడు.
బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి దిల్ శుఖ్ నగర్ వసతిగృహం ప్రారంభించడం, నాగోలులో పెద్ద భవనాన్ని అద్దెకి తీసుకొని ఎక్కువ మంది బాలికలకు వసతి కల్పించాలని లక్ష్యంతో మొత్తం 215 మంది వసతి కల్పించడం ఆయన సేవ భావానికి నిదర్శనం.
శ్రీ పాయల జంగయ్య గారు కేవలం పదవులు నిర్వహించిన నాయకుడు మాత్రమే కాదు. సంఘ ఆస్తులను అభివృద్ధి కోసం కృషిచేసి హాస్టల్ కు సంబంధించిన పన్నుల ను మినాయింపులు తీసుకొచ్చినారు.
ఉప్పల్ ప్రాంతంలో హైదరాబాద్- వరంగల్ హైవే పక్కన ధర్మకర్తల ఆమోదం మేరకు 968 గజాలు స్థలం గజం 16,500 కు తక్కువ ధరకు కొనుగోలు చేసినారు.
ఉప్పల్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి హోం శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారు, వెనుకబడిన తరగతుల శాఖ మాత్యులు బసవరాజు సారయ్య గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ తుళ్ల దేవేందర్ గౌడ్ గారు, మన కుల రత్నాలు శ్రీ బోడ కుంటి వెంకటేశ్వర్లు పార్లమెంటు సభ్యులు గారు, శ్రీ గంప గోవర్ధన్ ఎమ్మెల్యే గారు,శ్రీరామ్ భద్రయ్య మాజీ ఎమ్మెల్యే గారు,మన కుల గౌరవ నాయకులు కుల బంధువులు ఆ భూమి పూజ కార్యక్రమానికి హాజరైనారు
అట్టి భవన నిర్మాణానికి బ్యాంకు ద్వారా 70 లక్షల రుణం తీసుకొని, గౌరవ కుల పెద్దల సహకారంతో ఐదు స్లాబులు వరకు పూర్తి చేసినారు ఆరవ స్లాబు వేసే సమయంలోపు హాస్టల్ ఎన్నికల జరిగి కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు అప్పజెప్పడం జరిగినది. నిస్వార్థ సేవా భావం కలిగిన నాయకుడు విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి యువత భవిష్యత్తు కోసం కృషిచేసిన మహానాయకుడు . పదవుల కోసమే కాకుండా సేవ చేయాలనే తపనతో జీవిస్తున్న నాయకుడు నేటి తరానికి ఆదర్శ నాయకుడు గౌరవ శ్రీ పాయాల జంగయ్య గారు.
కుమారులు: శ్రీనివాసరావు - కవిత
కీ. శే. ప్రవీణ్ - సరస్వతి
శ్రీరామ్ దయానంద గారు ది. 27 -05 1949 లో జన్మించినారు. వీరి తల్లిదండ్రులు వెంకటస్వామి- శ్యామలమ్మ గార్లు స్వగ్రామం లక్డారం, పటాన్ చెరువు మండలం, సంగారెడ్డి జిల్లా.
రాజుపేట గ్రామం& మండలం నల్లగొండ జిల్లా వాస్తవ్యులు శంకరయ్య -భద్రమ్మ గార్ల పుత్రిక రాజకుమారి గారితో ది 27- 05-1973 దయానంద గారి వివాహం జరిగినది,
శ్రీరామ్ దయానంద గారు పెరిక జాతి అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తున్న విశిష్ట నాయకుడు,
రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడిగా 2009-2012 వరకు, పెరిక విద్యార్థి వసతిగృహం వసతి గృహం ఖైరతాబాద్ అధ్యక్షుడిగా 2019-2022 వరకు సేవలందించినారు,
వారి హాయంలో హాస్టల్ విద్యార్థులకు 50% రాయితీతో భోజనం ఏర్పాటు చేయనైనది.
విద్యార్థులు పై చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం కోచింగ్ సెంటర్ కు హాస్టల్ నిధులను తీర్మానం ప్రకారం ఖర్చు చేయనైనది. (మహిళ) విద్యార్థిని ల కు హాస్టల్ వసతి కల్పించాలని ధర్మకర్త మండలి లొ తీర్మానం చేసినారు.
హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో పెరిక గర్జన పేరుతో ది 08-04- 2012 లో పెరిక మహాసభ నిర్వహించటం లక్ష మంది పైగా పెరిక కులస్తులు హాజరు కావడం రాష్ట్ర చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. ఆయన నాయకత్వాన్ని సామర్థ్యాన్ని తెలుపుతుంది. క్రమశిక్షణ, శాంతియుతంగా ఆ సభ విజయవంతమైంది. ఈ సభ పెరక కులస్తులలో నూతన ఉత్తేజాన్ని నింపింది, పెరిక జాతి ఉనికిని జాతి పరువు ప్రతిష్టలతో పెంపొందించింది, సంఘటిత శక్తిని దశ దిశల వ్యాపింపజేసింది.
పెరిక కుల చరిత్రలో ఇలాంటి సభ ఎప్పుడు జరగలేదు. మహాసభను విజయవంతంగా నిర్వహింంచి చరిత్రను సృష్టించిన మహా నాయకుడు దయానంద్ గారు.
ఈ మహా సభకు అప్పటి వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ మంత్రివర్యులు బసవరాజు సారయ్య గారు, మన కుల రత్నాలు ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు,ఎమ్మెల్సీ బోడ కుంటి వెంకటేశ్వర్లు గారు,మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య గారు, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ గారు, రాజ్యసభ సభ్యుడు టి దేవేందర్ గౌడ్ గారు, టిఆర్ఎస్ ప్రతిపక్ష నేత ఈటెల్ రాజేందర్ గారు, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు అంజన్ కుమార్ గారు,బిజెపి నేత కే లక్ష్మణ్ గారు, బండారు దత్తాత్రేయ గారు ఇంకా బీసీ సంఘం నాయకులు మన కుల గౌరవ నాయకులు ప్రతి జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి అదిక సంఖ్యలో హాజరైనారు.
శ్రీరామ్ దయానంద గారు మంచి మనసున్న మహా మనిషి చేతనైనంతలో పదిమందికి సహాయం చేయాలని సేవాభావం గల వ్యక్తిత్వం అయినది.
సుమారు 77 సంవత్సరాల వయసులో కూడా పెరిక కుల సంఘం సమావేశాలకు హాజరవుతూ తన సహకారాన్ని అందించటం ఆయన సేవభావానికి నిదర్శనం.
రాష్ట్ర సంఘ నాయకులు శ్రీ మద్దాలింగయ్య గారి సూచన మేరకు పరస్పర సహకార పొదుపు సంఘం స్థాపించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ సభ్యులను చేర్పించటం ఆయన గొప్ప దూరదృష్టం సూచిస్తుంది.
పరపతి సంఘం లో ఇప్పటికీ 1343 మంది సభ్యులుగా చేర్పించి బ్యాంకు నిబంధనలతో నడిపిస్తున్నారు భవిష్యత్తులో పెరికకుల కోఆపరేటివ్ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
దయానంద్ గారి సేవలు పెరిక జాతికి గర్వకారణం.
సమాజ సేవకుడు దూరదృష్టి కలిగిన రాష్ట్ర నాయకుడు, ఆయన ప్రగతిశీలి, ప్రతిభాశాలి తెలంగాణ యాసలో సామాన్యుడి భాష లో తన మృదువైన మాటలతో అందరినీ ఆత్మీయంగా పలకరించే వ్యక్తిత్వం ఆయనది.
మహిళ హాస్టల్ కు శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్న విషయంలో నా కల సాకారం కాబోతుందని సంతోషం వ్యక్తం చేసినారు.
వారికి ముగ్గురు కుమార్తెలు :
1. మాధవి, రమేష్( USA) 2. ప్రశాంతి,దీపక్ (USA) 3. స్మిత, MD రేడియాలజీ, రఘురాం MD గ్యాస్ట్రాలజీ హైదరాబాద్
______________
1. జననం మరియు బాల్యం
జననం :
అచ్చ సత్యనారాయణ గారు 1943 అక్టోబర్ 1న కామారెడ్డి జిల్లా, దోమకొండ గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు :
ఆయన తండ్రి అచ్చ రాజయ్య గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు, తల్లి పేరు లక్ష్మమ్మ.
కుటుంబం :
ఆయన ఐదవ సంతానం. ఆయన సోదరులు అచ్చ బాలరాజు, బాలచంద్రం, రామస్వామి మరియు సోదరి కుంచాల సరస్వతి.
విద్య :
7వ తరగతి చదువుతున్న సమయంలో హైదరాబాద్‌లో స్థిరపడిన తన పెద్దన్నయ్య అచ్చ బాలరాజు గారి ఇంటికి వచ్చి, తన S.S.C విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు.
2. వృత్తి జీవితం
ఉద్యోగం :
విద్యతో పాటు జీవితాన్ని నిర్మించుకోవాలనే సంకల్పంతో పి.డబ్ల్యు.డి.లో రెండేళ్లు సేవలందించారు.
ఆ తర్వాత 1964లో బి.హెచ్.ఈ.ఎల్.లో చేరి, అచంచలమైన కృషి, నిజాయితీ, అంకితభావంతో 35 సంవత్సరాలపాటు సేవలందించారు. తన కర్తవ్యనిష్ఠతో సీనియర్ మేనేజర్ హోదాకు ఎదిగి, 1999లో వి.ఆర్.ఎస్. తీసుకున్నారు.
3. కుటుంబ జీవితం
వివాహం :
1960 మార్చి 18న శ్రీమతి బాలమణి (రుక్మిణి) గారిని వివాహమాడారు.
సంతానం :
శ్రీనివాసరావు (జననం 1964), రఘుకుమార్ (జననం 1967).
ఆదర్శ దాంపత్యం:
1977లో వారి సతీమణి శ్రీమతి బాలమణి గారికి కంటి రెటీనా తీవ్రమైన సమస్య ఏర్పడగా, పడుకున్న పొజిషన్లో (స్ట్రెచ్చర్ మీద) ఫ్లైట్‌లో అలీఘర్ సిటీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ చికిత్స 2000 సంవత్సరం వరకు విజయవంతంగా పనిచేసింది. తిరిగి 2000 సంవత్సరంలో కంటి రెటీనా సమస్య ఏర్పడగా హైదరాబాద్‌లోని ఎల్.వి. ప్రసాద్ కంటి హాస్పిటల్లో చికిత్స చేయించారు. ఆ చికిత్స ఫెయిల్ అయింది. దానితో ఆమె చూపు కోల్పోయింది.
2000 సంవత్సరం నుండి 2020 వరకు శ్రీ సత్యనారాయణ గారు తన శ్రీమతి బాలమణి గారిని అత్యంత జాగ్రత్తగా, శ్రద్ధగా చూసుకున్నారు. భర్తగా వారు నిర్వర్తించిన బాధ్యతలు అత్యంత ఆదర్శనీయమైనవి.
కుటుంబ వారసత్వం
పెద్ద కుమారుడు : అచ్చ శ్రీనివాసరావు గారు
పెద్ద కోడలు : అచ్చ హేమలత గారు
శ్రీనివాసరావు గారు ఎల్.ఐ.సి మార్కెటింగ్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లో కొనసాగారు.
వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు.
కుమారుడు: అచ్చ రాజేష్ కుమార్ గారు
ఐఐఎమ్‌లో ఎంబీఏ పూర్తి చేసుకుని, బోధనపై ఉన్న ఆసక్తితో ఎంబీఏ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
కోడలు: అచ్చ కుసుమ గారు
ప్రముఖ MNC కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
మనవరాలు: అచ్చ మైరా
కుమార్తె: డా॥ ప్రతిభ గారు – గైనకాలజిస్ట్ డాక్టర్‌గా సేవలందిస్తున్నారు.
అల్లుడు: డా॥ వై. మురళి గారు – పల్మనాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.
మనవళ్లు: శ్రేయాస్ మరియు రేయాన్ష్
చిన్న కుమారుడు: అచ్చ రఘు కుమార్ గారు
చిన్న కోడలు: అచ్చ వాణి గారు
వృత్తిరీత్యా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ, 1999లో “Baker’s Q” అనే బేకరీ సంస్థను స్థాపించి, దానికి మేనేజింగ్ పార్ట్నర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా విజయవంతంగా కొనసాగుతున్నారు.
వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు.
కుమారుడు: అచ్చ అన్వేష్ కుమార్ గారు
ఆస్ట్రేలియాలో ఎం.ఎస్. పూర్తి చేసి, ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు.
కోడలు: అచ్చ శ్వేత గారు
బి.టెక్ విద్యాభ్యాసం పూర్తి చేసి, ప్రముఖ యు.కె. ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.
మనవరాలు: అచ్చ నివిక్ష
కుమార్తె: గాండ్ల శ్రావ్య గారు
కంప్యూటర్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసి, కొన్ని సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు
అల్లుడు: గాండ్ల విజ్ఞాన్ కృష్ణ గారు
వీరు అమెరికాలో నివసిస్తూ, అక్కడ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు.
వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
మనవడు: గాండ్ల ఇషాన్ తేజస్
4. జీవితంలోని మూడు ప్రధాన భాగాలు
సత్యనారాయణ గారి 77 సంవత్సరాల జీవితంలో మూడు ప్రధాన భాగాలు - ఒకటి ఉద్యోగము, రెండు కుటుంబము, మూడు పెరిక విద్యార్థి వసతి గృహము.
బి.హెచ్.ఈ.ఎల్.లో 35 సంవత్సరాల పాటు విజయవంతమైన సేవలు చేసి సీనియర్ మేనేజర్‌గా వి.ఆర్.ఎస్. తీసుకున్నారు. కుటుంబ జీవితంలో ఇద్దరు కుమారులను ఉత్తమంగా తీర్చిదిద్దారు. దురదృష్టవశాత్తు కంటి చూపు కోల్పోయిన ధర్మపత్నిని కంటికి రెప్పలా చూసుకున్నారు.
ఆర్థికంగా మంచి స్థితిలో స్థిరపడి, సమాజంలో ఆదర్శప్రాయంగా జీవించారు. చివరిదశ వరకు గౌరవనీయులుగా సమాజ మన్ననలు పొందారు.
అచ్చ సత్యనారాయణ గారి జీవితము సంస్కారవంతమైనది. క్రమశిక్షణ, అంకితభావము, నిస్వార్థ సేవ కలిగిన కర్మయోగి ఆయన.
మూడవ భాగం పెరిక విద్యార్థి వసతి గృహము. పెరిక కులములో పుట్టినందుకు ఆ కులంలో తన పేరు చిరస్థాయిగా ఉండేలా, కులానికి మరియు కుల ఉనికికి తార్కాణమైన వసతి గృహానికి అద్వితీయ సేవలు అందించారు.
5. పెరిక విద్యార్థి వసతి గృహ సేవా ప్రస్థానం
ఆంధ్ర సారస్వత భవన్, హైదరాబాద్‌లో 1972లో పెరిక కుల మహాసభ నిర్వహించారు. ఆ మహాసభలో పెరిక కులానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా, గ్రామాల్లోని ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చి తమ ఉన్నత చదువులు కొనసాగించేందుకు ఒక హాస్టల్‌ను నిర్వహించాలని తీర్మానం చేశారు. ఆ మహాసభలో పాల్గొన్న సత్యనారాయణ గారికి హాస్టల్ ఏర్పాటు చేసే తీర్మానంపై ఆసక్తి కలిగింది. అక్కడ వారికి యర్రంశెట్టి వేణుధర్ గారితో పరిచయం ఏర్పడి, వారి స్నేహం చివరి వరకు కొనసాగింది.
తరువాత 1973లో అచ్చ బాలరాజు మరియు మిగతా 11 మంది వ్యవస్థాపక సభ్యులతో “పెరిక విద్యార్థి వసతి గృహము” అనే సేవా సంస్థ ఆవిర్భవించింది. 1974లో ఖైరతాబాద్‌లో 1250 చ.గ. స్థలంలో ఉన్న భవనాన్ని రూ.2,15,000/-లకు కొనుగోలు చేశారు. 100 మంది ధర్మకర్తలను ఆ సంస్థలోకి చేర్చుకోవాలని, సభ్యత్వ రుసుము రూ.2,151/-గా నిర్ణయించారు. ఎక్కువ మొత్తంలో రూ.5,116/- విరాళం ఇచ్చిన వారిని ధర్మదాతలుగా నిర్ణయించారు.
జిల్లాల్లో సేకరించిన విరాళాలను వసూలు చేయడానికి ఒక యువజన టీంను ఏర్పాటు చేయాలని అప్పటి కుల అధ్యక్షులు నల్లపు పిచ్చయ్య గారు ఆలోచించారు. అందుకు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికే పెరిక విద్యార్థి వసతి గృహం సంస్థ యాక్టివిటీస్‌పై ఆకర్షితులైన సత్యనారాయణ గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు.
ఆ సమావేశంలో మారిశెట్టి నారాయణ గారు వచ్చిన కేవలం 10 మంది యువకులను చూసి, “ఇంకా చాలా మంది వస్తారనుకున్నాను” అని నిరుత్సాహపడ్డారు. వెంటనే సత్యనారాయణ గారు, “మాకు ఒక వారం గడువు ఇవ్వండి. ఇప్పుడు వచ్చిన ఈ 10 మందిమి, ఒక్కొక్కరం ఇంకో 10 మందిని తీసుకొస్తాము” అని వాగ్దానం చేశారు. వారు చేసిన ప్రచార ఫలితంగా తదుపరి సమావేశానికి 200 మంది హాజరయ్యారు.
ఆ సమావేశంలో నారాయణ గారు వసతి గృహ ప్రణాళిక గురించి వివరించి, దానికి సహాయంగా యువజన సంఘాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దానికి అధ్యక్షులుగా అచ్చ సత్యనారాయణ గారిని, ఉపాధ్యక్షులుగా యర్రంశెట్టి వేణుధర్ గారిని నియమించాలనుకుంటున్నామని ప్రకటించగా, వచ్చిన వారందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.
పెద్దలందరూ వివిధ జిల్లాలకు వెళ్లి హాస్టల్ నిర్మాణానికి విరాళాలను రాయించుకుని రాగా, యువజన సంఘ సభ్యులను ఆయా జిల్లాలకు వెళ్లి వాటిని వసూలు చేయమని కోరారు. మొదట యువజన సంఘం హైదరాబాద్‌లోని పెరిక వాడలకు వెళ్లి రూ.11,116/- విరాళాలను సేకరించి నిర్వాహకులకు అందజేశారు.
తరువాత పెరిక యూత్ వింగ్ అధ్యక్షులుగా అచ్చ సత్యనారాయణ గారు మరియు వేణుధర్ గారు సూర్యాపేట జిల్లాకు వెళ్లి, అక్కడ సుందరి కోటయ్య గారి సహాయంతో ధర్మకర్తలుగా వాగ్దానం చేసిన వారి వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. అక్కడి నుండి కోదాడ, జగ్గయ్యపేట ప్రాంతాలకు వెళ్లి నిధులు సేకరించారు. అచ్చ సత్యనారాయణ గారు తమ స్వస్థలమైన నిజామాబాద్‌కు వెళ్లి, అక్కడ దాతలను ట్రస్టీ సభ్యులుగా చేర్చుకుని, వారి నుండి విరాళాలు సేకరించారు.
ఈ విధంగా యువజన సంఘం విరాళాల సేకరణ కోసం జిల్లాలు పర్యటించి రూ.30 వేలకుపైగా సేకరించి తమ వంతు సహకారం అందించారు. 1975 జూన్ 5వ తేదీన హాస్టల్ సిద్ధమైంది. ఎం.ఎల్.సి. పూజారి లింగన్న గారు మరియు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి సమక్షంలో హాస్టల్ ప్రారంభోత్సవం జరిగింది.
ప్రతి ఆదివారం ట్రస్టీ సభ్యులు, ఫౌండర్ మెంబర్లు మరియు యువజన విభాగ సభ్యులకు హాస్టల్ అభివృద్ధి కోసం సమావేశాలు జరుగుతుండేవి. అప్పుడు అచ్చ సత్యనారాయణ గారు “నేను యువజన విభాగం సభ్యుడిగా మాత్రమే ఉండటం ఏంటి, ట్రస్టీ సభ్యుడైతే మేనేజ్మెంట్లో ఉంటూ ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చు” అని భావించి, అచ్చ బాలరాజు గారు మరియు నల్లపు పిచ్చయ్య గారి ప్రసంగాలకు ప్రేరణ పొంది, తాను పనిచేస్తున్న బి.హెచ్.ఈ.ఎల్లో పి.ఎఫ్. లోన్ తీసుకుని 1975లో ట్రస్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు.
1976లో మారిశెట్టి నారాయణ గారు అధ్యక్షులుగా, ఎడ్మ నర్సింహారావు గారు సెక్రటరీగా ఉన్న సమయంలో అచ్చ సత్యనారాయణ గారు జాయింట్ సెక్రటరీగా చేరారు. అప్పటి నుండి ప్రారంభమైన వారి సేవా ప్రస్థానం 1981 నుండి 1991 వరకు ఒక దశాబ్ద కాలం పెరిక కుల వసతి గృహానికి ప్రతి టర్మ్‌లో ఒక్కో మేనేజ్మెంట్ పోస్ట్‌లో (జాయింట్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, అధ్యక్షులు) కొనసాగుతూ విశేష సేవలు అందించారు.
1980లో తన నివాసాన్ని బి.హెచ్.ఈ.ఎల్. టౌన్‌షిప్‌కు మార్చారు. 1984 వరకు అక్కడే ఉండి, ప్రతిరోజూ స్కూటర్‌పై హాస్టల్‌కు వచ్చి సేవలు అందించేవారు.
1990లో ఒకరోజు రాత్రి 2 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో కుమారులు హాస్టల్‌కు వచ్చారు. ఆ సమయంలో హాస్టల్ ఆఫీసులో లెక్కలు వ్రాస్తూ కనిపించిన సత్యనారాయణ గారి అంకితభావం అందరినీ ఆశ్చర్యపరిచింది.
1991లో వసతి గృహము అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి 1995 వరకు కొనసాగారు. వారు అధ్యక్షులుగా ఉన్నప్పటికీ కార్యదర్శి, కోశాధికారి పనులను కూడా తానే చూసుకునేవారు. ఉద్యోగ బాధ్యతల అనంతరం ఎక్కువ సమయాన్ని వసతి గృహ అభివృద్ధికే కేటాయించేవారు.
1981 నుండి 1995 వరకు ఒకటిన్నర దశాబ్ద కాలంలో పెరిక విద్యార్థి వసతి గృహ అభివృద్ధిలో అచ్చ సత్యనారాయణ గారి టీమ్‌లో చింత యలమంద గారు, బొలిశెట్టి వీరయ్య గారు, డాక్టర్ యర్రంశెట్టి వేణుధర్ గారు, డా॥ దొంగరి వెంకటేశ్వర్లు గారు వంటి వారు మంచి నిబద్ధతతో, అంకితభావంతో పనిచేశారు. వసతి గృహ అభివృద్ధికి ఈ సక్సెస్ఫుల్ టీమ్ చేసిన సేవలు చిరస్మరణీయం. అచ్చ సత్యనారాయణ గారు బొలిశెట్టి వీరయ్య గారిని ఎంతో అభిమానించేవారు.
1999-2000లో హాస్టల్ డిస్‌మ్యాంటిల్ అయిన తర్వాత, వసతి గృహ భవన నిర్మాణానికి కొందరు ధర్మకర్తలు చేబదులు (హ్యాండ్ లోన్స్)గా డబ్బు ఇచ్చారు. ఆ క్రమంలో సత్యనారాయణ గారు రూ.2 లక్షల రుణాన్ని అందించారు. అనంతరం అందులో రూ.1.5 లక్షలు మాత్రమే తిరిగి తీసుకుని, మిగిలిన రూ.50,000/-ను తన సతీమణి శ్రీమతి బాలమణి గారి పేరుమీద విరాళంగా సమర్పించారు.
కన్స్ట్రక్షన్కు నిధుల అవసరం ఉందని భావించి, తన కుమారులను కూడా ట్రస్టీ సభ్యులుగా చేరాలని కోరారు. ఆ ప్రకారం 1999 సంవత్సరంలో 172 సీరియల్ నెంబర్‌తో అచ్చ శ్రీనివాసరావు గారు, 173 సీరియల్ నెంబర్‌తో అచ్చ రఘు కుమార్ గారు ట్రస్టీ సభ్యులుగా చేరారు.
2005 నుండి 2007 వరకు మరలా అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత ప్రస్తుత నూతన భవన నిర్మాణం పూర్తయింది. ఆయన ఆధ్వర్యంలోనే 2007 సంవత్సరంలో పెరిక విద్యార్థి వసతి గృహ ధర్మకర్తల డైరెక్టరీని ముద్రించారు.
1995 నుండి 2005 వరకు, తిరిగి 2007 నుండి 2020 వరకు సత్యనారాయణ గారు సలహాదారులుగా వసతి గృహానికి విలువైన సలహాలు ఇస్తూ సేవలు అందించారు.
6. ప్రస్తుత తరాల సేవలు
అచ్చ రఘు కుమార్ గారు చిన్నప్పటి నుంచే తమ తండ్రి సత్యనారాయణ గారితో కలిసి హాస్టల్ పనుల కోసం వెంట వెళ్లేవారు. ఆ సందర్భాల్లో జరిగిన అనుభవాలు, సమాజ సేవకు సంబంధించిన విషయాలను సత్యనారాయణ గారు తమ కుమారులతో పంచుకునేవారు. అలాగే తమ కుమారులను కూడా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేవారు. దాంతో వారి కుమారుల్లో కూడా కుల అభివృద్ధి పట్ల ఆసక్తి, సేవాభావం పెరిగింది.
ఆ ఆసక్తితోనే అచ్చ రఘు కుమార్ గారు ఖైరతాబాద్ హాస్టల్‌కు సంబంధించిన సమావేశాలు, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. జాయింట్ సెక్రటరీగా నరిశెట్టి యాదగిరి గారి అధ్యక్షతలో రఘు కుమార్ గారు చురుకుగా పాల్గొంటూ సంస్థ అభివృద్ధికి సేవలు అందించారు.
2025 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మద్ద లింగయ్య గారు, గటిక విజయ్ కుమార్ గారు, డా॥ దొంగరి వెంకటేశ్వర్లు గారు మరియు వారి కోర్ టీమ్ సభ్యులందరూ అచ్చ రఘు కుమార్ గారిని ఏకగ్రీవంగా ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
దాదాపు మూడున్నర దశాబ్దాలుగా డా॥ దొంగరి వెంకటేశ్వర్లు గారితో ఉన్న సాన్నిహిత్యం, అనుబంధం వల్ల అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శి మధ్య అవసరమైన సమన్వయం సులభంగా కొనసాగుతూ, సంస్థ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయి.
అలాగే “పెరిక ఆత్మ గౌరవ భవనం – కొకాపేట్” స్థాపక ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ అవకాశం కల్పించిన గటిక విజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
కొకాపేట్ భవనం నిర్మాణం ప్రారంభించాలనే నిర్ణయంతో జూబ్లీ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి మద్ద లింగయ్య గారు ఆహ్వానించగా, అచ్చ రఘు కుమార్ గారు వెంటనే సహాయం చేయాలనే ఉద్దేశంతో రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆ నిర్మాణానికి రెండవ దాతగా నిలిచి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
పెరిక కుల సంక్షేమ సమితికి కూడా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
అలాగే పెరిక కో-ఆపరేటివ్ సొసైటీలో కూడా అచ్చ రఘు కుమార్ గారు మరియు వారి ధర్మపత్ని అచ్చ వాణి గారు సభ్యులుగా కొనసాగుతున్నారు.
7. చివరి దశ మరియు చిరస్మరణ
అచ్చ సత్యనారాయణ గారు జూన్ 2020లో స్కూటర్‌పై నుండి పడిపోవడంతో వారి ఆరోగ్య సమస్యలు ప్రారంభమయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా కోవిడ్ బారినపడి, అనంతరం కార్డియాక్ అరెస్ట్ జరిగింది.
తేది: 31.12.2020 రాత్రి 12.45 గంటలకు సత్యనారాయణ గారు తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులకు, ఆప్తులకు మరియు వసతి గృహ ధర్మకర్తలకు విషాదాన్ని మిగిల్చి వెళ్లారు.
అచ్చ సత్యనారాయణ గారి తదనంతరం, వారి సతీమణి శ్రీమతి అచ్చ బాలమణి గారు తమ కుమారులు, కోడళ్లతో కలిసి నివసిస్తున్నారు. చూపు లేకపోయినా, తండ్రి లోటు తెలియనీయకుండా కుమారులు, కోడళ్ళు, మనవళ్లు, మనవరాళ్ల ప్రేమాభిమానాల మధ్య బాలమణి గారు సంతోషంగా జీవనం గడుపుతున్నారు.
శ్రీ అచ్చ సత్యనారాయణ గారి జీవితం క్రమశిక్షణ, అంకితభావం, నిస్వార్థ సేవ, కుటుంబ ప్రేమలకు ప్రతీక. ఆయన జీవన ప్రయాణం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. అలాంటి మహనీయుని స్మృతులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
కీర్తిశేషులు అచ్చ సత్యనారాయణ గారి కుమారుడు అచ్చ రఘుకుమార్ గారి సెల్ నెం. 9246154447
గరిక యాదగిరి గారు రాష్ట్ర పెరిక కుల చరిత్రలో నిలిచిపోయే మహానుభావులలో ఒకరు. తన కృషి, పట్టుదల,సేవ భావంతో సమాజంలో గొప్ప నాయకుడిగా ఎదిగారు. వీరు రామన్నపేట గ్రామం, నల్లగొండ జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు బుచ్చయ్య- లక్ష్మమ్మ గార్లు. ధర్మపత్ని హేమలత గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక కుల సంఘానికి రెండుసార్లు ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. సంఘ అభివృద్ధికి, సంఘాన్ని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టి, జిల్లాలలో పెరిక కుల సంఘ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో నూతన భవన ఖాళీ స్థలం కొనుగోలు విషయంలో ఆయన కృషి చేసినారు. పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ ధర్మకర్తగా, ఉపాధ్యక్షులుగా, విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఎంతో కృషి చేశారు. విద్య సమాజాభివృద్ధికి మార్గమని నమ్మిన నాయకుడు. బీద విద్యార్థులకు సహాయం అందించాలని కార్యక్రమాలు చేసిన నాయకుడు. అనేక సంవత్సరాలు సేవలు అందించి వారి సేవ భావాన్ని చాటుకున్నారు. గరిక యాదగిరి గారు రాజకీయ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉప్పల్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అనేక పదవులు చేసి, ప్రజాసేవకు అంకితమై, మున్సిపల్ చైర్మన్ గా కూడా పోటీ చేసినారు. ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు.
మంచి వ్యక్తిత్వం గల నాయకుడు మాత్రమే కాకుండా సమాజానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు. ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారిచేందుకు కృషిచేసిన నాయకుడుగా గుర్తింపు పొందినారు. వ్యాపార రంగంలో కూడా ప్రతిభను చాటుకొని రాణించినారు. గరిక యాదగిరి గారు ది. 30-11-2017 న హఠాన్మరణం చెందినారు,వారి మరణం రాష్ట్ర కుల సంఘానికి తీరని లోటు. గరిక యాదగిరి వారి ధర్మపత్ని హేమలత గారి పుణ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. కుమారుల పేర్లు శివానంద్, అశ్విన్ గార్లు. కుమార్తెలు ఏడ్మా గంగాభవాని, గరిక భార్గవి గార్లు.
దాసరి మల్లేశం గారు 10-03- 1956 సంవత్సరంలో జన్మించినారు. స్వగ్రామం రాజాపేట మండలం రాజపేట యాదాద్రి భువనగిరి జిల్లా
తల్లిదండ్రులు దాసరి నరసయ్య- పోచమ్మ గార్లు
ధర్మపత్ని : విజయలక్ష్మి
దాసరి మల్లేశం గారు విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన అరుదైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు సమాజసేవ పట్ల దేశభక్తి భావనలు విద్యార్థి దశలోనే పెంపొందాయి రాజపేట హైస్కూల్లో చదువుతున్న సమయంలో ఏబీవీపీ నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆయన నాయకత్వానికి మొదటి అడుగు
రాష్ట్రీయ స్వయంసేవక్ లో 1973 నుంచి చురుకుగా పాల్గొన్న ఆయన 1975 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ కాలంలో అండర్ గ్రౌండ్ లో ఉండి పని చేయడం ద్వారా తన ధైర్య సాహసాలను నిరూపించారు దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన సేవలు విశేషమైనవి
1977 నుండి 1980 వరకు జనతా పార్టీ విభజన విభాగంలో పని చేసినారు బిజెపి లో కీలక బాధ్యతలు చేపట్టి 1986-1990 వరకు బిజెపి కౌన్సిల్ సభ్యుడిగా, 1990-1992 వరకు బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1991 అయోధ్య కారసేన ఉద్యమంలో కేంద్రం ఆహుతి దళములో ఏపీ నుండి పాల్గొన్న ఇద్దరు కార్యకర్తలలో ఒకరుగా ఉన్నారు
1993లో ఎల్కే అద్వాని గారితో హైదరాబాదు నుండి ఒరిస్సా వరకు యాత్రలో పాల్గొన్నారు
1994లో రామన్నపేట నియోజకవర్గ కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రామాండపేట నుండి హైదరాబాదు వరకు పాదయాత్ర చేసినారు
1994లో రామన్నపేట నియోజకవర్గ నుంచి బిజెపి అభ్యర్థిగా ఎమ్మెల్యేకి పోటీ చేయడం ద్వారా ప్రజాసేవ పట్ల తన నిర్భయతను చాటుకున్నారు అదే సంవత్సరంలో త్రాగునీరు సాగునీరు కరువు నివారణ ప్రాజెక్టు కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు చేసినారు, బీసీ కులాల సంఘ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్‌గా పని చేసినారు
ఇతర రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బిజెపి పార్టీ తరఫున ఇన్చార్జిగా వ్యవహరించినారు
2004 రామన్నపేట అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించి నారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం చురుకుగా పాల్గొన్నారు
2010 నుంచి రాష్ట్ర బీజేపీ కార్యాలయం ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసినారు, రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందిస్తూ సామాజిక రంగంలో విశిష్ట పాత్ర పోషించారు
పెరిక కుల సంఘ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి 2012లో జరిగిన పెరిక గర్జన మహాసభp విజయవంతం కావడంలో ఆయన ఎంతగానో కృషి చేసినారు
2003 2006 వరకు పెరిక కుల రాష్ట్ర అధ్యక్షునిగా, 2017 2019 వ సంవత్సరంలో పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ అధ్యక్షునిగా హాస్టల్ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం పెరికకుల సమాజ ఐక్యత కోసం ఆయన చేసిన కృషి అభినందనీయం
విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆయన తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు
శ్రీ దాసరి మల్లేశం గారు క్రమశిక్షణ, సేవా భావం నాయకత్వం ఆయన జీవితంలో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచినారు రాజకీయాల్లోనే కాకుండా పెరిక కుల సామాజిక రంగంలో కూడా ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచేలా ఉన్నాయి
శ్రీ దాసరి మల్లేశం గారు యువత భవిష్యత్తు కోసం కృషిచేసిన మహానాయకుడు
దాసరి మల్లేశం గారికి కుమారుడు: జయప్రకాష్ కుమార్తె : ప్రీతి
దాసరి మల్లేశం గారు సెల్ నెంబర్ 9848022503
తల్లిదండ్రులు మద్ద శ్రీరాములు-శాంత గార్లు స్వగ్రామ దురాజపల్లి, చివ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా. ప్రస్తుతం సూర్యాపేట మున్సిపాలిటీ.
మద్దా లింగన్న గారు పెరిక కుల అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రముఖ నాయకుడు, సమాజంపై అపారమైన అభిమానం కలిగి సంఘాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆయన నాయకత్వంలో పెరిక సంఘం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ సమాజ ఐక్యతను పెంపొందిస్తుంది. పెరిక కుల ఆత్మగౌర భవన స్థలం కోసం ప్రభుత్వం నుండి కోకాపేటలో రెండు ఎకరాల భూమి, రెండు కోట్ల నిధులు మంజూరి సాధించేందుకు గౌరవ కుల నాయకులతో కలిసి కృషి చేసినారు. ఈ ప్రయత్నం పెరిక సమాజంపై ఆయన చూపుతున్న అంకితభావానికి నిదర్శనం. పెరిక కుల పరపతి సంఘం ఆయన సలహాతో ఏర్పాటయి బ్యాంకు నియమాలతో పని చేస్తూ పరపతి సంఘాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. భవిష్యత్తులో పెరిక కుల కో-ఆపరేటివ్ బ్యాంకుగా రూపాంతరం చెందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది సమాజ ఆర్థిక బలోపేతానికి గొప్ప ముందడుగు.
మహిళా అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థిని ల హాస్టల్ కోసం ఎల్బీనగర్ లొ భూమి కొనుగోలు, భూమి పూజ నిర్మాణ కార్యక్రమాలు తన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమ సమితిని ఏర్పాటు చేసి 20 మంది కుల నాయకుల సహకారంతో ఒక కోటి రూపాయలు మూలధనాన్ని సమీకరించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి అతివృష్టితో వరదల వలన ఇబ్బందులు ఎదుర్కొన్న వరద బాధిత కుటుంబాలకు అత్యవసర సహాయం కింద నిత్యవసర సరుకులు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి కార్యక్రమాలు సంఘపరంగా చేస్తున్నారు. ఉప్పల్ ప్రాంతంలో పెరిక హాస్టల్ నిర్మాణం కోసం 968 గజాలు భూమి కొనుగోలు విషయంలో ఆయన తీసుకున్న శ్రమ ఎంతో గొప్పది.
కోకాపేట ఆత్మగౌరవ నిర్మాణాన్ని ఇప్పటివరకు నాలుగు స్లాపులు పూర్తిచేసుకుని ఐదవ స్లాబ్ కి సిద్ధంగా ఉంది, మద్దా లింగన్న గారు, వారి టీమ్ మరియు కుల అభిమానంతో,నమ్మకంతో విరాళాలు ఇచ్చిన దాతల సహకారంతో ఏడు స్లాబులు వరకు వేయాలనే సంకల్పంతో ఉన్నారు ఇది వారి దూర దృష్టికి నిదర్శనం.
మద్దా లింగన్న గారు వ్యాపార రంగంలో కూడా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు వారి తల్లిదండ్రుల పేరుతో శ్రీ శాంతిరాం కన్స్ట్రక్షన్ సంస్థను స్థాపించి తన సోదరుడు నరసయ్య గారితో కలిసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు వేలకోట్ల టర్న్ వర్ తో నడుస్తున్న ఈ సంస్థను చూసుకుంటూనే సమాజ సేవకు సమయం కేటాయించడం ఆయన అంకితభావానికి నిదర్శనం
2012 -2014, 2019 -2022 మరియు 2022 -2025 వరకు సుమారు 8 సంవత్సరాలు పెరికకుల రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా కులాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ తరం యువతకు మార్గదర్శకంగా నిలిచినారు. నిస్వార్ధ సేవ, దూర దృష్టి, నాయకత్వ లక్షణాలు కలిగి సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు మద్దా లింగన్న గారు. ఇలాంటి గొప్ప నాయకుడి సేవలు పెరిక జాతికి స్ఫూర్తిదాయకంగా భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పెరిక సమాజం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము.
35 అనుబంధ సంఘాల సమన్వయంతో సమాజ అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న తెలంగాణ పెరక కుల సంఘం -పెరిక కుల సంఘ చరిత్రలో స్వర్ణ యుగానికి నాంది పలికిన నాయకత్వం పెరిక జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి డాక్టర్ గటిక విజయ్ కుమార్ గారు.
వారు ప్రతీ రోజు కులానికి సమయం కేటాయిస్తూ, ప్రతీ జిల్లాలో కలియ తిరుగుతూ విశేష సేవలు అందిస్తున్న రాష్ట్ర సంఘం అధ్యక్షుడు. రాష్ట్రంలో పెరిక కులాన్ని ఏకతాటిపైకి తెచ్చి నడిపించడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలో నేడు పెరిక కులం పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్న మన నాయకుడుతాను నాయకుడిగా ఉండడమే కాకుండా, అనేక మంది పెరిక బిడ్డలను నాయకులుగా తయారు చేసిన నిజమైన లీడర్. చిన్న వయసులోనే తాను ఎదిగి, పెరిక సమాజాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చిన ధన్యజీవి విజయ్ కుమార్ గారు.
ముఖ్యమంత్రి పిఆర్ఓగా... కోకాపేట ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గా... రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడిగా విజయ్ కుమార్ గారు అందించిన సేవల వల్ల ఈ నాడు తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం ఓ ఆదర్శ కులంగా, అభివృద్ధి చెందుతున్న సంఘంగా, సుపంపన్న సామాజిక వర్గంగా మారుతోంది.
విజయ్ కుమార్ గారి విజన్ వల్ల పెరిక కులం ఎంతో ఎదిగింది. భవిష్యత్తు పట్ల కూడా మనం ఢోకా లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది.
వారి స్వ గ్రామం వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన గటిక విజయ్ కుమార్ గారు 1996లో మొదటి సారి జర్నలిస్టుగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అంచలంచెలుగా ఎదిగి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజా సంబంధాల అధికారి (పిఆర్ఓ) కాగలిగారు. ప్రస్తుతం ఐ న్యూస్ ఛానల్ ఎడిటిరియల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
కుటుంబ వివరాలు:
తల్లి : స్వర్గీయ గటిక సుగుణ గారు (మాజీ జడ్.పి.టి.సి. నెక్కొండ, వరంగల్ జిల్లా)
తండ్రి : గటిక మల్లయ్య గారు (రిటైర్డ్ తెలుగు పండిట్)
భార్య : గటిక అనితాదేవి (ప్రియ) (మాజీ జడ్.పి.టి.సి. నెక్కొండ, వరంగల్ జిల్లా)
అన్న : గటిక అజయ్ కుమార్ (మాజీ ఎంపిపి, నెక్కొండ మరియు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యులు)
చెల్లెలు : గటిక అజిత కుమారి (ఉద్యోగి)
కుమార్తెలు : గటిక మనస్విని (బి టెక్ (సిఎస్ఇ -ఏఐఎంఎల్-సిబిఐటి- బ్యాంక్ ఆఫ్ అమెరికా సాఫ్ట్ వేర్ ఉద్యోగి)
గటిక శ్రీగుణ (ఇంటర్మీడియట్)
విద్యార్హతలు:
పదవ తరగతి : జడ్పీఎస్ఎస్ – నెక్కొండ- వరంగల్ జిల్లా
ఇంటర్మీడియట్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల- హన్మకొండ
డిగ్రీ : ఎల్.బి. కళాశాల, వరంగల్
పి.జి. : ఎంఎ (పొలిటికల్ సైన్స్) – ఉస్మానియా యూనివర్సిటీ
పి.జి. : ఎంఎ (ఎన్విరాన్మెంటల్ సైన్స్) – ఉస్మానియా యూనివర్సిటీ
పి.జి. : ఎంసిజె – తెలుగు విశ్వ విద్యాలయం
ఎల్.ఎల్.బి. : కాకతీయ విశ్వ విద్యాలయం
ఎల్.ఎల్.ఎం : కాకతీయ విశ్వ విద్యాలయం
పి.హెచ్.డి. : తెలుగు (తెలంగాణ ఉద్యమంలో జానపద కళల పాత్ర) – తెలుగు విశ్వ విద్యాలయం
ఉద్యోగ జీవితం :
1996 : నెక్కొండ మండల వార్త విలేకరి
1998 : సబ్ ఎడిటర్- వార్త పత్రిక- సెంట్రల్ డెస్క్
1999 : జెమిని టివి సబ్ ఎడిటర్ & రిపోర్టర్ – చెన్నై
2002 : వార్త స్టాఫ్ రిపోర్టర్ – మహబూబాబాద్
2006 : ఎన్.టి.వి. స్టాఫ్ రిపోర్టర్ – వరంగల్
2008 : ఎబిఎన్ ఆంధ్రజ్యోతి – తెలంగాణ న్యూస్ కో ఆర్డినేటర్
2011 : టి న్యూస్ – స్టేట్ కో ఆర్డినేటర్
2014 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజా సంబంధాల అధికారి
2022 : ఐ న్యూస్ ఛానల్ ఎడిటోరియల్ డైరెక్టర్
రచనలు :
జ్వలిత దీక్ష – తెలంగాణ ఉద్యమంపై నవల
ఉజ్వల ప్రస్థానం : తెలంగాణ పుట్టుక నుంచి నేటి వరకు దాదాపు 2 వేల ఏళ్ల చరిత్రకు సంబంధించిన సమగ్ర సమాచార గ్రంథం.
బంగారుబాట : తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై పుస్తకం
బతుకమ్మ : బతుకమ్మ పండుగ పుట్టు పూర్వోత్తరాలు, పాటల నేపథ్యం, సంప్రదాయంపై పుస్తకం.
అంకితం : తోటి ఉద్యోగుల స్మరణ
విద్యుత్ విజయం : చీకటి రోజుల నుంచి 24 గంటల కరెంటు వరకు తెలంగాణలో సాధించిన విజయాలు
తెలంగాణ కళలు : తెలంగాణలో పుట్టిన వివిధ జానపద కళలు, వాటి ప్రాశస్త్యంపై సంపూర్ణ గ్రంథం.
వివిధ దినపత్రికల్లో 500కు పైగా ఆర్టికల్స్.
పెరిక కులానికి అందించిన సేవలు :
1. కోకాపేటలో రెండు ఎకరాల స్థలం
విజయ్ కుమార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పి.ఆర్.ఓ.గా ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని బిసి కులాలకు హైదరాబాద్ లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించే కార్యక్రమం చేపట్టారు. మొదట పెరిక కులానికి ఉప్పల్ భగాయత్ లో ఒక ఎకరం స్థలం, ఒక కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి. అప్పుడు ముఖ్యమంత్రి గారికి పి.ఆర్.ఓ.గా ఉన్న విజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, నాడు త్రిసభ్య కమిటీ సభ్యులైన మంత్రులు ఈటెల రాజెందర్ గారిని, జోగు రామన్న గారిని, స్పీకర్ మదుసూదన చారి గారిని ఒప్పించి ఎకరం స్థలాన్ని రెండు ఎకరాలకు పెంచించారు. నిధులను కూడా కోటి నుంచి రెండు కోట్లకు పెంచించారు. అంతేకాకుండా ఉప్పల్ భగాయత్ లో కాకుండా పెరిక కులానికి కోకాపేటలో స్థలం ఇప్పించారు. ప్రస్తుతం కోకాపేటలో ఎకరం స్థలం ధర దాదాపు 170 కోట్లు పలుకుతోంది. అంటే పెరిక కులానికి 340 కోట్ల రూపాయల ఆస్తి రావడానికి కారకులయ్యారు గటిక విజయ్ కుమార్ గారు.
2. ఆత్మగౌరవ భవన నిర్మాణం
ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, అత్యంత విలువైన స్థలం సంపాదించుకున్న తర్వాత రాష్ట్ర పెరిక సంఘం క్షణం ఆలస్యం చేయవద్దని నిర్ణయించుకుంది. కులానికి కేటాయించిన స్థలాన్ని కాపాడుకోవాలంటే భవన నిర్మాణం చేయాల్సిందేనని తీర్మానం చేసుకుంది. నాగోల్ లోని జూబ్లీ పార్కు హోటల్ లో 2023 ఏప్రిల్ 7 న కుల పెద్దలతో సమావేశం నిర్ణయించింది. కుల పెద్దల వద్ద నుంచి చందాలు వసూలు చేసి, ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవాలని నిర్ణయించింది. భవన నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని మద్దా లింగయ్య అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర పెరిక సంఘం నిర్ణయించింది. ఖైరతాబాద్ పెరిక భవన్ లో 2023 జూలై 2న సమావేశమైన రాష్ట్ర పెరిక సంఘం కార్యవర్గం గటిక విజయ్ కుమార్ చైర్మన్ గా పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే భవన నిర్మాణం జరగాలని తీర్మానించింది.
3. అంగరంగ వైభవంగా ఆత్మగౌరవ భవన శంకుస్థాపన
విజయ్ కుమార్ గారు ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ అయిన మరుక్షణం నుంచే రంగంలోకి దిగారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే శంఖుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కోకాపేటలో త్వరితగతిన పెరిక కుల ఆత్మగౌరవ భవనం నిర్మించాలనే తలంపుతో అంగరంగ వైభవంగా 2023 ఆగస్టు 27న శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ గంపా గోవర్థన్ అధ్యక్షతన రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రభుత్వ చీఫ్ విఫ్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం భద్రయ్య, బండి పుల్లయ్య, మాజీ జడ్పీ చైర్మన్ చుంచు ఊశన్న, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం, శ్రీరాం దయానంద్, పెరిక హాస్టల్ మాజీ అధ్యక్షులు బొలిశెట్టి వీరయ్య, పాయల జంగయ్య, హాస్టల్ అధ్యక్షుడు అంగిరేకుల నాగార్జున తదితరుల సమక్షంలో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 8 వేల మంది పెరిక కులస్తుల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం, సభ జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి గటిక విజయ్ కుమార్ చేసిన కృషి మాటల్లో వర్ణించలేనిది.
4. శరవేగంగా ఐదు స్లాబుల నిర్మాణం
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని బిసి కులాలకు స్థలాలు కేటాయించినప్పటికీ ఒక్క పెరిక కులం మాత్రమే ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకుంటున్నది. దీని వెనుక ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించిని విజయ్ కుమార్ గారి పాత్ర ఎంతో ఉంది. రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మద్దా లింగయ్య గారితో పాటు ఇతర నాయకులను సమన్వయం చేసుకుని, దాతల నుంచి విరాళాలు సేకరించి, అలుపెరుగని కృషి చేసి నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 2024 జనవరి 18 న బోర్ వేయడం జరిగింది. భవన నిర్మాణానికి ఓపెన్ టెండర్లు పిలిచి, 2024 డిసెంబర్ 20న భవన నిర్మాణం కోసం కాంట్రాక్టర్ తో అగ్రిమెంటు చేసుకున్నారు. 2025 మే 17న మొదటి స్లాబ్ వేసినారు 2025 అక్టోబర్ 10న రెండవ స్లాబ్ వేసినారు. 2026 జవనరి 10న మూడవ స్లాబ్ వేసినారు. 2026 మార్చి 12న నాలుగవ స్లాబ్ వేసినారు, 2026 జూన్ చివరి వారంలో ఐదో స్లాబు వేయటానికి రంగం సిద్ధమయింది.
ఆత్మగౌవర భవన నిర్మాణం విషయంలో, చందాల వసూలు విషయంలో, ప్రభుత్వ అధికారుల నుంచి సహకారం తీసుకునే విషయంలో గటిక విజయ్ కుమార్ గారు విశేష కృషి చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ కుమార్ గారు లేకుంటే మన కులానికి కోకాపేటలో స్థలం లేదు. అక్కడభవనం లేదు. రాష్ట్ర నాయకులందరినీ సమన్వయ చేసుకుంటూ ముందుకుపోతున్నారు. తాను పని చేసి, అందరితో పని తీసుకోవడంలో విజయ్ కుమార్ గారి నాయకత్వం నిజంగా పెరిక కులానికి ఓ వరం.
5. రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా విశేష పాత్ర
తెలంగాణ రాష్ట్ర పెరిక కులం సంఘం అధ్యక్షుడిగా గటిక విజయ్ కుమార్ గారు 2025 అక్టోబర్ 12న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు విరామం, విశ్రాంతి లేకుండా సంఘం కోసం ప్రతీ రోజు పని చేస్తున్నారు. పట్టుదల, అంకితభావంతో పాటు అందరినీ కలుపుకుని పోతూ తెలంగాణ రాష్ట్రంలో పెరిక జాతి గౌరవాన్ని పెంచుతున్నారు.
6. 35 అనుబంధ సంఘాలతో కొత్త చరిత్ర
మరే కులంలో లేని విధంగా విజయ్ కుమార్ గారు పెరిక కుల సంఘానికి అనుబంధంగా 35 సంఘాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ప్రతీ సంఘంలో ఉన్న పెరిక కులస్తులను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
7. పెరిక కుల సమగ్ర సర్వే
ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో పెరిక కులానిది తక్కువ జనాభాగా చూపుతున్నారు. అందుకే రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారు స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెరిక కుల జనాభా లెక్కలు, వారి సామాజిక ఆర్థిక పరిస్థితిపై సర్వే నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఖమ్మం జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు గజవెళ్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో సర్వే జరుపుతున్నారు.
8. ప్రత్యేక లోగో రూపకల్పన
గటిక విజయ్ కుమార్ గారు స్వయంగా చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్ర సంఘానికి అధికారిక లోగోను తయారు చేశారు. తెలంగాణ పెరిక కుల (సంఘం లోగోకు అనేక విశిష్టతలున్నాయి. తెలుగు జానపద సాహిత్యం-కళలపై పరిశోధన చేసి తెలుగు విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ మరియు గోల్డ్ మెడల్ సాధించిన మన పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారు పెరిక కులం మీద కూడా పత్యేక పరిశోధన చేసి, కుల పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. మన కులానికి ఒక తాత్విక, సైద్దాంతిక భూమిక ఉండాలనే లక్ష్యంతో 12 విశిష్ట సూచికలతో అధికారిక చిహ్నం (OFFICIAL LOGO) రూపొందించారు. ఎంతో అధ్యయనం, పరిశోధన ద్వారా పెరిక కుల చరిత్ర, మూలాలు, ఉజ్వల ప్రస్థానం, భవిష్యత్తును సూచించే విధంగా ఈ లోగోను రూపొందించడం జరిగింది. లోగోలో ద్వాదశ (12) సూచికలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. జనపనార చక్ర బంధం, నీలి రంగు బ్యాడ్జి, తెలుపు అక్షరాలలో కుల సంఘం పేరు, త్రిశూలం, కాకతీయ కీర్తి తోరణం, సూర్య కిరణాలు, విద్య – పుస్తకం, ఎడ్ల బండి, రైతు, జనపనార బస్తాలు, వ్యవసాయ క్షేత్రం, ఎరుపురంగులో రిజిస్ట్రేషన్ నంబరు ప్రత్యేకంగా కనిపిస్తాయి.
9. ప్రత్యేక వెబ్ సైట్ రూపకల్పన
పెరిక కుల చరిత్ర, కార్యక్రమాలు అందరికీ తెలిసేలు విజయ్ కుమార్ గారు స్వయంగా వెబ్ సైట్ నడుపుతున్నారు. PERIKA.ORG.IN అనే వెబ్ అడ్రస్ లో ఇప్పుడు మన కులానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంది.
10. నిజమైన సేవకులకు కార్పొరేషన్ పదవులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు అయింది. అయితే ఆ కార్పొరేషన్ కు చైర్మన్, వైస్ చైర్మన్ నిజమైన సేవకులు ఉండాలని విజయ్ కుమార్ గారి నాయకత్వంలోని కమిటీ నిర్ణయించింది. హుజూర్ నగర్ కు చెందిన శ్రీ దొంగరి వెంకటేశ్వర్లు గారి పేరును చైర్మన్ పదవికి, భద్రాచలానికి చెందిన బుడిగం శ్రీనివాస్ గారి పేరును వైస్ చైర్మన్ పదవికి ప్రతిపాదించింది. వారికే పదవులు వచ్చేలా తీర్మానం చేసి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చి కృషిచేసి సాధించడమైనది
11. అన్ని సంఘాలకు సమన్వయ కర్తగా విజయ్ కుమార్
తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా విజయ్ కుమార్ గారు మొత్తం అన్ని పెరిక కుల సంఘాలను సమన్వయం చేస్తున్నారు. పెరిక విద్యార్థి వసతి గృహం, పెరిక కుల పరస్పర సహకార పరపతి సంఘం, ఆత్మగౌరవ భవన కమిటి, పెరిక సంక్షేమ సమితి, వివాహ వేదిక కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతను కూడ విజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నారు.
12. అఖిల భారత పెరిక సంఘం స్థాపనకు కృషి
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా పెరిక కులస్తులున్నారు. అందరినీ ఒకే తాటిపైకి తేవడానికి అఖిల భారత పెరిక కుల సంఘాన్ని ఏర్పాటు చేయాలని విజయ్ కుమార్ గారు, ఇతర
కుల పెద్దలు నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర నాయకులు విజయవాడ వెళ్లి ఆంధ్రప్రదేశ్ నాయకులతో మాట్లాడారు. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక నాయకులతో కూడా మాట్లాడుతున్నారు.
13. బిసి జెఎసి కన్వీనర్ గా ముఖ్యమైన పాత్ర
గటిక విజయ్ కుమార్ తెలంగాణ బిసి జెఎసి కన్వీనర్ గా కూడా చురుకైన పాత్రను పోషిస్తున్నారు. బిసిల హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నారు.
వెంకటేశ్వర్లు గారి తల్లిదండ్రులు : దొంగరి నారాయణ - శాంతమ్మ గార్లు ధర్మపత్ని: రామాబాయి BA
స్వగ్రామం : దోసపాడు, పెన్ పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా
02-10-1963 లో జన్మించినారు
వీరి విద్యాభ్యాసం 1 నుంచి 5 తరగతి వరకు స్వగ్రాము దోసపాడులో,6, 7 తరగతులు అనాజిపురంలో, 8, 9, 10 తరగతులు అనంతారంలో విద్యను అభ్యసించి, 1979లో వారి దగ్గర బంధువైన దొంగరి గోవిందయ్య గారి ప్రోత్సాహంతో హైదరాబాదుకి వచ్చినారు
1979- 81 లో ఇంటర్ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నాంపల్లి లో చదివి 1982లో ఎంసెట్ ర్యాంకులో ఎంబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ,MUHS హెల్త్ సైన్స్ , ఔరంగాబాద్ లో ఎండీ చేసి అనంతరం ఎల్.ఎల్.బి ఉస్మానియా యూనివర్సిటీ ఎల్ఎల్ఎం కాకతీయ యూనివర్సిటీ భారత రాజ్యాంగంపై అభ్యసించినారు అనంతరం ఉదయపూర్ యూనివర్సిటీ నుంచి పీజీ డయాబటాలజి పూర్తి చేయడం వారి నిరంతర విద్యాసాధనకు నిదర్శనం
వైద్య రంగంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక మెడికల్ కాన్ఫరెన్స్ లలో పాల్గొని తన జ్ఞానాన్ని మరింత విస్తరిం
చుకున్నారు
వారు వైద్య సేవల ను ధర్మంగా భావించి 1988లో చింతల బస్తి ఖైరతాబాద్ లో శ్వేతా క్లినిక్ , 1993లో శ్వేతా నర్సింగ్ హోమ్, 2010లో స్వాతి హాస్పిటల్ బంజర హిల్స్ లో వారి సొంత భవనంలో ప్రాక్టీస్ చేస్తున్నారు
1990లో పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ హాస్టల్లో ఉండి చదివి 2116/- రూపాయలు చెల్లించి ధర్మకర్తగా చేరడం వారి సేవా ప్రస్థానానికి నాంది, ఒక విద్యార్థిగా ప్రారంభించిన వారి ప్రయాణం నేడు అధ్యక్షునిగా ఎదిగిన స్థాయి స్ఫూర్తిదాయకం
1991లో 4 పర్యాయాలు( 8 సంవత్సరాలు) జాయింట్ సెక్రటరీగా, 1997 లో కోశాధికారిగా 3 పర్యాయాలు( ఆరు సంవత్సరాలు) జనరల్ సెక్రెటరీగా రెండు పర్యాయాలు (నాలుగు సంవత్సరాలు) గౌరవ అధ్యక్షునిగా రెండు సంవత్సరాలు ఇలా అనేక సంవత్సరాలు పెరిక హాస్టల్ కి సేవలు అందించి సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేసినారు
వారి కృషికి ఫలితంగా పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ ప్రస్తుతం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు
డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారికి
ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు
1. డాక్టర్ శ్వేత ఎంబిబిఎస్, MS, MCH పెడియాట్రిక్ సర్జరీ, ఉస్మానియామెడికల్ కాలేజీ
2. డాక్టర్ స్వాతి ఎంబిబిఎస్, ఎంఎస్, జనరల్ సర్జరీ గాంధీ మెడికల్ కాలేజీ3. శృతి - బి ఆర్కిటెక్చర్ యం ఆర్కిటెక్చర్ JNFU చదివి కెనడాలో స్థిరపడినారు
4. కుమారుడు దొంగరి సాయికిరణ్ MA ఎకనామిక్స్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్, LLB, LLM ( ఓయూ) కార్పొరేట్ ల
తమ ఇద్దరి కూతుర్ల ను డాక్టర్లుగా ఒక కూతుర్ని ఆర్కిటెక్చర్ లో ఉన్నత చదువులు చదివించి కుమారుని లాయర్ గా ఉన్నత విద్యలు చదివించి సమాజానికి ఉపయోగపడే స్థాయికి తీసుకెళ్లడం వారి దూర దృష్టి, విద్య పట్ల ఉన్న విశ్వాసానికి గొప్ప ఉదాహరణ
పెరిక హాస్టల్లో చదువుకొనె విద్యార్థులు కూడా విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సంకల్పంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు
సేవ చేయాలనే తపన ఉంటే సాధారణ వ్యక్తి కూడా సమాజంలో గొప్ప స్థానం సంపాదించగలరని వారి ప్రస్థానం నిరూపించింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక రంగాలలో ప్రజాసేవకు చిరస్మరణీయ ముద్రవేసిన నాయకుల్లో శ్రీ చుంచు ఊషన్న గారు ఒకరు. పదవులు అధిష్ఠించిన నాయకుడిగా మాత్రమే కాకుండా, గ్రామీణాభివృద్ధి, రైతాంగ సంక్షేమం, సామాజిక చైతన్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ముఖ్యంగా పెరిక కుల ఐక్యత కోసం నిరంతరంగా కృషి చేసిన ప్రజానాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో APRIC Ltd కార్పొరేషన్ చైర్మన్‌గా, అలాగే మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా ప్రజా సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకొని ఆయన నిర్వహించిన బాధ్యతలు నేటికీ ప్రజల మదిలో నిలిచిపోయాయి.
శ్రీ చుంచు ఊషన్న గారి తల్లిదండ్రులు: కీర్తిశేషులు శ్రీ చుంచు రామయ్య గారు, శ్రీమతి గొంతెమ్మ గార్ల దంపతులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, లక్షెట్టిపేట తాలూకాలోని కన్నెపల్లి గ్రామంలో జన్మించారు. సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ, చిన్ననాటి నుంచే సమాజం పట్ల చైతన్య భావం, నాయకత్వ లక్షణాలు ఆయనలో కనిపించేవి. లక్షెట్టిపేటలో హైస్కూల్ విద్యను పూర్తిచేసి, అనంతరం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ పట్టాను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఆయన బాబాయి గారైన శ్రీ చుంచు లక్ష్మయ్య గారు పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ప్రజా జీవితంలో చురుకైన పాత్ర పోషించడం ఆయనపై విశేష ప్రభావం చూపింది. 1978 సంవత్సరంలో శ్రీ చుంచు లక్ష్మయ్య గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం కుటుంబంలో రాజకీయ చైతన్యానికి మరింత బలాన్ని ఇచ్చింది.
1975లో దేశవ్యాప్తంగా అమలైన ఎమర్జెన్సీ కాలంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజాస్వామ్య హక్కుల హరణపై ఆయన లోతైన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాలంలో నవ సంఘర్షణ సమితి, సమ సంఘర్షణ సమితి ద్వారా పంపిణీ చేయబడిన కరపత్రాలను ప్రజల్లో పంచుతూ సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు గ్రామాల వారీగా తిరిగి ప్రజలను జాగృతం చేయడం జరిగింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాస్వామ్య పరిరక్షకుడు జయప్రకాశ్ నారాయణ్ గారి ఆశయ సాధన కోసం ఆయన అంకితభావంతో పనిచేశారు.
ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు గారు పెరిక కుల విద్యార్థి వసతిగృహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భం ఊషన్న గారి జీవితంలో మరో కీలక మలుపుగా నిలిచింది. ఆ రోజు నుండి నేటి వరకు పెరిక కుల విద్యార్థి వసతిగృహ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం, అలాగే పెరిక కుల ఐక్యత సాధన కోసం ఆయన నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు.
1982 మే 27న కన్నెపల్లి గ్రామ సర్పంచ్‌గా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన శ్రీ ఊషన్న గారు కేవలం రెండు సంవత్సరాలలోనే గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారు. అదే సంవత్సరం జూలైలో తాలూకా కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికై, వందలాది మంది రైతులకు బావులు తవ్వుకోవడానికి, మోటార్లు ఏర్పాటు చేసుకోవడానికి, ట్రాక్టర్లు కొనుగోలు చేసుకోవడానికి రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు.
1983లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం ఆ పార్టీలో చేరి ప్రజా రాజకీయాల్లో చురుకైన పాత్రను ప్రారంభించారు. 1987 మార్చి 15న దండేపల్లి మండలం నుండి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా దొరల ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ ఘన విజయం సాధించారు. అదే సంవత్సరం జూన్ 22న ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అనంతరం 1991 జూన్ 1న ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశారు.
1993లో ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఊషన్న గారికి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, వ్యక్తిగత ఆశయాల కంటే పార్టీ విజయానికే ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో అపూర్వమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు.
1995 జూలై 24న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో APRIC Ltd కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన ఆయన, తన పరిపాలనా నైపుణ్యంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. 1997 డిసెంబర్ 16న కడెం ప్రాజెక్టు నెంబర్-2 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌గా ఎన్నికై, ఆనాటి చీఫ్ ఇంజనీర్ సాన మారుతి గారు మరియు వరల్డ్ బ్యాంక్ సీఈఓ రేమండ్ పీటర్ గారి సహకారంతో రూ.20 కోట్ల నిధులను మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిధులతో కెనాల్ లైనింగ్ పనులు, తూముల మరమ్మత్తులు చేపట్టి ఆ ప్రాంత రైతాంగానికి అపార మేలు చేకూర్చారు.
రాజకీయాలకు పరిమితం కాకుండా, హిల్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను కొనసాగిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్ర పెరిక కుల సంఘం నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చిన ఆయన, నేటికీ పెరిక సమాజ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. మంచిర్యాల ప్రాంతంలో పెరిక జనాభా అధికంగా ఉన్నప్పటికీ, రాజకీయ విభేదాల కారణంగా కుల ఐక్యత దెబ్బతింటోందన్న ఆవేదన ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలలో విభజన కారణంగా సమాజ శక్తి బలహీనపడుతుండటంపై విచారం వ్యక్తం చేస్తూనే, ఒకరోజు పెరిక కులంలో ఐక్యత తప్పక వస్తుందని ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.
శ్రీ చుంచు ఊషన్న గారి జీవితం కేవలం రాజకీయ నాయకుడి ప్రయాణం మాత్రమే కాదు; అది ప్రజాసేవ, సామాజిక చైతన్యం, రైతు సంక్షేమం, విద్యాభివృద్ధి మరియు సామాజిక ఐక్యత కోసం అంకితమైన ఒక మహోన్నత జీవనగాథ. ఆయన సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శకంగా నిలిచిపోతాయి
తల్లిదండ్రులు : దొంగరి వెంకమ్మ - రామయ్య - గార్లు
స్వగ్రామo: కరక్కాయల గూడెం మండలం : హుజూర్ నగర్
జిల్లా : సూర్యాపేట
శ్రీ దొంగరి వెంకటేశ్వర్లు గారు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూన్నారు , నాలుగు దశాబ్దాలుగా ప్రజాసేవ మరియు రాజకీయ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్నారు.
రాజకీయ ప్రస్థానం
* 1985–1995 : కరక్కాయలగూడెం గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు.
* 1995–2001 : కరక్కాయలగూడెం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్‌గా పనిచేశారు.
* 1995–1997 : హుజూర్నగర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
* 2001–2012 : రెండు పర్యాయాలు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు.
* 2005–2010 : ఉమ్మడి నల్లగొండ జిల్లా ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.
* 2012–2014 : హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా రైతు సంక్షేమానికి కృషి చేశారు.
* 2019 : బూరుగడ్డ గ్రామ పీఏసీఎస్ చైర్మన్‌గా, అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ డైరెక్టర్‌గా పనిచేశారు.
* 2023 నుండి : తెలంగాణ పీసీసీ ప్రతినిధిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
పెరిక కుల సంఘానికి సేవలు
* తెలంగాణ రాష్ట్ర పెరికకుల సంఘం గౌరవ సలహాదారుగా సేవలందిస్తున్నారు.
* పెరిక హాస్టల్, ఖైరతాబాద్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
* సూర్యాపేట జిల్లా పెరిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
* మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పెరిక నిత్య అన్నదాన సత్రం వ్యవస్థాపక అధ్యక్షుడిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రజాసేవే లక్ష్యం
హుజూర్నగర్ ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర్లు గారు పేర్కొన్నారు.
సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయడాన్ని తన ధ్యేయంగా కొనసాగించారు. ప్రజలతో మమేకమై, వారి విశ్వాసాన్ని సంపాదించిన ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, తెలంగాణ రాష్ట్ర పెరికకుల సహకార సంఘం కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది.
ప్రభుత్వం ద్వారా పెరకకుల కార్పొరేషన్ కు కేటాయించి నిధులను పెరిక సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం చేసుకుంటున్న కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత అందజేసి వారి జీవనోపాధిని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపినారు
స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించటం చిన్న వ్యాపారాలను ప్రోత్సహించటం యువత మరియు మహిళలను ఆర్థికంగా సాధికారత దిశగా నడిపించడం ద్వారా పేదరిక నిర్మూలకు కృషి చేయటమె తన లక్ష్యమని పెరిక సమాజంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలా పారదర్శకంగా సమర్థవంతంగా పనిచేస్తూ పెరిక సమాజా నిర్మాణానికి అంకితభావంతో సేవలు అందిస్తానని శ్రీ దొంగరి వెంకటేశ్వర్లు గారు తెలియజేసినారు
ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి పెరిక కుల కోపరేటివ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి,కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, రాష్ట్ర పెరక కుల సంఘ నాయకత్వానికి మరియు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ దొంగరి వెంకటేశ్వర్లు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
“ప్రజాసేవే పరమావధిగా, పెరిక సమాజ అభ్యున్నతే లక్ష్యంగా మరింత అంకితభావంతో పనిచేస్తాను” అని ఆయన పేర్కొన్నారు.
దొంగరి వెంకటేశ్వర్లు గారి (DV)
సెల్ నెంబర్ 9848822751
తల్లిదండ్రులు : బుడగం చిన్న వీరయ్య- ఇందిరా గార్లు
స్వగ్రామం :యానంబైలు మండలం: పాలవంచ
జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం
స్థిర నివాసం : భద్రాచలం
రాజకీయ రంగంలో ప్రజాసేవనే పరమావధిగా భావించి కాంగ్రెస్ పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతరంగా సేవలందించిన నాయకులలో శ్రీ బుడగం శ్రీనివాస్ గారు ఒకరు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయడం, పెరిక సమాజ అభివృద్ధికి అంకితభావంతో సేవలందించడం ద్వారా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.
రాజకీయ ప్రస్థానం
శ్రీ బుడగం శ్రీనివాస్ గారు సుమారు 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ భద్రాచలం ప్రాంత ప్రజలకు సుపరిచితులు కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆయన సేవలను గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారు.
కేంద్ర ప్రభుత్వ బోర్డు సభ్యునిగా
భారత ప్రభుత్వం నియమించిన సెంట్రల్ ఫార్మాస్యూటికల్ అడ్వైజరీ బోర్డు సభ్యునిగా 2010–2013 మధ్య కాలంలో సేవలందించారు. దేశవ్యాప్తంగా కేవలం 11 మంది సభ్యులతో ఈ బోర్డు ఏర్పడగా, వారిలో ఒకరిగా ఎంపిక కావడం ఆయనకు దక్కిన విశిష్ట గౌరవం. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి ఈ అవకాశం పొందిన అరుదైన ప్రతినిధుల్లో ఒకరిగా ఆయన నిలిచారు. ఈ పదవి ద్వారా జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు
శ్రీనివాస్ గారు భద్రాచలం శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తూ పార్టీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశారు.
2015 నుండి 2018 వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా వ్యవహరించి నారు
ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్న వ్యాపారస్తులకు మొదటి ప్రాధాన్యతగా ఇచ్చి వారి కుటుంబాలు ఆర్థికంగా బలాపేతం చేయడానికి సహకరిస్తానని తెలియజేసినారు
పెరిక కుల కోఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి,కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పెరిక కుల సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాని తెలిపినారు
బుడగం శ్రీనివాస్ గారి సెల్ నెంబర్ 9949799777
సేకరణ: గజ్జవెల్లి సత్యనారాయణ గ్రంథకర్త,
పెరిక కుల సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర కోఆర్డినేటర్
సెల్ నెంబర్ 8374612237
పెరిక జాతి సామాజిక, విద్యా, సాంస్కృతిక పునరుజ్జీవనానికి తమ జీవితాన్ని ధారపోసిన మహనీయులలో కీర్తిశేషులు బోడపుంటి పాపయ్య గారు ఒకరు. హైదరాబాద్ నగరంలోని రామకోటి ప్రాంతాన్ని తమ నివాసస్థలంగా చేసుకున్న వీరు, ఆ కాలంలోనే ఉన్నత విద్యను అభ్యసించి బి.కాం., ఎల్.ఎల్.బి. పట్టాలు పొందిన విద్యాసంపన్నులు, మేధావులు.
ఆనాటి సమాజ పరిస్థితుల్లో పెరిక జాతి అనేక ప్రాంతాలలో చెల్లాచెదురై, విభిన్న పరిస్థితులలో జీవిస్తున్నదని గుర్తించిన పాపయ్య గారు, వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతా భావంతో సంఘటితం చేయాలని సంకల్పించారు. జాతి అభ్యున్నతికి సంఘటిత శక్తియే మూలాధారమని విశ్వసించి, సమాజ శ్రేయస్సు కోసం తన సమయాన్ని, ప్రతిభను, శక్తిని అంకితం చేసిన దూరదృష్టి కలిగిన సంఘసేవకులు.
పెరిక సమాజంలో విద్యావంతుల సంఖ్య స్వల్పంగా ఉండటమే అభివృద్ధికి ప్రధాన కారణం అని ఆయన భావించారు. నిరక్షరాస్యత తొలగి విద్యా జ్యోతి ప్రతి ఇంట వెలిగిన నాడే పెరిక జాతి అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలబడగలదనే అచంచల విశ్వాసంతో విద్యా వ్యాప్తికి విశేష కృషి చేశారు. ప్రభుత్వ వర్గాలలో తనకున్న పరిచయాలను, పలుకుబడిని వినియోగించి అనేక మంది విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలలో ప్రవేశాలు కనిపించడం, స్కాలర్షిప్లు మంజూరు చేయించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి సేవలను నిస్వార్థంగా అందించారు.
వెనుకబడిన వర్గాల అభ్యున్నతే తన జీవిత పరమావధిగా భావించిన పాపయ్య గారు, సమాజ సేవకు అపారమైన సమయాన్ని వెచ్చించారు. పెరిక జాతి విద్యాభివృద్ధి కోసం సమకాలీన నాయకులతో కలిసి పెరిక విద్యార్థి వసతిగృహం స్థాపించాలని మహోన్నత సంకల్పంతో కృషి చేశారు. అయితే ఆర్థిక వనరుల కొరత కారణంగా ఆ ఆశయం నెరవేరలేదు అయినప్పటికీ, వారి సంకల్పబలం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
పెరిక జాతికి విశిష్టమైన చారిత్రక నేపథ్యం, పురాణ ప్రాశస్త్యం ఉన్నదని గ్రహించిన పాపయ్య గారు, ఆ చరిత్రను సమాజానికి అందించాలనే లక్ష్యంతో కృషి చేశారు. ప్రముఖ హరికథా విద్వాంసులు బేలే వీర రాఘవయ్య గారు మరియు మరికొంతమంది పెద్దల సహకారంతో “మలహార విజయం” అనే గ్రంథాన్ని హరికథా కావ్య రూపంలో రూపొందించేందుకు విశేషంగా శ్రమించారు. ఆ గ్రంథ రచన, సంపాదకత్వం, ముద్రణ కార్యక్రమాలలో శక్తివంచన లేకుండా కృషి చేసి, గ్రంథ పరిపూర్ణతకు అమూల్యమైన సేవలందించారు.
సంఘసేవా దృక్పథంతో పాటు ఆధ్యాత్మిక చింతన పట్ల అపారమైన ఆసక్తి కలిగిన పాపయ్య గారు దైవభక్తి, సాత్విక జీవన విధానం, విద్యాభిమానం, సమాజాభివృద్ధి పట్ల అంకితభావానికి ప్రతీకగా నిలిచారు. వారి జీవితం నిస్వార్థ సేవకు, సమాజ శ్రేయస్సుకు, జాతి చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది.
పెరిక జాతి భావితరాలకు విద్యా ప్రాముఖ్యతను, ఐక్యత అవసరాన్ని, సామాజిక చైతన్యాన్ని చాటిచెప్పిన మహనీయుడిగా కీర్తిశేషులు బోడపుంటి పాపయ్య గారు చిరస్మరణీయులు. వారి సేవలు పెరిక జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి.
“విద్యా వికాసమే జాతి ప్రగతికి పునాది, ఐక్యతే సమాజ బలమని విశ్వసించి జీవితాంతం సేవ చేసిన మహనీయుడు కీర్తిశేషులు బోడపుంటి పాపయ్య గారు.”
కీర్తిశేషులు పనాస నారాయణ గారు నిజాం రాష్ట్ర కేంద్ర పెరిక సంఘ స్థాపకులుగా చిరస్మరణీయులు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సికింద్రాబాద్ నివాసి అయిన ఆయన ఆ కాలంలోనే ఉన్నత విద్యను అభ్యసించి, అనేక విషయాలలో పాండిత్యం సంపాదించిన విశిష్ట వ్యక్తి. సంగీతం, సాహిత్యం పట్ల అపారమైన అభిరుచి కలిగి, హరికథా ప్రవచనంలో ప్రావీణ్యం పొందిన సాహితీవేత్తగా పేరు గాంచారు.
పెరిక జాతి చరిత్ర, సంప్రదాయాలను వెలికితీయాలనే సంకల్పంతో పురాణాలను పరిశోధించి, జాతి చరిత్రను హరికథ రూపంలో ప్రజలకు అందించాలనే మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టిన మూలపురుషుడు పనాస నారాయణ గారు,ఆయన కోరిక మేరకు పెరిక జాతి వైభవాన్ని ప్రతిబింబించే “మలహార విజయం” అనే గ్రంథాన్ని రచించి, హరికథ రూపంలో గానం చేయడం ద్వారా జాతి చైతన్యానికి బాటలు వేశారు.
చారిత్రకంగా గొప్ప వారసత్వం కలిగిన పెరిక జాతి కాలానుగుణ పరిస్థితుల వల్ల తమ సంప్రదాయ వృత్తులను విడిచిపెట్టి ఇతర జీవనోపాధులలో ప్రవేశించడంతో అనేక ప్రాంతాలలో పెరిక జాతి చెదిరిపోయింది. ఫలితంగా సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో వెనుకబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని గమనించిన పనాస నారాయణ గారు ఇంకా కొంతమంది పెరిక సంఘ మహనీయులు చెదిరిపోయిన పెరిక సమాజాన్ని తిరిగి సంఘటితం చేసి, నవ సమాజంలో గుర్తింపు పొందేలా చేయాలనే లక్ష్యంతో కృషి చేశారు.
పెరిక జాతి అభ్యున్నతి కోసం పూర్వం నుంచే పలువురు మహనీయులు శ్రమించినప్పటికీ, వారిలో ప్రముఖ స్థానాన్ని సంపాదించిన నాయకుడు కీర్తిశేషులు పనాస నారాయణ గారు,ఆయన చేసిన సాహిత్య, సామాజిక సేవలు పెరిక జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
శ్రీ యల్. పి. పూజారి గారు తన స్వరాష్ట్రాన్ని విడిచి మరొక రాష్ట్రంలో స్థిరపడినప్పటికీ, మానవత్వం, స్నేహభావం, సామాజిక సేవా దృక్పథంతో ఆ ప్రాంత ప్రజల అభిమానాన్ని సంపాదించి, ఒక నాయకునిగా ఎదిగిన విశిష్ట వ్యక్తిత్వం గల వారు. తన జాతికి, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువచ్చే వ్యక్తులలో శ్రీ యల్. పి. పూజారి గారు ఒకరని చెప్పవచ్చు. తమ వ్యక్తిత్వం, సేవా భావం మరియు సామాజిక బాధ్యతతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తిగా నిలిచారు.
లింగన్న పుట్టన్న పూజారి గారు 1929 సంవత్సరంలో తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా దోమకొండ గ్రామం నుండి బొంబాయికి వెళ్లారు. అనంతరం 1946 సంవత్సరంలో రాజకీయాలలో ప్రవేశించి ప్రజాసేవకు అంకితమయ్యారు. 1968–69 సంవత్సరాలలో బొంబాయి అభివృద్ధి సంస్థ చైర్మన్ గా (Improvement Chairman) బాధ్యతలు నిర్వహించారు. 1972 సంవత్సరంలో బొంబాయి కార్పొరేషన్ ద్వారా MLCగా ఎన్నికయ్యారు. 1974 నుండి A.I.C.C. సభ్యునిగా కొనసాగారు. అదేవిధంగా బొంబాయి ప్రదేశ్ కాంగ్రెస్ Vice Presidentగా కూడా సేవలందించారు.
బొంబాయిలోని కామాటిపురo ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు శ్రామికుల సంక్షేమం కోసం వారికి అండగా ఉండి సహాయ సహకారాలు అందించి వారి జీవితాలు ఎదుగుదలకు శ్రీ పూజారి గారు విశేష కృషి చేశారు. అనుక్షణం పరితపిస్తూ దారిద్ర్య జీవితం గడుపుతున్న తెలుగు సోదరుల సంక్షేమం కోసం ఎన్నో విధాలుగా సహకరించారు. శ్రీ పూజారి గారు చదువు కున్నా అనుభవ జ్ఞానం మరియు లోకజ్ఞానతో ఐదు భాషల్లో చక్కగా మాట్లాడగల నేర్పరి
శ్రీ యల్. పి. పూజారి గారు జాతీయ సముద్ర నౌకా కార్మికుల సంఘం ( National Seaman Union )కు 15 సంవత్సరాలపాటు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ హోదాలో అనేక ముఖ్యమైన విదేశీ పర్యటనలు కూడా చేశారు.
“ఏ దేశ మేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అన్న భావనతో మరాఠీ ప్రాంతంలో నివసించినప్పటికీ, తెలుగు భాష మరియు మాతృభాషాభిమానాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తెలుగు సంస్కృతి, భావజాలం మరియు విద్యా అభివృద్ధి పట్ల ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. భాగ్యనగరంలో విద్యార్థుల వసతి సౌకర్యాల అభివృద్ధికి సంబంధించి పెరిక విద్యార్థి వసతి గృహం ఖైరతాబాద్ ప్రారంభోత్సవానికి నిర్వహించిన కార్యక్రమాలలో అధ్యక్షులుగా వ్యవహరించారు
విద్యార్థుల గ్రంథాలయ సహాయార్థం నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఆ రోజుల్లో ఒకే రోజులో రూ. 10,000/- విరాళం అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సమాజ ప్రయోజనాల కోసం తన వంతు సహకారం అందించడంలో ఆయన ముందుండేవారు.
శ్రీ పూజారి లింగన్న గారు
పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ సహజమైన స్నేహభావాన్ని అలవరుచుకున్న వ్యక్తిగా యల్. పి. పూజారి గారు గుర్తింపు పొందారు. వీరి ఇంటిపేరు “పూజారి”, వ్యక్తిగత పేరు “లింగన్న” అయినప్పటికీ, ఈ రెండింటి కలయికతో “L.P. పూజారి”గా ప్రసిద్ధి చెందారు.
సామాజిక సేవ, రాజకీయ ప్రస్థానం, తెలుగు భాషాభిమానం మరియు విద్యార్థుల సంక్షేమం పట్ల చూపిన ఆసక్తి ద్వారా శ్రీ యల్. పి. పూజారి గారు సమాజంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే వ్యక్తిగా నిలిచారు
స్వర్గీయ ఎల్ పి పూజారి గారు తన సేవా తత్పరం నాయకత్వం సామాజిక నిబద్ధతతో స్ఫూర్తి ప్రదాత భావితరాలకు మార్గదర్శకo గా చిరస్థాయిగా నిలిచిపోతారు
సూచిక : ఈ జీవిత చరిత్ర డాక్టర్ చింతల రాజేశ్వరరావు గారు రచించిన గ్రంథం, మరియు ఇంటర్నేషనల్ తెలుగు ఆర్ట్స్ వారు ప్రచురించిన 'మల్లె పందిరి' గ్రంథంలోని వివరాల ఆధారంగా రూపొందించడమైనది
వీరు 20 -09- 1956లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామం లో జన్మించినారు.తల్లిదండ్రులు కీ.శే. కోటయ్య- రంగమ్మ గార్ల
వివాహము:02-04-1983
సహ ధర్మ చారిని శ్రీమతి పద్మావతి
ప్రాథమిక విద్య 1973 వరకు స్వగ్రామమైన నంబూరులో అభ్యసించినారు అనంతరం 1974- 79 వరకు గుంటూరులోని హిందూ కళాశాల లో ఉన్నత విద్యను అభ్యసించినారు
వారు చిన్ననాటి నుండి విద్య పట్ల ఆసక్తి క్రమశిక్షణ,సామాజిక స్పృహ కలిగి ఉండేవారు వారు గ్రామీణ ప్రాంతం వాతావరణoలో పెరిగిన గాని విద్యా ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే లక్ష్యంతో కృషి చేసినారు
1979- 81 మధ్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినారు
1983 నుండి 1986 వరకు నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసినారు
1987లో డాక్టరేట్ పట్టా పొందినారు.
అదే సంవత్సరంలో నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు వారు డాక్టర్ రాజేశ్వర రావు గారికి ఆయన విద్యా ప్రతిభను గుర్తించి గోల్డ్ మెడల్ ప్రధాన చేసినారు
అలాగే నల్లగొండ జిల్లా స్వసంఘీయు లు కులపతి బిరుదుని ప్రధానం చేసి సత్కరించినారు.
డాక్టర్ చింతల రాజేశ్వరరావు గారు 1984లో విజయవాడ గవర్నర్ పేటలో సప్తగిరి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు,అనంతరం సి ఆర్ రెడ్డి అటానమిక్ కళాశాల ఏలూరు నుంచి 2017 లో పదవి విరమణ చేసినారు.
వారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విశేష కృషి చేసినారు.
వారు విద్యారంగం సేవలతో పాటు సాహిత్య రంగంలో, వివిధ పత్రికలలో వ్యాసాలు గేయాలు కథలు రచించారు రేడియో ప్రసంగాలు అనేక సాంస్కృతిక ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించినారు
ప్రత్యేకంగా పెరిక కుల చరిత్ర పరిశోధన సంస్కృతిక సామాజిక స్థితిగతులపై లోతైన అధ్యయనం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పెరిక కులం వారి సాంఘిక సంస్కృతిక జీవన సమీక్ష అనే విశిష్ట గ్రంధాన్ని రచించి 1988లో ఆవిష్కరించారు, ఆ గ్రంథంలో పెరిక కులo వారి పుట్టు పూర్వోత్తరాలు,ప్రాచీన అర్వాచీన యుగాలలో వారి స్థానం పెరిక అనే పదం అర్థం, సరుకుల రవాణా వాణిజ్య రంగాల్లో వారి పాత్ర,సాంస్కృతిక సేవలు, ఆవాస ప్రాంతాలు, సాంఘిక ఆచారాలు వంటి అంశాలను వంటి వి చేర్చి భావితరాలకు అందించడం ద్వారా సమాజ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు.
అలాగే చాణిక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విశాఖ సామరాజ్య పాలకుల కాలంలో పెరికవారు పోషించిన చారిత్రాత్మక పాత్రను ఆధారాలతో వివరించి పెరిక జాతి చరిత్రకు వెలుగునిచ్చారు
ఆయన రచించిన ఈ సిద్ధాంత గ్రంథం పెరిక కులo పై పరిశోధన చేసి నాగార్జున యూనివర్సిటీ కి సమర్పించి పిహెచ్డి, & బంగారు పతకం పొందినారు, పెరిక కులం పై మొట్టమొదటిసారిగా ఈ గ్రంథం రచించబడినది.
మొత్తం ఐదు గ్రంధాలు రచించినారు.
వారు సుమారు 40 అవార్డులు సన్మానాలు అందుకున్నారు అందులో సరస్వతి జ్ఞాన పీఠిక అవార్డు, ఇందిరా ప్రియదర్శిని జాతీయ అవార్డు, విద్యా పోషన్ జాతీయ అవార్డు, గురుదేవోభవ అవార్డు, స్వర్ణ పథక గ్రహీత అవార్డు మొదలగునవి పొందినారు.
డాక్టర్ చింతల రాజేశ్వరరావు గారు విద్యావేత్తగా, పరిశోధకులుగా, రచయితగా, ఉపన్యాసుడిగా, సంఘ సేవకుడిగా విశిష్ట కీర్తిని సంపాదించినారు వారి సేవలు పెరిక సమాజ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.
డాక్టర్ రాజేశ్వర రావు గారి అభిలాష : సంఘ సేవ...
వారు ఉద్యోగ బాధ్యతతో పాటు సమాజాభివృద్ధికి కృషి చేసినారు
నిరాడంబరత, క్రమశిక్షణ, పరిశోధన దృక్పథం,సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి
వారు విద్యార్థులకు ఆదర్శప్రాయ అధ్యాపకుడిగా సమాజానికి మార్గదర్శక నిలిచారు
విద్య ద్వారా వ్యక్తిని ఉన్నతుడిగా చేస్తుంది- చరిత్ర సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది- సమాజసేవ మన జీవితానికి పరమార్ధాన్ని కల్పిస్తుంది అనే భావనతో వారి జీవితం కొనసాగింది
డాక్టర్ చింతల రాజేశ్వరరావు గారు విద్య, చరిత్ర,సామాజిక చైతన్యం రంగాలలో సమాజాన్ని ప్రేరేపించినారు .
తల్లిదండ్రులు: మదనయ్య- మదనమ్మ గార్లు
ది. 04-08-1953 లో జన్మించినాki.
ఉమ్మడి రాష్ట్ర పెరక కుల సంఘానికి అసోసియేట్ ప్రెసిడెంట్,ఉపాధ్యక్షుడిగా, సంయుక్త కార్యదర్శిగా వివిధ బాధ్యతల ను నిర్వహిస్తూ పెరిక సమాజానికి విశేష సేవలు అందించినారు
వారు కోకాపేట ఆత్మగౌరవ భవన స్థలo మంజూరు కొరకు విశేష కృషి చేసినారు
ముద్దసాని కనకయ్య గారు 18 సంవత్సరాల పాటు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా సమర్థవంతంగా సేవలందించినారు వారి నాయకత్వంలో బ్యాంక్ అభివృద్ధి పథంలో సాగి ఆర్థికంగా బలో పేతమైంది, బ్యాంకుకు శాశ్వత గుర్తింపుగా నిలిచే విధంగా ఆధునిక సౌకర్యాలతో అర్బన్ బ్యాంక్ భవన నిర్మాణాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేయించినారు, అనంతరం అప్పటి కలెక్టర్, ఎమ్మెల్యే,ఎంపీలు మంత్రి వర్యులు అధికారుల సమక్షంలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి బ్యాంకు ప్రతిష్టను పెంచినారు
ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఆయన కృషి చిరస్మరణీయమైనది
కరీంనగర్ పెరిక కుల విద్యార్థి వసతి గృహం నకు సలహాదారునిగా చేసి పేద విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించడంలో కృషి చేసినారు జగిత్యాల బ్రాంచ్ అర్బన్ బ్యాంకు అధ్యక్షునిగా చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వరకు సమాజాన్ని సంఘటితం చేసినారు
అర్బన్ బ్యాంక్ రాష్ట్ర అసోసియేషన్ సహాయ కార్యదర్శిగా అఖిలభారత అర్బన్ బ్యాంక్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా ఆర్థిక రంగంలో ప్రజలకు సేవలు అందించినారు
కరీంనగర్ గృహ నిర్మాణ సహకార సంఘంలో డైరెక్టర్ గా కార్యదర్శిగా, అధ్యక్షులుగా రెండుసార్లు చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు
1977లో మచిలీపట్నం ప్రాంతంలో ఉప్పెన సంభవించి ప్రజలు నిరాశ్రయులైనప్పుడు అప్పటి శాసనస మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారితో కలిసి బాధితులకు చీరలు,నిత్యవసర సరుకులు పంపిణీ చేసి తన మానవత్వాన్ని చాటిచెప్పారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన తరగతుల విభాగానికి ఇంచార్జ్ కన్వీనర్ గా చేసి బీసీల హక్కుల కోసం కృషి చేసినారు
1969 లో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు శిక్ష అనుభవించినారు
1974 -75 కాలంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా యువజన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు
దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో మీసా చట్టం కింద అరెస్టై సుమారు 20 నెలలు జైలు జీవితం గడిపినారు అయినా ధైర్యం తగ్గలేదు, సిద్ధాంతo మారలేదు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తగ్గలేదు
మరియు కనకయ్య గారు వెనుకబడిన తరగతుల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం, ఫీజుల రద్దు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కోసం ఇలా ఎన్నో పోరాటాలు చేసినారు
ప్రజల కోసం పనిచేయాలని స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం జీవించాలని చూపించారు
ముద్దసాని కనకయ్య గారి సేవలు, త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి, ధైర్యసహసాలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వారికి ఘాన నివాళులర్పిస్తున్నాము