తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని పెరిక భవన్ పెరిక కులస్తుల ఐక్యతకు, ప్రగతికి ఓ సంకేతంగా నిలుస్తున్నది. పట్టణానికి చెందిన పెరిక కుల పెద్దలు శ్రీ పోకల మనోహర్ గారు, శ్రీ పోకల రాజమోహన్ గారు, శ్రీ వనపర్తి శేఖరయ్య గారు మొదట ఈ భవన నిర్మాణానికి పూనుకున్నారు. నాటి క్రీడాశాఖ మంత్రి, అచ్చంపేట ఎమ్మెల్యే శ్రీ పి. రాములు గారు తన సిడిఎఫ్ నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించారు. తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు గారు కూడా తన సిడిఎఫ్ నుంచి 9 లక్షల రూపాయలు కేటాయించారు. దీంతో భవన నిర్మాణం పూర్తయింది. 2004లో భవనం ప్రారంభం అయింది. రాములు గారితో పాటు నాటి ఎంపి శ్రీ బోడకుంటి వెంకటేశ్వర్లు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవనానికి ఫ్లోరింగ్ వేయడం, రంగులు వేయడం లాంటి ఇతర కార్యక్రమాల కోసం పట్టణానికి చెందిన సాదె రాజు 2 లక్షల రూపాయలు, బెక్కం గోపాల్ రెండు లక్షలు అందించారు.