తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
హైదరాబాద్ మహానగరంకి వచ్చి దిక్కుతోచని సందర్భంలో తన అక్కున చేర్చుకొని
అలసట వచ్చిన వారికి ఆసటగా బాసటగా
ఆకలిని తీర్చిన అమ్మగా
వారి అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తుకు బాటలు వేయడంలో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘానికి ఐకానిక్ గా నిలిచిన మహోన్నత దేవాలయం,
చిన్నతనంలో అమ్మ గోరుముద్దలు పెడుతూ చందమామని చూపిస్తూ కడుపునిండా అన్నం పెట్టి ఆనందపడితే,
ఖైరతాబాద్ హాస్టల్ మాత్రం
పెరిక విద్యార్థులకు భవిష్యత్తును చూపిస్తూ కడుపునిండా అన్నం వడ్డించింది ఆనందించింది,
దాని ప్రతిఫలమే చట్టసభల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గంప గోవర్ధన్ గారు నేడు హాస్టల్ అధ్యక్షులుగా ఉన్న దొంగరి వెంకటేశ్వర్లుగారు,
ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ ఒడిలో సేద తీరిన బిడ్డలు ఎందరో
జడ్జీలు, న్యాయవాదులు, పోలీసులు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, విద్యావంతులు, టీచర్లు ,
అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులకు తన రంగు నద్ది విజయ తిలకం దిద్దింది..
పెరిక సమాజానికి ప్రేమను పంచే అమ్మగా...
అనునిత్యం కొత్త చిగురు తొడిగే కొమ్మగా...
మన ముందు సాక్షాత్కరిస్తుంది,
పెరిక విద్యార్థి వసతి గృహం 51 వ వార్షికోత్సవం సందర్భంగా..
PVVG మేనేజింగ్ అధ్యక్షుడు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లుగారు,
ప్రధాన కార్యదర్శి అచ్చ రఘుకుమార్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంకతి విజయ్ కుమార్ గారు, కోశాధికారి బాల్దురి రవికుమార్ గారు ఆధ్వర్యంలో జరిగింది,
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు డాక్టర్ ఘటిక విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ పెరిక కులం యొక్క ఔన్నత్యాన్ని, శక్తిని పెరక కులం యొక్క కార్య దక్షతని , పెరిక కులం యొక్క భవిష్యత్తు కార్యాచరణని బుక్కతిప్పుకోకుండా అనర్గళంగా 30 నిమిషాల పాటు ప్రస్తావించడం ప్రశంసనీయం, బత్తిని పరమేష్ గారు, గుండు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ఖైరతాబాద్ హాస్టల్లో పూర్వ విద్యార్థులుగా ఉంటూ చదువుకోబట్టే విజయాలను చేరుకోగలిగము అని,హాస్టల్ లేకపోతే తమ జీవితం లేదని ప్రస్తావించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అతిరథ మహారధులు పాల్గొని ప్రస్తావించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు, డైనమిక్ లీడర్ దాసరి మల్లేశం గారు, శ్రీరామ్ దయానంద్ గారు, సుంకరి ఆనంద్ గారు, దొంగరి మనోహర్ గారు, ధనియాకుల కృష్ణ గారు, పాయిల్ జంగయ్య గారు, కోకాపెట భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీర భాస్కర్ గారు, వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, బొలిశెట్టి సతీష్ గారు, దొంగరి శంకర్ గారు, దిడ్డి సురేష్ గారు, మైలారిశెట్టి చైతన్య గారు, గ్రేటర్ హైదరాబాద్ టీం, ఎల్బీనగర్ టీం, రంగారెడ్డి టీం, ధర్మకర్తలు, విద్యార్థులు, తదితరులు పాల్గొనడం జరిగింది..
బాలికల వసతి గృహ నిర్మాణం త్వరగా పూర్తి అయ్యేలా యుద్ధ ప్రాతిపదికన పనులు
జూన్ - 2027 నుండి బాలికల వసతి గృహం ప్రారంభమయ్యేలా ప్రణాళిక
బాలికల విద్య, భద్రతకు అధిక ప్రాధాన్యత
నిర్మాణంపై వసతి గృహ,రాష్ట్ర సంఘ ముఖ్యుల ప్రత్యేక సమీక్షా సమావేశం
ఖైరతాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్ లో నిర్మాణంలో ఉన్న బాలికల వసతి గృహ పనులు శరవేగంగా పూర్తి చేసి 2027 జూన్ నెల నుండి హైదరాబాదులో చదువుకునే పెరిక కుల బాలికల వసతి కల్పించడం ప్రారంభించాలని, అందుకు ఇప్పటినుండే పనులు వేగవంతం చేయాలని వసతి గృహ, రాష్ట్ర సంఘ ముఖ్యులు సమావేశమై నిర్ణయించారు.
2026 సెప్టెంబర్ 17న ఖైరతాబాద్ వసతి గృహంలో వసతి గృహ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు ఘటిక విజయ్ కుమార్ గారు ముఖ్య అతిధిగా జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు, వసతి గృహ గౌరవ అధ్యక్షులు శ్రీరాం దయానంద్ గారు, ప్రధాన కార్యదర్శి అచ్చా రఘు కుమార్ గారు, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు, పెరికకుల సంక్షేమ సమితి కోశాధికారి బోడకుంటి ప్రకాష్ గారు బాలికల వసతి గృహ బిల్డర్ తో సమీక్షా సమావేశంo నిర్వహించారు.
2027 జూన్ నుండి బాలికల వసతి గృహం అందుబాటులోకి
నిర్మాణాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేసి 2027 జూన్‌లో బాలికల వసతి గృహాన్ని ప్రారంభించేందుకు నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని బిల్డర్ కు నాయకులు సూచించారు.
బాలికల వసతి గృహం ఇప్పటివరకు మూడు ఫ్లోర్ల నిర్మాణం పూర్తి చేసుకోగా, జరిగిన పనులపై సమావేశంలో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఐదు అంతస్తుల నిర్మాణంలో
గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో నాలుగు అంతస్తులు నిర్మించాలని నిర్ణయించి, గ్రౌండ్ ఫ్లోర్ మినహా ప్రతి అంతస్తులో 8 గదులు, ప్రతి గదిలో ముగ్గురు విద్యార్థినులకు వసతి కల్పించాలని నిర్ణయించి బిల్డర్‌కు అందుకు సూచనలు అందించారు.
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత
ప్రతి అంతస్తులో బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, భద్రత, అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చేలా నిర్మాణం చేపట్టాలని బిల్డర్‌కు స్పష్టమైన సూచనలు చేశారు.
24 గంటల విద్యుత్ సౌకర్యం
విద్యార్థినుల చదువు,భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అంతరాయం కలగకుండా 24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరాలో ఎప్పుడైనా అంతరాయం ఎదురైనా నిరంతర జనరేటర్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బాలికలకు ఇబ్బందులు తలెత్తకుండా లిఫ్ట్ సౌకర్యం, ప్రతీ ఫ్లోర్లో తగినన్ని టాయిలెట్లు, బాత్ రూమ్ లు నిర్మాణం చేపట్టాలని బిల్డర్ సూచించారు.
నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి
వేగంతో పాటు నిర్మాణ నాణ్యతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, భవనం దీర్ఘకాలం ఉపయోగపడేలా పటిష్టంగా నిర్మాణం ఉండాలని, నిర్మాణం విషయంలో రాజు పడవద్దు అని బిల్డర్ కు ఆదేశాలు అందించారు.
పెరిక కుల ఆడబిడ్డల ఉన్నత విద్యే మా సంకల్పం
ఈ సందర్భంగా వసతి గృహ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర సంఘ అధ్యక్షులు గటిక విజయకుమార్ గారు మాట్లాడుతూ ఇది ఒక భవనం కాదని,
వందలాది పెరిక కుల ఆడబిడ్డల భవిష్యత్తుకు ఒక బలమైన పునాది అని, బాలికల విద్యే అభివృద్ధికి మార్గం అవుతుందని, పెరిక సమాజంలోని ఆడబిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు ఈ వసతి గృహం ఒక ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి నిలయంగా నిలవాలన్నదే మా సంకల్పమని అన్నారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి 2027 జూన్ నెల నుండి బాలికల వసతి గృహన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.