తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన కందుల సంధ్యారాణి 2026 మే నెలలో నియామకమయ్యారు. శ్రీమతి కందుల సంధ్యారాణి గారిని రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ మరియు సంఘ పెద్దలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేస్తూ సమాజ సేవలో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు, పి వి వి జి అధ్యక్షులు డా. దొంగరి వెంకటేశ్వర్లు గారు, మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం గారు, నిర్మాణ కమిటీ అధ్యక్షులు సుందరి వీర భాస్కర్ గారు మరియు కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.