తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం - పాలకవర్గం
తక్కువ శాతం వడ్డీ కే సాధారణ రుణ సదుపాయం
విద్యా, వైద్యం, వివాహ లోన్ రుణం 3లక్షల కు పెంపు.
సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే సహించేదిలేదు
సుమారు పది తీర్మానాలను సభ్యుల హర్షద్వానాల మధ్యన ఆమోదించిన సొసైటీ.
హైదరాబాద్ :
పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరపతి సంఘం లి. సర్వసభ్య సమావేశం హైదరాబాద్ కొత్తపేట లోని సాయి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లొ ఆదివారం (21-01-24) విజయవంతంగా జరిగింది. హైదరాబాద్ డిస్టిక్ కో-ఆపరేటివ్ సొసైటీస్ జిల్లా అధికారుల పర్యవేక్షణ లొ జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి సంఘ అధ్యక్షులు అందె శ్రీనివాసరావు సభాధ్యక్షత వహించగా ప్రధాన కార్యదర్శి సుంకరి ఆనంద్ ప్రధాన కార్యదర్శి నివేదిక , మరియు కోశాధికారి వలిశెట్టి లక్ష్మీశేఖర్ అందుబాటులో లేనందున ఆర్ధిక నివేదిక సమర్పించారు.
సొసైటీకి కొద్ది రోజుల క్రితం నూతన కార్యవర్గం ఏర్పాటైన విషయం మీకు తెలిసిందే, ఆ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య,విశిష్ట అతిదిగా కోకాపేట పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులుగా పెరిక విద్యార్థి వసతి గృహం మాజీ అధ్యక్షులు పాయిలి జంగయ్య, శ్రీరాం దయానంద్, గ్రేటర్ హైదరాబాద్ పెరిక కుల సంఘం అధ్యక్షులు బత్తిని పరమేష్,డైరెక్టర్లు అంకతి విజయ్ కుమార్, బంధు శ్రీధర్ బాబు, మార్త వేణు గోపాల్, సందేల లింగం వలిశెట్టి అశోక్,గోపతి కేశవులు, బూసి గంగా సాగర్, కీత విజయ్ కుమార్,తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం ముఖ్య సలహాదారులు చుంచు ఊషన్న హాజరయ్యారు.
పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరపతి సంఘం లి. లొ అవినీతి అక్రమాలు జరిగాయని కొందరు సభ్యులు రిజిస్టర్ కో - ఆపరేటివ్ ఆఫీసర్ మరియు కమిషనర్ కో-ఆపరేటివ్ సొసైటీస్ అధికారులకు ఫిర్యాదు చేసిన పలు అంశాలపై విచారణ జరిపిన అధికారులు నివేదికను సమర్పించారు, అట్టి నివేదికను హాజరైన అందరి సభ్యులకు జిరాక్స్ కాపీ ప్రతులను అందించారు.
సర్వసభ్య సమావేశంలో విశిష్ట అతిథిగా విచ్చేసిన కోకాపేట పెరిక కుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ వారు చేసిన ఆరోపణలను దానికి సొసైటీ అధికారులు ఇచ్చిన వివరణను చదివి సభ్యులకు వివరించారు.
కేవలం సంఘ పాలకమండలి కార్యవర్గం నియామకాలు, కార్యక్రమాలు సొసైటీస్ నియమావళి ప్రకారం కొంత ఆలస్యం జరిగాయని ఆర్థిక అంశాలలో ఎటువంటి అక్రమాలు జరగలేదని, సంఘ సభ్యుల ఆర్థిక శ్రేయస్సుకోసం మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కోపరేటివ్ సొసైటీస్ అధికారులు నివేదికలు ఇచ్చారు, అంతేకాకుండా పెరిక కుల పరస్పర సహాయ సహకార పొదుపు మరియు పరపతి సంఘం పాలకమండలి పని తీరుపై హర్షం వ్యక్తం చేశారు
ఈ సర్వసభ్య సమావేశంలో సభ్యుల సలహాలు, సూచనలు తీసుకున్నారు ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య మాట్లాడుతూ 1200 సభ్యులతో కూడుకున్న ఈ సంఘం పైన మరియు సంఘ కార్యవర్గం పైన అసత్య ఆరోపణలు, అనుచిత వాక్యలు, వ్యక్తి గత దూషనలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన సభ్యులపై క్రమశిక్షణ, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సూచించగా సభ లొ పాల్గొన్న సభ్యులు అందరూ ఏకిభవించారు.
శ్రీరాం విజయపాల్.ఇండ్ల చంద్రశేఖర్, డాక్టర్ బోలిశెట్టి సతీష్, మాడిశెట్టి శ్రీధర్, బుద్దె సుదర్శన్, చుంచు ఉషన్న, తదితరులు సంఘానికి సంఘీభావం తెలిపారు.
ఈ సమావేశంలో పెరిక హాస్టల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దిడ్డి సురేష్, రాష్ట్ర పెఱిక సంఘం అధికార ప్రతినిధి,ఏల్ బి నగర్ జోన్ పెరిక కుల సంఘం అధ్యక్షులు సుందరి వీర భాస్కర్, ఆత్మ గౌరవ భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల బాలరాజ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షలు గాండ్ల రాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అచ్చ రఘు కుమార్, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షడు దొంగరి శంకర్,దిడ్డి బాలయ్య, దాసరి జయ ప్రకాష్, మాడిశెట్టి శ్రీధర్, అరెపూరి సత్యం,రామినేని వెంకటేశ్వర్లు, బాల్తు శ్రీనివాస్, పత్తిపాక వరప్రసాద్, సంధ్యాల వినోద్ తో పాటు వివిధ జిల్లాలలో నుండి సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.