బెడద సత్యనారాయణ గారి దాతృత్వం
పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి మరో లక్ష విరాళం
మూడు లక్షలకు చేరిన సత్యానారాయణ గారి విరాళం
పంచాయితీ రాజ్ శాఖలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేసిన బెడద సత్యనారాయణ గారు కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తన వంతు సాయంగా గతంలోనే 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇందులో ఇప్పటికే రెండు లక్షల రూపాయల విరాళం అందించారు. ఈరోజు (8-7-25న) మరో లక్ష రూపాయలను సంఘం బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేశారు.
ఆత్మగౌరవ భవన నిర్మాణం కోసం విరాళాల సేకరణ ప్రారంభించిన తొలినాళ్లలోనే బెడద సత్యానారాయణ గారు ముందుకు వచ్చి 5 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా భవన నిర్మాణానికి ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు.
సత్యనారాయణ గారి దాతృత్వానికి పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దా లింగయ్య, ఆత్మగౌరవ భవన కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, మరియు వారి కార్యవర్గాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి.