తెలంగాణ రాష్ట్రం
రి. నెం. 766/2014
తెలంగాణ పెరిక కుల సంఘం లోగోను 2026 ఫిబ్రవరి 2న ఖైరతాబాద్ లో జరిగిన పెరిక విద్యార్థి వసతి గృహం 51వ వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారు, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య గారు, రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షులు దాసరి మల్లేశం గారు, శ్రీరాం దయానంద్ గారు, పెరిక సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పాయిల జంగయ్య గారు, పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు, పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ సుందరి వీరభాస్కర్ గారు, పరపతి సంఘం అధ్యక్షులు అందె శ్రీనివాస్ గారు, పెరిక సంక్షేమ సమితి అద్యక్షులు బత్తిని పరమేశ్ గారు, రాష్ట్ర సంఘం అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ గారు, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ గారు, కోశాధికారి సందెల లింగం గారు, అధికార ప్రతినిథి దొంగరి శంకర్ గారు, పెరిక విద్యార్థి వసతిగృహం ప్రధాన కార్యదర్శి అచ్చ రఘు కుమార్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంకతి విజయ్ కుమార్ గారు, కోశాధికారి బాల్దురి రవి కుమార్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ బొలిశెట్టి సతీష్ గారు, గౌరవ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి గోపతి రాజేశ్ గారు, యువజన విభాగం గౌరవ అధ్యక్షుడు మైలారుశెట్టి చైతన్య గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామినేని వెంకటేశ్వర్లు గారు, ఇండ్ల వాసు గారు, ఎల్. బి.నగర్ అధ్యక్షులు బుద్దె వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి ముత్తినేని వెంకటేశ్వర్లు గారు, అడ్వకేట్స్ విభాగం కో ఆర్డినేటర్ జూకూరి మహేశ్ గారు, కల్చరల్ విభాగం కో ఆర్డినేటర్ ఎగ్గడి శ్రీనివాస్ గారు, సీనియర్ అడ్వకేట్ తిరుపతి గారు, నీనియర్ నాయకులు పురాలశెట్టి శేషయ్య గారు, పెరిక విద్యార్థి మాజీ ప్రధాన కార్యదర్శి దిడ్డి సరేష్ గారు, నాయకులు దనేకుల కృష్ణ గారు, బాల్తు శ్రీనివాస్ గారు, భూలోకరావు గారు, ఎర్రంశెట్టి రవీందర్ గారు, రజనీకాంత్ గారు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పెరిక కుల సంఘం లోగోకు అనేక విశిష్టతలున్నాయి. తెలుగు జానపద సాహిత్యం-కళలపై పరిశోధన చేసి తెలుగు విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ మరియు గోల్డ్ మెడల్ సాధించిన మన పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ గారు పెరిక కులం మీద కూడా పత్యేక పరిశోధన చేసి, కుల పెద్దలతో విస్తృత చర్చలు జరిపారు. మన కులానికి ఒక తాత్విక, సైద్దాంతిక భూమిక ఉండాలనే లక్ష్యంతో 12 విశిష్ట సూచికలతో అధికారిక చిహ్నం (OFFICIAL LOGO) రూపొందించారు. ఎంతో అధ్యయనం, పరిశోధన ద్వారా పెరిక కుల చరిత్ర, మూలాలు, ఉజ్వల ప్రస్థానం, భవిష్యత్తును సూచించే విధంగా ఈ లోగోను రూపొందించడం జరిగింది. లోగోలో ద్వాదశ (12) సూచికలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కూర్పును విపులంగా తెలుసుకుందాం.
పెరిక కుల వృత్తి జనపనారతో ముడి వేసుకుంది. జనపనారతో చేసిన తాళ్లు, బోరాలు, బస్తాలు చాలా దృఢంగా ఉంటాయి. ఎంత బరువైనా మోయగలవు. అదే బలమైన బంధం మన కులస్తులను కలిపి ఉంచుతుందనే నమ్మకంతో మన కులానికి జనపనార తాడు రక్షగా ఉంటుందని లోగోకు ఈ జనపనార చక్రబంధం ఇవ్వడం జరిగింది. సహజ నార పర్యావరణ హితమైనది. దీనిని సంచులు, తాళ్ళు, వస్త్రాలు, గృహాలంకరణ వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా జనపనార సంచుల తయారీని ప్రోత్సహించాలనేది పర్యావరణ హితుల పిలుపు. కాబట్టి భవిష్యత్తులో మళ్లీ జనపనార ఉత్పత్తులకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయి. జనపనార గతమే కాదు, భవిష్యత్తు కూడా.
నీలి రంగు ఆకాశానికి, సముద్రానికి సూచిక. భారతదేశంలో నీలి రంగు అణగారిన వర్గాల సామాజిక విప్లవోద్యమానికి సూచిక. ఇది సామాజిక సమానత్వం మరియు పీడిత కులాల విముక్తి పోరాటానికి ఈ రంగు చిహ్నం. నీలం రంగు అంబేద్కర్ లోతైన ఆశయాలకు, ఆకాశమంత అవకాశాలకు, అందరికీ సమానమైన హక్కులకు చిహ్నం. ఇది అగ్రకుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, పీడిత వర్గాల తిరుగుబాటు, ఆత్మగౌరవం మరియు విద్య ద్వారా సాధించే ఉన్నత జీవితాన్ని సూచిస్తుంది. పెరిక కులస్తులు కూడా తాము ఎదుగుతూ, తమ తోటి అణగారిన వర్గాల అభ్యున్నతికి, అంతిమంగా సామాజిక న్యాయ సాధనకు కృషి చేయాలనే సంకల్పం కలిగిన వారు అని చెప్పడానికి నీలి రంగు బ్యాడ్జిని పెట్టుకోవడం జరిగింది.
స్వచ్ఛత, శాంతి, పవిత్రత, ప్రశాంతతకు తెలుపు రంగు చిహ్నం. పెరిక కులానికుండే ఈ లక్షణాలకు చిహ్నంగా కుల సంఘం పేరుకు తెలుపు రంగును వాడడం జరిగింది. తెలుపు రంగు రాజీకి కూడా చిహ్నం. ఎంతటి ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ, అవసరమైన పక్షంలో శాంతి కుదుర్చుకోవడానికి, సామరస్యంతో జీవించడానికి పెరిక కులస్తులు సిద్ధంగా ఉంటారనడానికి ఈ రంగునే కుల రంగుగా వాడడం జరిగింది.
త్రిశూలానికి దైవ సంబంధముంది. వీరత్వానికి చిహ్నం. శివుడి ఆయుధం. క్షత్రియుల అస్త్రం.
ముఖ్యంగా శివుడి ఆయుధంగా హిందువులు చూస్తారు. పెరిక కులస్తులు ఎక్కువగా శివారాధకులు, శైవ వంశస్తులు, మల్లు కుటుంబీకులు అని చెబుతారు. వీరుల లక్షణాలు కలిగిన వారు కాబట్టి పురగిరి క్ష్రత్రియులు అనే పేరు కూడా వచ్చింది. త్రిశూలం శివుడి ఆయుధమే కాకుండా, క్షత్రియుల ఆయుధం కూడా.
త్రిశూలంలో ఉండే మూడు బిందువులకు ఇతిహాసాలలో, పురాణాలలో, సాహిత్యంలో, చరిత్రలో, యుద్ధంలో, జీవితంలో వేర్వేరు అర్థాలను చెప్పారు. ప్రధానంగా సత్వ(సత్యం) , రజస్ (క్రియాశీలత) మరియు తమస్ (అజ్ఞానం) గుణాలకు చిహ్నంగా చెబుతారు.
సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం - గతం, వర్తమానం మరియు భవిష్యత్తు-
శరీరం, మనస్సు మరియు ఆత్మ- ధర్మం, చట్టం మరియు పద్థతి- కరుణ, ఆనందం మరియు ప్రేమ... ఇలా చాలా గుణాలకు ఈ త్రిశూలం ఓ చిహ్నమని చెబుతారు.
దైవ సంబంధ కార్యక్రమాల్లో త్రిశూలాన్ని వాడినట్లే, యుద్ద సమయంలో కూడా త్రిశూల వ్యూహాలు బాగా ప్రాచుర్యం పొందాయి.
పెరిక కులస్తులు కూడా త్రిముఖ వ్యూహాలతో, పదునైన ఆలోచనలతో దూసుకుపోవాలనే ఆశయంతో త్రిశూలాన్ని లోగోలో పెట్టడం జరిగింది.
దక్షిణ భారతదేశంలో కాకతీయులు సువిశాలమైన సామ్రాజ్యం నిర్మించారు. వారి కాలంలో పేదరికాన్ని అంతం చేయగలిగారు. చెరువులు, వ్యవసాయంతో పంటలు పండించారు. మత్స్య సంపద పెంచారు. అన్నింటికి మించి సమాజంలో సామాజిక సమానత్వం సాధించారు. స్వయం పరిపాలనకు, సుభిక్షానికి, సుసంపన్నానికి చిహ్నంగా ఓరుగల్లు కేంద్రం పాలించిన కాకతీయులు వెయ్యేళ్ల క్రితం ఈ కీర్తి తోరణాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రాంతంలో ఏ వర్గమైనా సరే, ఈ కీర్తి తోరణాన్ని స్పూర్తిగా తీసుకుని రాణించాలనే లక్ష్యం కలిగి ఉంటారు. అందుకే తెలంగాణ పెరిక సంఘం కూడా కాకతీయులు చూపిన దారిలో ప్రయాణించాలనే ఆశయం కలిగి ఉంది.
సూర్య కిరణాలు ప్రధాన శక్తి వనరు. భూమిపై సమస్త జీవకోటికి ఆధారం సూర్యుడే. మనిషి ఆరాధించిన మొదటి దేవుడు కూడా సూర్యుడు. ఆద్మాత్మిక వాదులు, భౌతిక వాదులంతా కూడా సూర్యుడినే స్పూర్తిగా తీసుకుంటారు. చీకట్లను తొలగించి వెలుగు మార్గం చూపే సూర్యుడిని ప్రగతికి సంకేతంగా చూస్తారు. పెరిక సమాజం కూడా సూర్యుడిలా ప్రకాశిస్తూ, తాము వెలుగుతూ అందరికీ వెలుగు పంచాలనే గొప్ప లక్ష్యం కలిగి ఉంది.
ఐదారు దశాద్దాల కిందనే పెరిక కులం తన కుల వృత్తిని కోల్పోయింది. అప్పుడు చదువే మార్గంగా పెరిక జాతి ఎదిగింది. చదువునే నమ్ముకుని పెరిక కులస్తులు అన్ని రంగాల్లో ఎదిగారు. వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించగలిగారు. 1975లోనే ఖైరతాబాద్ లో పెరిక విద్యార్థి వసతి గృహం ఏర్పాటు అయింది. పెరిక జాతి పునర్నిర్మాణంలో, దేదీప్యమానమైన ప్రస్థానంలో విద్య- పుస్తకానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. ఈ ఉజ్వల ప్రస్థానం, జ్ఞాన సముపార్జన ఇలాగే కొనసాగాలనే సందేశం ఇవ్వడానికి లోగోలో పుస్తకానికి ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది.
పెరిక కులానికి ఎడ్లబండితో విడదీయలేని సంబంధం ఉంది. పెరిక కులస్తులు జనపనారంతో చేసిన బోరాలు, బస్తాలతో ధాన్యాన్ని ఎడ్లబండ్లపై తీసుపోయే వారు. గ్రామాల్లో వ్యవసాయం చేసి పండించిన ఉత్పత్తులను, ఎడ్లబండితో తీసుకుని పోవడం ద్వారా వ్యాపారులుగా కూడా మారారు. ఈ రవాణా సాధనమే పెరిక కులస్తుల గమనశీలతకు కారణమైంది. నేటికీ వ్యవసాయ మార్కెట్లలో పెరిక కులస్తులు వ్యాపారులుగా ఉండడానికి ఈ నేపథ్యమే కారణం. అందుకే ఎడ్లబండి మన కులానికి ఓ చిహ్నంగా మారింది.
పెరిక కులస్తుడు మొదట రైతు. ఇప్పటికీ పెరిక కులస్తుల్లో అధిక శాతం రైతులే. పెరిక కుల నేపథ్యం వ్యవసాయంతో ముడిపడి ఉంది. సగటు రైతు జీవితమే పెరిక వాడి జీవితం.
పెరిక కులం కుల వృత్తి జనపనారతో బోరేలు కుట్టడం, బస్తాలు తయారు చేయడం. దానిని మార్కెట్ కు తీసుకుపోయి అమ్మడం. ఎడ్లబండ్లపై పెరికలు ( రెండు వైపులా ద్వారాలు ఉండే బస్తాలు) వేసుకుని ధాన్యాన్ని తరలించే వారు. అందుకే ఈ కులానికి పెరిక అనే పేరు వచ్చింది. జనపనార బస్తాలతో ఈ కుల నేపథ్యం ముడి పడి ఉన్నందున బస్తాలను లోగోలో చేర్చడం జరిగింది.
పెరిక కుల నేపథ్యమంతా వ్యవసాయమే కాబట్టి, లోగోలో కూడా వ్యవసాయ క్షేత్రాలను, పచ్చని పసిడి పంటలను పొందు పర్చడం జరిగింది.
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ పెరిక సంఘం ఏర్పాటు అయింది. నాటి నుంచి నేటి వరకు ఎంతో ప్రగతిశీలకంగా, క్రియాశీలకంగా కులం ముందుకు పోతున్నది. పరివర్తనకు, విప్లవానికి, వికాసానికి, నవసమాజ నిర్మాణానికి, సమసమాజ స్థాపనకు పెరిక కులం కట్టుబడి ఉందనే సందేశం ఇవ్వడానికి కులం రిజిస్ట్రేషన్ నెంబరును ఎరుపు రంగులో ఇవ్వడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు పెరిక జాతి పురోగతిలో కీలక పాత్ర పోషించే ఓ గొప్ప నంబరు అవుతుంది.
పెరిక అంటే ఏమిటి? పెరికలు అంటే ఎవరు? పెరిక అనే పేరు ఎలా వచ్చింది? పెరికల కుల వృత్తి ఏమిటి? కుల వృత్తి పోయాక పెరికలు ఏమి చేస్తున్నారు? ఏఏ రంగాల్లో పెరికలు ఎక్కడున్నారు. నిచ్చెల మెట్ల సమాజంలో పెరికల స్థానమేమిటి? బలహీన వర్గాలుగా ముద్ర పడ్డ మనం ఎవలం? నిజంగా బలహీనులమా? మరీ అంత వెనుకబడి పోయామా? మనం దేబరించి బతికే బానిస జాతి సంతతా?గుండెబలంతో ముందుకు దుమికే వీరుల వారసత్వమా?
కోకాపేటలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం
ఎల్.బి. నగర్ లో లేడీస్ హాస్టల్ నిర్మాణం
4 కోట్ల రూపాయల టర్నోవర్ తో పరపతి సంఘం
కోటి రూపాయల మూల నిధితో సంక్షేమ సమితి
35 అనుబంధ సంఘాలతో పెరిక సంఘం విస్తరణ
పెరికీయులకు ఉచిత వైద్యం, ఉచిత న్యాయ సహాయం
సమగ్ర పెరిక కుటుంబ సర్వే ప్రారంభం
పెరిక కుల వివాహ వేదిక ద్వారా ఉచిత వివాహాలు.
పెరిక కుల ఆత్మగౌరవ శిఖరంగా కోకాపేటలో పెరిక కుల ఆత్మ గౌరవ భవన నిర్మాణం జరుగుతున్నది. ఈ భవన నిర్మాణానికి విరివిగా విరాళాలు ఇవ్వండి. పెరిక జాతి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే అద్భత అవకాశాన్ని వినియోగించుకోండి.
విరాళాలు పంపాల్సిన అకౌంట్ : Telangana Perika Puragir Kshatriya Kula Sangam. A/C No : 000801219911, ICICI Bank, Khairathabad Branch. IFSC : ICICI0000008
2023 ఆగష్టు 27న జరిగిన పెరిక కుల ఆత్మ గౌరవ భవన శంఖుస్థాపన కార్యక్రమం పూర్తి వీడియో.
పదివేల మందికి పైగా హాజరైన పెరిక కులస్తులు.
పెరిక భవనానికి ఐదు కోట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన మంత్రులు.
బీసీ బందులో పెరిక కులస్తులను చేరుస్తామని చెప్పిన మంత్రులు
గంప గోవర్ధన్ గారికి త్వరలోనే అత్యున్నత పదవి వస్తుందని తేల్చి చెప్పిన మంత్రులు.
9 డిమాండ్లతో తీర్మానం ప్రవేశపెట్టిన గటిక విజయ్ కుమార్. ఆమోదించిన సభ. More..
ఎల్.బి.నగర్ బాలికల హాస్టల్ భూమి పూజ జరిగింది. త్వరలో నిర్మాణం ప్రారంభం అవుతుంది.
ప్రపంచ పెరిక కుల వివాహ వేదికలో రిజిష్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి.
అన్ని జిల్లాల కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ డిసెంబర్ మాసంలో ముగిసేలా షెడ్యూల్ ఖరారు అయ్యింది.
#ఈతల్లికూతుళ్లు...
#యావత్ #పెరకజాతికి #ఆదర్శం🙏🙏
మాటలకు అందని దాతృత్వాన్ని చేతల్లో చూపించిన మాతృమూర్తులు
ప్రకటించిన పది లక్షల విరాళం పూర్తిగా అందించి కమిటీకి ఆత్మవిశ్వాసం నింపి, ఆశీర్వదించిన ఆడపడుచులు
భావితరాలకు బంగారు బాట చూపించాలనేదే తమ తాపత్రయం అని ప్రకటించిన శ్రీమతి ముత్తినేని లలితా బాయ్ గారు, శ్రీమతి లక్కర్సు విజయలక్ష్మి గారు
ఇస్తామన్న విరాళం 100% ముందుగానే అందించి మాటలు కాదు చేతలు ముఖ్యమని పెరిక సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఘటన. More...
More...